ప్రధాన మంత్రి కార్యాలయం
జనవరి 4వ తేదీ న మణిపుర్ లోను, త్రిపుర లోను పర్యటించనున్న ప్రధాన మంత్రి
మణిపుర్ లోప్రధాన మంత్రి 4800 కోట్ల రూపాయలకు పైచిలుకు విలువైన 22 ప్రాజెక్టుల లో కొన్నిటి ని ప్రారంభించి, మరికొన్నిటి కి శంకుస్థాపనచేస్తారు
దేశం లో అన్నిప్రాంతాల లో సంధానాన్ని మెరుగుపరచాలనే ప్రధాన మంత్రి దార్శనికత కు అనుగుణం గా 1,700 కోట్ల రూపాయలకు పైగా విలువైన జాతీయ రహదారుల పనుల కుశంకుస్థాపన జరుగనుంది
మొబైల్‌సంధానాని కి పెద్ద దన్ను గా దాదాపు 1100 కోట్ల రూపాయలఖర్చు తో నిర్మించిన 2350 మొబైల్ టవర్ లను దేశ ప్రజల కు అంకితం చేయడం జరుగుతుంది
ఆరోగ్య రంగానికిపెను ఉత్తేజం: అత్యంత ఆధునిక కేన్సర్ ఆసుపత్రి కి శంకుస్థాపన చేయడంజరుగుతుంది; కొత్త గా నిర్మించిన 200 పడక ల కోవిడ్ఆసుపత్రి ని ప్రారంభించడం జరుగుతుంది
మణిపుర్ లో అతి పెద్దపిపిపి కార్యక్రమం లో భాగం గా ‘సెంటర్ ఫర్ ఇన్వెన్శన్.. ఇనొవేశన్.. ఇన్ క్యూబేశన్ ఎండ్ట్రైనింగ్’కు శంకుస్థాపన చేయడం జరుగుతుంది; ఇది ఉపాధి అవకాశాల కు ఊతాన్ని అందిస్తుంది
‘మణిపూర్ ఇన్స్ టిట్యూట్ ఆఫ్ పర్ ఫార్మింగ్ ఆర్ట్స్’కు శంకుస్థాపన చేయడం జరుగుతుంది; దీనిని గురించి 1990వ సంవత్సరం లో మొదటిసారి గా ఆలోచన చేయడమైనప్పటికీ చాలాఏళ్లు గా ఈ ఆలోచన కార్యరూపం దాల్చలేకపోయింది
‘సబ్ కా సాథ్-సబ్ కా వికాస్-సబ్ కావిశ్వాస్’ అనే ప్రధాన మంత్రి తారకమంత్రాని కి అనుగుణం గా, ‘ప్రధాన మంత్రి జన్ వికాస్ కార్యక్రమం’ లో భాగం గా 130 కోట్ల రూపాయలవిలువైన ప్రాజెక్టుల కు శంకుస్థాపన జరుగనుంది; ఈ ప్రాజెక్టుల తో అల్ప సంఖ్యాకవర్గాల వారికి లబ్ధి చేకూరగలదు
తాగునీటి సరఫరా, పట్టణ ప్రాంతాల అభివృద్ధి, గృహనిర్మాణం, చేనేతలు మరియునైపుణ్యాల అభివృద్ధివంటి బహుళ రంగాలకు సైతం ప్రయోజనం కలుగనుంది; ఇది ఈశాన్య ప్రాంతాల సమగ్ర అభివృద్ధి పైప్రధాన మంత్రి దృష్టికోణానికి అనుగుణం గా ఉంటుంది
త్రిపుర లోమహారాజా బీర్ బిక్రమ్ విమానాశ్రయం లో కొత్త సమీకృత టర్మినల్ ను ప్రారంభించనున్నప్రధాన మంత్రి; ఇదిదేశం లో అన్ని విమానాశ్రయాల లో ఆధునిక సౌకర్యాల కల్పన పై ప్రధానమంత్రి కృషి కి అనుగుణం గా ఉంది
త్రిపుర లో ‘ముఖ్యమంత్రి త్రిపుర గ్రామ సమృద్ధి యోజన’ ను 100 విద్య జ్యోతి పాఠశాల ల తో కూడిన ప్రాజెక్ట్ మిశన్ ను సైతం ప్రారంభించనున్న ప్రధాన మంత్రి
