యువజన వ్యవహారాలు, క్రీడల మంత్రిత్వ శాఖ
117 మంది అథ్లెట్లతో కూడిన జాతీయ శిబిరాన్ని మార్చి 31 వరకు పొడిగించేందుకు స్పోర్ట్స్ అథారిటీ ఆఫ్ ఇండియా ఆమోదం తెలిపింది.
Posted On:
05 JAN 2022 4:41PM by PIB Hyderabad
బర్మింగ్హామ్, హాంగ్ఝూలో ఈ ఏడాది జరిగే కామన్వెల్త్ గేమ్స్, ఆసియన్ గేమ్స్ కు సిద్ధం కావడానికి117 మంది ట్రాక్ అండ్ ఫీల్డ్ అథ్లెట్లు, 45 మంది కోచింగ్ సపోర్టింగ్ స్టాఫ్ కోసం దేశవ్యాప్తంగా ఐదు ప్రాంతాల్లో జాతీయ శిబిరాలను మార్చి 31 వరకు నిర్వహించేందుకు స్పోర్ట్స్ అథారిటీ ఆఫ్ ఇండియా ఆమోదం తెలిపింది.
నేతాజీ సుభాష్ నేషనల్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ స్పోర్ట్స్ (పాటియాలా), లక్ష్మీబాయి నేషనల్ కాలేజ్ ఆఫ్ ఫిజికల్ ఎడ్యుకేషన్ (తిరువనంతపురం), ఎస్ఏఐ నేషనల్ సెంటర్ ఆఫ్ ఎక్సలెన్స్ (బెంగళూరు), జవహర్‌లాల్ నెహ్రూ స్టేడియం (న్యూఢిల్లీ), ఉషా స్కూల్ ఆఫ్ అథ్లెటిక్స్ (బాలుసేరీ)లో 64 మంది పురుషులు 53 మంది మహిళా అథ్లెట్లకు జాతీయ శిబిరాలు జరుగుతున్నాయి. కేవలం17 సంవత్సరాల వయస్సులో వరల్డ్ అండర్20 ఛాంపియన్‌షిప్‌ల లాంగ్ జంప్ రజత పతక విజేత శైలీ సింగ్ ఈ క్యాంపర్లలో చిన్నవాడు. 2002లో వరల్డ్ జూనియర్ ఛాంపియన్‌షిప్ డిస్కస్ త్రో కాంస్య పతకాన్ని గెలుచుకున్న సీమా పునియా కూడా శిక్షణ పొందుతోంది. గత నాలుగు కామన్వెల్త్ గేమ్స్‌లో పోడియంపై నిలిచిన అత్యంత అనుభవజ్ఞుడైన క్రీడాకారిణి ఈమె. టోక్యో ఒలింపిక్ గేమ్స్ జావెలిన్ త్రో గోల్డ్ మెడలిస్ట్ నీరజ్ చోప్రా యునైటెడ్ స్టేట్స్‌లోని చులా విస్టాలో కోచ్ డాక్టర్ క్లాస్ బార్టోనిట్జ్ దగ్గర శిక్షణ పొందుతున్నారు.
క్రీడాకారులు:
పురుషులు:
400 మీటర్లు: మహ్మద్ అనస్ యాహియా, అరోకియా రాజీవ్, అమోజ్ జాకబ్, నోహ్ నిర్మల్ టామ్, నాగనాథన్ పాండి, హర్ష్ కుమార్, ఆయుష్ దబాస్, విక్రాంత్ పంచల్, మహ్మద్ అజ్మల్, సార్థక్ భాంబ్రీ, కపిల్, రాజేష్ రమేష్, కరణ్‌ప్రీత్ సింగ్, రషీద్.
