ఆర్థిక మంత్రిత్వ శాఖ

2021 డిసెంబర్ నెలలో 1,29,780 కోట్ల రూపాయల జీఎస్టీ వసూళ్లు

Posted On: 01 JAN 2022 1:40PM by PIB Hyderabad

దేశంలో 2021 డిసెంబర్ నెలలో 1,29,780 కోట్ల రూపాయల విలువ చేసే జీఎస్టీ వసూళ్లు జరిగాయి. దీనిలో సి జీఎస్టీ 22,578 కోట్ల రూపాయలుగా, ఎస్ జీఎస్టీ 28,658 కోట్ల రూపాయలు, ఐజీఎస్టీ 69,155 కోట్ల రూపాయలు ( దిగుమతి అయిన వస్తువులపై వసూలు చేసిన 37,527 కోట్ల రూపాయలను కలుపుకుని), 9,389 కోట్ల రూపాయల సెస్ వసూళ్లు (వస్తువుల దిగుమతిపై సేకరించిన 614 కోట్ల రూపాయలతో సహా) ఉన్నాయి.

ఐజీఎస్టీ ఆదాయంలో సి జీఎస్టీ కి 25,568 కోట్ల రూపాయలను, ఎస్ జీఎస్టీ కి 21,102 కోట్ల రూపాయలను ప్రభుత్వం సర్దుబాటు చేసింది. సాధారణ సర్దుబాట్లు పూర్తయిన తర్వాత 2021 డిసెంబర్ నెలలో కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలకు లభించిన ఆదాయం 48,146 కోట్ల రూపాయలు (సి జీఎస్టీ),49,760 కోట్ల రూపాయలు (ఎస్ జీఎస్టీ) గా ఉంది.

గత ఏడాది డిసెంబర్ నెల తో పోల్చి చూస్తే దేశంలో 2021 డిసెంబర్ నెలలో జీఎస్టీ వసూళ్లు 13 %, 2019 డిసెంబర్ నెలతో పోల్చి చూస్తే 26% మేరకు పెరిగాయి. ఈ నెలలో దేశంలో జరిగిన లావాదేవీలు ( సేవల దిగుమతి తో కలుపుకుని)కంటే దిగుమతి చేసుకున్న వస్తువులపై 36% ఎక్కువ ఆదాయం వచ్చింది. గత ఏడాది డిసెంబర్ తో పోల్చి చూస్తే ఈ వృద్ధి 5% వరకు ఉంది.

2021 అక్టోబర్ నెలలో జారీ అయిన ( 7.4 కోట్లు) పోల్చి చూస్తే నవంబర్ నెలలో జారీ అయిన వే-బిల్లుల సంఖ్య (6.1) 17% మేరకు తగ్గింది. అయితే, నెలలో 1.30 లక్షల కోట్ల వరకు జీఎస్టీ వసూళ్లు జరిగాయి. పన్ను చెల్లింపుల అంశంలో కేంద్ర ప్రభుత్వం అమలు చేస్తున్న విధానాలు, పరిపాలనా పరమైన చర్యల వల్ల ఇది సాధ్యమయ్యింది.

ప్రస్తుత సంవత్సరం మూడవ త్రైమాసికంలో సగటు నెలవారీ స్థూల జీఎస్టీ వసూళ్లు 1.30 లక్షల కోట్ల రూపాయలుగా ఉన్నాయి. మొదటి మరియు రెండవ త్రైమాసికాల్లో వరుసగా 1.10 లక్షల కోట్ల రూపాయలు, 1.15 లక్షల కోట్లరూపాయల వరకు సగటు నెలవారీ వసూళ్లు జరిగాయి.

ఆర్థిక పునరుద్ధరణ, ఎగవేత నిరోధక కార్యకలాపాలు, ముఖ్యంగా నకిలీ బిల్లు లపై చర్యలు లాంటి అంశాలు జీఎస్టీ వసూళ్లను పెంచుతున్నాయి. విలోమన సుంకం విధింపు వ్యవస్థలోవివిధ రేట్ల హేతుబద్ధీకరణతో పాటు కౌన్సిల్ చేపట్టిన చర్యల వల్ల కూడా ఆదాయం మెరుగుపడింది. చివరి త్రైమాసికంలో కూడా వసూళ్లలో సానుకూల ధోరణి కొనసాగుతుందని అంచనా.

ఈ కింది చార్ట్ ప్రస్తుత సంవత్సరంలో నెల వారీగా స్థూల జీఎస్టీ ఆదాయాన్ని తెలియజేస్తుంది.

2021, 2020 డిసెంబర్ నెలలో రాష్ట్రాల వారీగా జీఎస్టీ గణాంకాల వివరాలను పట్టికలో పొందుపరచడం జరిగింది.

 

 

 

 

డిసెంబర్ 2021లో రాష్ట్రాల వారీగా జీఎస్టీ రాబడిలో వృద్ధి [1]

 

రాష్ట్రం

డిసెంబర్ -20

డిసెంబర్ -21

వృద్ధి

జమ్మూ కాశ్మీర్

318

320

0%

హిమాచల్ ప్రదేశ్

670

662

-1%

పంజాబ్

1,353

1,573

16%

చండీగఢ్

158

164

4 %

ఉత్తరాఖండ్

1,246

1,077

-14%

హర్యానా

5,747

5,873

2%

ఢిల్లీ

3,451

3,754

9%

రాజస్థాన్

3,135

3,058

-2%

ఉత్తర ప్రదేశ్

5,937

6,029

2%

బీహార్

1,067

963

-10%

సిక్కిం

225

249

11%

అరుణాచల్ ప్రదేశ్

46

53

16%

నాగాలాండ్

38

34

-12%

మణిపూర్

41

48

18%

మిజోరం

25

20

-23%

త్రిపుర

74

68

-9%

మేఘాలయ

106

149

40%

అస్సాం

984

1,015

3%

పశ్చిమ బెంగాల్

4,114

3,707

-10%

జార్ఖండ్

2,150

2,206

3%

ఒడిశా

2,860

4,080

43%

ఛత్తీస్‌గఢ్

2,349

2,582

10%

మధ్యప్రదేశ్

2,615

2,533

-3%

గుజరాత్

7,469

7,336

-2%

డామన్ మరియు డయ్యూ

4

2

-60%

దాద్రా మరియు నగర్ హవేలీ

259

232

-10%

మహారాష్ట్ర

17,669

19,592

11%

కర్ణాటక

7,459

8,335

12%

గోవా

342

592

73%

లక్షదీవులు

1

1

170%

కేరళ

1,776

1,895

7%

తమిళనాడు

6,905

6,635

-4%

పుదుచ్చేరి

159

147

-8%

అండమాన్ నికోబార్ దీవులు

22

26

18%

తెలంగాణ

3,543

3,760

6%

ఆంధ్రప్రదేశ్

2,581

2,532

-2%

లడఖ్

8

15

83%

ఇతర ప్రాంతాలు

88

140

58%

కేంద్రం పరిధిలో

138

180

30%

మొత్తం

87,153

91,639

5%

***



(Release ID: 1786800) Visitor Counter : 299