Posted On:
02 JAN 2022 3:34PM by PIB Hyderabad
ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ 2022వ సంవత్సరం లో జనవరి 4వ తేదీ నాడు మణిపుర్, త్రిపుర రాష్ట్రాల లో పర్యటించనున్నారు. ఈ సందర్భం గా ఆ రోజు న మధ్యాహ్నం 11 గంటల కు మణిపుర్ రాజధాని ఇంఫాల్ లో 4800 కోట్ల రూపాయల విలువైన 22 ప్రాజెక్టుల కు ప్రధాన మంత్రి ప్రారంభోత్సవం\శంకుస్థాపన చేస్తారు. ఆ తరువాత మధ్యాహ్నం 2 గంటలకు త్రిపుర రాజధాని అగర్ తలా లో మహారాజా బీర్ బిక్రమ్ విమానాశ్రయం లో కొత్తగా ఏర్పాటైన సమీకృత టర్మినల్ భవనాన్ని ప్రారంభించడంతో పాటు గా రెండు ప్రధానమైన అభివృద్ధి కార్యక్రమాల కు కూడా ప్రధాన మంత్రి ప్రారంభించనున్నారు.
మణిపుర్ లో ప్రధాన మంత్రి
మణిపుర్ లో 1800 కోట్ల రూపాయల విలువైన 13 ప్రాజెక్టుల ను ప్రధాన మంత్రి ప్రారంభించనున్నారు. అలాగే 2,950 కోట్ల రూపాయల విలువైన మరో 9 ప్రాజెక్టుల కు శంకుస్థాపన కూడా చేయనున్నారు. ఈ ప్రాజెక్టు లు రహదారి మౌలిక సదుపాయాలు, తాగునీటి సరఫరా, ఆరోగ్యం, పట్టణ ప్రాంతాల అభివృద్ధి, గృహనిర్మాణం, సమాచార సాంకేతిక పరిజ్ఞానం, నైపుణ్యాల అభివృద్ధి, కళలు మరియు సంస్కృతి వంటి వివిధ రంగాల కు సంబంధించినవి.
దేశవ్యాప్తం గా అనుసంధానం మెరుగుదల పై ప్రధాన మంత్రి దార్శనికత మేరకు 1,700 కోట్ల రూపాయలకు పైగా ఖర్చు తో 5 జాతీయ రహదారి పనుల కు ప్రధాన మంత్రి శంకుస్థాపన చేస్తారు. ఇవన్నీ కలిసి మొత్తం 110 కిలోమీటర్ల మేర నిర్మాణం కానుండగా, ఈ ప్రాంతం లో రహదారుల సంధానం దిశ గా కీలకమైనటువంటి ముందంజ పడుతుంది. దీనితో పాటు గా ఇంఫాల్ నుంచి సిల్ చర్ కు ఏడాది పొడవునా నిరంతర సంధానం మెరుగుదల, ఇంకా ట్రాఫిక్ రద్దీ తగ్గింపు లక్ష్యాలు గా జాతీయ రహదారి-37 పై బరాక్ నది మీద 75 కోట్ల రూపాయల ఖర్చు తో ఉక్కు వంతెన నిర్మాణం మౌలిక సదుపాయాల కల్పన లో మరో ముఖ్యమైన ప్రాజెక్టు కానుంది. ప్రధాన మంత్రి తన పర్యటన లో ఈ ఉక్కు వంతెన ను ప్రారంభించనున్నారు. అలాగే దాదాపు 1100 కోట్ల రూపాయల తో నిర్మించిన 2,387 మొబైల్ టవర్ లను మణిపుర్ ప్రజల కు ప్రధాన మంత్రి అంకితం చేస్తారు. రాష్ట్రం లో మొబైల్ సంధానాన్ని మరింత పెంచే దిశ లో ఇది ఒక కీలకమైనటువంటి ముందడుగు కానుంది.