800 మీటర్లు, 1500 మీటర్లు: మంజిత్ సింగ్, అజయ్ కుమార్ సరోజ్, అనకేష్ చౌదరి, క్రిషన్ కుమార్, రాహుల్, శశి భూషణ్, అభినందన్ సుందరేశన్, అంకిత్ ముజ్మిల్ అమీర్
5000 మీటర్లు & 10,000 మీటర్లు: అభిషేక్ పాల్, ధర్మేందర్, కార్తీక్ కుమార్ అమిత్ జాంగీర్
3000 మీటర్లు స్టీపుల్ చేజ్: అవినాష్ సాబ్లే, శంకర్ లాల్ స్వామి, బాలకిషన్, ఎండీ నూర్ హసన్, అతుల్ పూనియా.
400 మీటర్లు హర్డిల్స్: అయ్యసామి ధరుణ్, ఎంపీ జబీర్, సంతోష్ కుమార్, ధవల్ మహేష్ ఉటేకర్, థామస్ మాథ్యూ.
రేస్ వాక్: మనీష్ సింగ్ రావత్, సందీప్ కుమార్, రామ్ బాబూ, వికాస్ సింగ్, ఏక్నాథ్, జునేద్, సూరజ్ పవార్, అమిత్ ఖత్రి.
లాంగ్ జంప్: నిర్మల్ సాబు, మహమ్మద్ అనీస్, యుగంత్ శేఖర్ సింగ్, టీజే జోసెఫ్.
ట్రిపుల్ జంప్: యు కార్తీక్, అబ్దుల్లా అబూబకర్, ఎల్దోస్ పాల్, గెలీ వెనిస్టర్ దేవసహాయం.
షాట్‌పుట్: తేజిందర్‌పాల్ సింగ్ టూర్, ఓం ప్రకాష్ సింగ్, కరణవీర్ సింగ్.
డిస్కస్ త్రో: అభినవ్, ఇక్రమ్ అలీ ఖాన్, అర్జున్ కుమార్.
జావెలిన్ త్రో: రోహిత్ యాదవ్, సాహిల్ సిల్వాల్, యశ్వీర్ సింగ్, అర్ష్‌దీప్ సింగ్ అభిషేక్ డ్రాల్.
మహిళలు:
100 మీటర్లు 200 మీటర్లు: ద్యుతీ చంద్, ఎస్ ధనలక్ష్మి, హిమ దాస్, ఎకె దానేశ్వరి, పిడి అంజలి, ఎన్ఎస్ సిమి, కావేరీ పాటిల్, నిత్య గాంధీ.
400 మీటర్లు: అంజలీ దేవి, ఎంఆర్ పూవమ్మ, వికె విస్మయ, ప్రియ హెచ్ మోహన్, వి రేవతి, వి శుభ, సమ్మి, రచన, నాన్సీ, ఆర్ విత్య, దండి జ్యోతిక, జిస్నా మాథ్యూ.
800 మీటర్లు, 1500 మీటర్లు, 5000 మీటర్లు: లిలీ దాస్, పియు చిత్ర, చందా, చత్రు గుమ్నారం.
5000 మీటర్లు , 10,000 మీటర్లు: కవిత యాదవ్.
మారథాన్: సుధా సింగ్.
3000 మీటర్లు స్టీపుల్ చేజ్: పారుల్ చౌదరి, ప్రీతి లాంబా.
రేస్ వాక్: భావన జాట్, ప్రియాంక గోస్వామి, సోనాల్ సుఖ్వాల్, రమణదీప్ కౌర్, రవీనా.
లాంగ్ జంప్: శైలి సింగ్, రేణు, ఆన్సి సోజన్, పూజా సైనీ.
షాట్‌పుట్: మన్‌ప్రీత్ కౌర్ సీనియర్, అభా కథువా, కచ్నార్ చౌదరి.
డిస్కస్ త్రో: సీమా పునియా, కమల్‌ప్రీత్ కౌర్, నిధి రాణి, సునీత.
జావెలిన్ త్రో: అన్నూ రాణి, కుమారి షర్మిల సంజనా చౌదరి.
హ్యామర్ త్రో: మంజు బాలా, సరితా ఆర్ సింగ్.
హెప్టాథ్లాన్: పూర్ణిమ హెంబ్రామ్, మరీనా జార్జ్, సోను కుమారి, కాజల్.
***
(Release ID: 1787831)
Visitor Counter : 171