హోం మంత్రిత్వ శాఖ
హోం వ్యవహారాల మంత్రిత్వ శాఖ ఆధ్వర్యంలోని సైబర్, ఇన్ఫర్మేషన్ సెక్యూరిటీ విభాగానికి చెందిన ఇండియన్ సైబర్ క్రైమ్ కోఆర్డినేషన్ సెంటర్ (14సి) నిబంధనావళులను, న్యూస్‌లెటర్‌ను విడుదల చేసిన కేంద్ర హోం కార్యదర్శి
Posted On:
03 JAN 2022 6:53PM by PIB Hyderabad
హోం మంత్రిత్వ శాఖలోని సైబర్ అండ్ ఇన్ఫర్మేషన్ సెక్యూరిటీ డివిజన్ (సిఐఎస్) ఆధ్వర్యంలోని ఇండియన్ సైబర్ క్రైమ్ కోఆర్డినేషన్ సెంటర్ (14సి)కి సంబంధించిన మూడు నిబంధనావళులను (మాన్యువళ్ళను), న్యూస్ లెటర్‌ను కేంద్ర హోం శాఖ కార్యదర్శి సోమవారం న్యూఢిల్లీలో విడుదల చేశారు.
విడుదల చేసిన నిబంధనావళులు, న్యూస్ లెటర్లు -
సైబర్ స్పేస్ కోసం సైబర్ పరిశుభ్రత - చేయవలసిన- చేయకూడని పనులు - ప్రాథమిక నిబంధనావళి
సైబర్ స్పేస్ కోసం సైబర్ పరిశుభ్రత - చేయవలసిన - చేయకూడని పనులు - అభివృద్ధి చేసిన నియమావళి
త్రైమాసిక న్యూస్ లెటర్ - సైబర్ ప్రవాహ్
సైబర్ నేరాల నివారణకు గ్రామీణ ప్రాంతాలు, పారిశ్రామిక సంస్థలు, సాధారణ ప్రజలలో సైబర్ విజ్ఞానాన్ని పెంపొందించడపై దృష్టి పెట్టిన అవగాహనా ప్రచారంలో ఈ నిబంధనావళులు భాగం. త్రైమాసిక న్యూస్ లెటర్ - సైబర్ ప్రవాహ్, 14సి పరిచయాన్ని, రెండు త్రైమాసికాలకు (ఏప్రిల్- జూన్ 2021 / జులై- సెప్టెంబర్ 2021) 14సికి సంబంధించిన వివిధ కార్యకలాపాలు, సైబర్ నేరాల సరళులు, గణాంకాలు, 14సి సృష్టించిన సౌకర్యాలు, సైబర్ నేరాలను రిపోర్ట్ చేసేందుకు అందరు భాగస్వాములకు చైతన్యం కల్పించి, సైబర్ నేరాల నిరోధంలో సహాయాన్ని అందించడం, నిఘా దర్యాప్తు అంశాలను పొందుపరిచారు. సైబర్ నేరాలు, సైబర్ నేరాల పదావళి క్షేత్రంలో చోటు చేసుకున్న నూతన పరిణామాల గురించి చైతన్యం సృష్టించడం కూడా న్యూస్ లెటర్ లక్ష్యాలలో ఒకటి.
కేంద్ర స్థాయిలో సమన్వయం కోసం ఒక ఏజెన్సీగా, సైబర్ నేరాలపై వారి పోరాటంలో ఉమ్మడి చట్రాన్ని అందించడం ద్వారా రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాలకు తోడ్పాటును అందించడం కోసం 2018 సిఐఎస్ డివిజన్ కింద కేంద్ర స్థాయిలో 14సిని ఏర్పాటు చేశారు.
వివిధ సోషల్ మీడియా హాండిళ్ళ పై సైబర్ దోస్త్ పేరుతో ప్రజలకు సైబర్ భద్రతా చిట్కాలను 14సి అందిస్తోంది.
***
(Release ID: 1787414)
Visitor Counter : 252