ప్రధాన మంత్రి చేతుల మీదు గా రాష్ట్రం లో తాగునీటి సరఫరా ప్రాజెక్టుల ప్రారంభోత్సవం తో ఇంటింటికి శుద్ధమైన తాగునీటి ని అందించాలనే ప్రధాన మంత్రి కృషి కి మరింత ఊపు లభిస్తుంది. ఈ మేరకు ఆయన ప్రారంభించనున్న పథకాల లో ఇంఫాల్ నగరానికి తాగునీటిని అందించే 280 కోట్ల రూపాయల విలువైన ‘థౌబల్ మల్టి-పర్పస్ ప్రాజెక్ట్ వాటర్ ట్రాన్స్ మిశన్ సిస్టమ్’ కూడా ఒకటి. ఇదేకాకుండా ప్రధాన మంత్రి ప్రారంభించే ప్రాజెక్టుల లో- తామెంగ్ లోంగ్ జిల్లా లోని పది ఆవాసాల ప్రజల కు సురక్షిత తాగునీటిని అందించేందుకు 65 కోట్ల రూపాయలతో నిర్మించిన తామెంగ్ లోంగ్ జిల్లా కేంద్ర జల సంరక్షణ-నీటి సరఫరా ప్రాజెక్టు, 51 కోట్ల రూపాయల ఖర్చు తో సేనాపతి జిల్లా ప్రాంతావాసుల కు నీటి సరఫరరా కై ఉద్దేశించిన జిల్లా కేంద్ర నీటి సరఫరా పథకం అభివృద్ధి ప్రాజెక్టు లు కూడా ఉన్నాయి.
రాష్ట్రం లో ఆరోగ్య రంగాన్ని బలోపేతం చేసే కృషి లో భాగం గా ఇంఫాల్ నగరం లో ప్రభుత్వ-ప్రైవేట్ భాగస్వామ్యం తో నిర్మించబోయే దాదాపు 160 కోట్ల రూపాయల విలువైన అత్యాధునిక కేన్సర్ ఆసుపత్రి కి ప్రధాన మంత్రి శంకుస్థాపన చేయనున్నారు. ఈ ఆసుపత్రి నిర్మాణం తో కేన్సర్ సంబంధి పరీక్ష ల కోసం, చికిత్స కోసం రాష్ట్ర ప్రజలు ఇతర ప్రాంతాల కు వెళ్లడానికి అయ్యే ఖర్చు యొక్క భారం తగ్గుతుంది. అంతేకాకుండా కోవిడ్ సంబంధి మౌలిక వసతుల కు ఉత్తేజాన్ని ఇస్తూ డిఆర్‌డిఒ సహకారం తో 37 కోట్ల రూపాయల తో కియామ్ గెయి లో కొత్త గా నిర్మించిన 200 పడకల కోవిడ్ ఆసుపత్రి ని కూడా ప్రధాన మంత్రి ప్రారంభించనున్నారు.
