రక్షణ మంత్రిత్వ శాఖ
ప్రభుత్వోద్యోగిని హత్య చేయడం లేదా అందుకు ప్రోత్సహించడం వంటి అభియోగాలు మోపిన ఫించనదారు కుటుంబంలోని అర్హత గల సభ్యులకు కుటుంబ పింఛనును అమలు చేస్తున్న రక్షణ మంత్రిశాఖ (ఎంఒడి)
Posted On:
05 JAN 2022 4:34PM by PIB Hyderabad
ప్రభుత్వ ఉద్యోగిని హత్య చేశారు లేదా అటువంటి నేరం జరగడానికి ప్రోత్సహించారనే నేరారోపణలను ఎదుర్కొంటున్న లేదా మోపిన వ్యక్తి కుటుంబంలోని అర్హులైన సభ్యులకు కుటుంబ ఫించన్ ఇవ్వడాన్ని పింఛన్లు & పింఛన్ల సంక్షేమ విభాగం (డిఒపి & పిడబ్ల్యు) 16 జూన్ 2021న జారీ చేసిన ప్రత్యేక ఉత్తర్వుల (ఓఎం) ద్వారా అనుమతించింది.
రక్షణ శాఖకు చెందిన మాజీ సైనికోద్యోగుల సంక్షేమ విభాగం ఈ మేరకు 05, 2022న సాయుధదళాల ఫించనర్లకు పైన పేర్కొన్న ప్రత్యేక ఉత్తర్వులలోని డిఒపి& పిడబ్ల్యు మ్యుటాటిస్ - మ్యుటాండిస్ (సమస్యలోని ప్రధాన అంశాన్ని ప్రభావితం చేయకుండా అవసరమైన మార్పులను చేయడం)లో ఉన్న నిబంధనలను వర్తింపచేయడం గురించి ఉత్తర్వులను జారీ చేసింది.
***
(Release ID: 1787748)
Visitor Counter : 171