దేశం లోని నగరాల కు పునరుజ్జీవం, పరివర్తన కోసం ప్రధాన మంత్రి కొనసాగిస్తున్న నిరంతర కృషి ఫలించే దిశ గా ‘ఇంఫాల్ స్మార్ట్ సిటీ మిశన్’ లో భాగం గా అనేక ప్రాజెక్టు లు పూర్తి కావలసి ఉంది. దీనికి సంబంధించి రూ.170 కోట్ల రూపాయలకు పైగా ఖర్చు తో ఇప్పటికే పూర్తి అయిన మూడు ప్రాజెక్టుల ను ప్రధాన మంత్రి ప్రారంభించనున్నారు. వీటిలో- ‘ఇంటిగ్రేటెడ్ కమాండ్ ఎండ్ కంట్రోల్ సెంటర్’ (ఐసిపిసి), ఇంఫాల్ నది పై ‘వెస్టర్న్ రివర్ ఫ్రంట్ డెవలప్‌మెంట్’ (ఫేజ్-1) సహా థంగల్ బాజార్ లో ‘మాల్ రోడ్ డెవలప్‌మెంట్’ (ఫేజ్-1) పథకాల ను ప్రధాన మంత్రి ప్రారంభించనున్నారు. ఇంటిగ్రేటెడ్ కమాండ్ అండ్ కంట్రోల్ సెంటర్ ద్వారా నగరం లో వాహన రాక పోక ల నిర్వహణ, ఘన వ్యర్థాల నిర్వహణ, నగరవ్యాప్త నిఘా సహా అనేక రకాల సాంకేతిక పరిజ్ఞాన ఆధారిత సేవ లు లభించనున్నాయి. మిగిలిన అభివృద్ధి పథకాలు పర్యటక, స్థానిక ఆర్థిక వ్యవస్థ పురోగమనాని కి బాటల ను వేయడంతో పాటు ఉపాధి అవకాశాల ను కూడా కల్పించనున్నాయి.
మణిపుర్ లో 200 కోట్ల రూపాయల ఖర్చు తో నిర్మించనున్న పిపిపి ప్రాజెక్టు ‘సెంటర్ ఫర్ ఇన్ వెన్శన్, ఇనొవేశన్, ఇంక్యూబేశన్ ఎండ్ ట్రైనింగ్’ (సిఐఐఐటి) కి ప్రధాన మంత్రి శంకుస్థాపన చేస్తారు. ఇది ‘పిపిపి’ విధానం లో చేపట్టిన అతి పెద్ద ప్రాజెక్టు కాగా, దీని వల్ల రాష్ట్రం లో సమాచార సాంకేతిక రంగానికి ఊపు లభించడంతో పాటు ఉపాధి అవకాశాలు కూడా పెరుగుతాయి.
హరియాణా లో గుడ్ గాఁవ్ లో ‘మణిపుర్ ఇన్స్ టిట్యూట్ ఆఫ్ పెర్ ఫార్మింగ్ ఆర్ట్స్’కు ప్రధాన మంత్రి శంకుస్థాపన చేయనున్నారు. హరియాణా రాష్ట్రం లో మణిపుర్ కు చెందిన సాంస్కృతిక సంస్థ ఏర్పాటు కు 1990 వ సంవత్సరం లోనే ప్రతిపాదన రూపొందినప్పటికీ ఇన్నేళ్లు గా అది కార్యరూపం దాల్చలేదు. ఈ సంస్థ 240 కోట్ల రూపాయల వ్యయం తో రూపుదిద్దుకోనుండగా మణిపుర్ రాష్ట్ర కళల కు, మణిపుర్ రాష్ట్ర సంస్కృతి కి ఎనలేని ప్రోత్సాహం లభించనుంది. కాగా రాష్ట్ర సుసంపన్న సాంస్కృతిక వారసత్వాన్ని మరింత బలోపేతం చేస్తూ ఇంఫాల్ లో పూర్తిగా నవీకరించి, కొత్త సొబగులు దిద్దిన గోవిందజీ ఆలయాన్ని ప్రధాన మంత్రి ప్రారంభించనున్నారు. భారతదేశం స్వాతంత్ర్య సమరం లో ఇండియన్ నేశనల్ ఆర్మీ (ఐఎన్‌ఎ) పోషించినటువంటి కీలక పాత్ర ను కళ్లకు కట్టే ‘ఐఎన్‌ఏ’ భవన సముదాయాన్ని కూడా ఆయన మొయిరంగ్ లోని ఐఎన్ఎ భవన సముదాయం ప్రాంతం లో ప్రారంభించనున్నారు.
‘సబ్ కా సాథ్-సబ్ కా వికాస్- సబ్ కా విశ్వాస్’ అనే ప్రధాన మంత్రి తారకమంత్రాని కి అనుగుణం గా అల్పసంఖ్యాక వర్గాల వారి కి లబ్ధి లక్ష్యం గా 130 కోట్ల రూపాయల వ్యయం తో ‘ప్రధాన మంత్రి జన్ వికాస్ కార్యక్రమం’ లో భాగం గా చేపట్టే 72 ప్రాజెక్టుల కు ప్రధాన మంత్రి శ్రీకారం చుడతారు. ఈ ప్రాజెక్టు లు అల్పసంఖ్యాక వర్గాల సమగ్ర అభివృద్ధి తో పాటు ఆరోగ్యం, విద్య రంగాల లో మౌలిక వసతుల కల్పన కు తోడ్పడతాయి.
రాష్ట్రం లో చేనేత పరిశ్రమ ను పటిష్టం చేయడం లో భాగం గా ప్రధాన మంత్రి 36 కోట్ల రూపాయల విలువైన రెండు ప్రాజెక్టుల కు శంకుస్థాపన చేయనున్నారు. వీటిలో తూర్పు ఇంఫాల్ జిల్లా నాంగ్‌పోక్ కాక్ చింగ్ లో ‘మెగా హేండ్ లూమ్ క్లస్టర్’ ఒకటి కాగా, దీనివల్ల జిల్లా లోని సుమారు 17,000 మంది నేత కార్మికుల కు ప్రయోజనం దక్కుతుంది. అలాగే మొయిరాంగ్ లో ఏర్పాటయ్యే ‘క్రాఫ్ట్ ఎండ్ హేండ్ లూమ్ విలేజ్’ చేనేత కుటుంబాల కు తోడ్పాటు ను ఇవ్వడమే కాకుండా మొయిరంగ్ పర్యటక సామర్థ్యాన్ని ఇనుమడింపజేస్తుంది. అలాగే లోక్‌తక్ సరస్సు సమీపం లోని స్థానిక ప్రజల కు ఉపాధి కల్పన లో దోహదపడుతుంది.
న్యూ చెకాన్ లో రమారమి 390 కోట్ల రూపాయల వ్యయం తో నిర్మాణం కానున్న ప్రభుత్వ నివాస గృహాల నిర్మాణానికి కూడా ప్రధాన మంత్రి శంకుస్థాపన చేయనున్నారు. ఇది ఆధునిక సౌకర్యాల తో కూడిన ఇంటిగ్రేటెడ్ హౌసింగ్ కాలనీ గా రూపొందనుంది. తూర్పు ఇంఫాల్ పరిధి లోని ఇబుధౌమార్ జింగ్ లో రోప్‌వే ప్రాజెక్టు కు కూడా ప్రధాన మంత్రి శంకుస్థాపన చేస్తారు.
ఇవేకాకుండా ప్రధాన మంత్రి ప్రారంభించనున్న ఇతర ప్రాజెక్టుల లో నైపుణ్యాభివృద్ధి మౌలిక సదుపాయాల (ఐఎస్ డిఐ) కల్పన ను పెంచే క్రమం లో కాంగ్ పోక్ పీ లో నిర్మించిన కొత్త పారిశ్రామిక శిక్షణ సంస్థ (ఐటిఐ), ఇంకా సమాచార- పౌర సంబంధాల డైరెక్టరేట్ యొక్క కొత్త కార్యాలయ భవనం కూడా ఉన్నాయి.
త్రిపురలో ప్రధాన మంత్రి
ప్రధాన మంత్రి త్రిపుర సందర్శన కాలం లో, మహారాజా బీర్ బిక్రమ్ (ఎంబిబి) ) విమానాశ్రయం సమీకృత టర్మినల్ కొత్త భవనాన్ని, ‘ముఖ్యమంత్రి త్రిపుర గ్రామ సమృద్ధి యోజన’ ను, 100 విద్య జ్యోతి పాఠశాల లతో కూడినటువంటి మిశన్ ప్రాజెక్ట్ ను ప్రారంభిస్తారు.
మహారాజా బీర్ బిక్రమ్ విమానాశ్రయం కొత్త సమీకృత టర్మినల్ భవనాన్ని దాదాపు రూ.450 కోట్ల రూపాయల ఖర్చు తో నిర్మించడమైంది. ఇది 30,000 చదరపు మీటర్ ల విస్తీర్ణం లో ఆధునిక సౌకర్యాల తో, తాజా సమగ్ర వ్యవస్థ గల ఐటీ నెట్‌వర్క్ తో అందుబాటు లోకి వస్తోంది. దేశం లోని అన్ని విమానాశ్రయాల లో ఆధునిక సౌకర్యాల కల్పన దిశ గా ప్రధాన మంత్రి కృషి మేరకు ఈ కొత్త టర్మినల్ భవనం రూపుదిద్దుకొంది.
రాష్ట్రం లో విద్య నాణ్యత ను మెరుగుపరచాలనేది 100 విద్య జ్యోతి పాఠశాల ల తో కూడినటువంటి ప్రాజెక్ట్ మిశన్ లక్ష్యం గా ఉంది. ఈ మేరకు ప్రస్తుతం నడుస్తున్న 100 ఉన్నత పాఠశాలల ను/ఉన్నత-మాధ్యమిక పాఠశాలల ను నాణ్యమైన బోధన సదుపాయాలు, అత్యాధునిక సౌకర్యాల తో విద్య జ్యోతి పాఠశాలలు గా మార్చడం జరుగుతుంది. వీటిలో శిశు విద్యాలయం నుంచి 12వ తరగతి వరకు సుమారు 1.2 లక్షల విద్యార్థుల విద్యాభ్యాసానికి గాను రాబోయే మూడు సంవత్సరాల లో 500 కోట్ల రూపాయల దాకా ఖర్చు చేయనున్నారు.
గ్రామం స్థాయి లో కీలక ప్రగతి రంగాల సంబంధి సేవా ప్రదానం లో నిర్దేశిత ప్రమాణాల సాధన అనేది ‘ముఖ్యమంత్రి త్రిపుర గ్రామ సమృద్ధి యోజన’ లక్ష్యం గా ఉంది. ఇంటి నల్లా కనెక్శన్ లు, ఇంటి విద్యుత్తు కనెక్శన్ లు, అన్ని వాతావరణాల లోను అనువు గా ఉండే రహదారులు, ప్రతి ఇంటి కి టాయిలెట్ లు, ప్రతి బిడ్డ కు సిఫారసు చేయబడిన వ్యాధి నిరోధక టీకాలు, స్వయం సహాయక సమూహాల లో మహిళ ల భాగస్వామ్యం మొదలైనవి ఈ యోజన కోసం ఎంపిక చేయబడిన ముఖ్య రంగాలుగా ఉన్నాయి. గ్రామాలు నిర్దేశిత ప్రమాణాల ను సాధించడానికి గ్రామాల కు ఈ పథకం ప్రోత్సాహాన్ని అందిస్తుంది. వివిధ రంగాల లో సేవల అందజేత కై బెంచ్‌మార్క్ ప్రమాణాలు మరియు అట్టడుగు స్థాయి లో సేవల అందజేత ను మెరుగుపరచడం కోసం గ్రామాల మధ్య ఆరోగ్యకరమైన పోటీ ని ప్రేరేపించగలదని భావిస్తున్నారు.
***
(Release ID: 1787141)
Visitor Counter : 164
Read this release in:
Punjabi
,
Odia
,
English
,
Urdu
,
Marathi
,
Hindi
,
Bengali
,
Manipuri
,
Assamese
,
Gujarati
,
Tamil
,
Kannada
,
Malayalam