ఈశాన్య ప్రాంత అభివృద్ధి మంత్రిత్వ శాఖ

ఈశాన్య ప్రాంత అభివృద్ధి మంత్రిత్వ శాఖ ఆధ్వర్యంలో మహిళా స్వయం సహాయక బృంద (ఎస్‌హెచ్‌జి) విజయగాథ

Posted On: 29 DEC 2021 12:22PM by PIB Hyderabad

డెన్‌లాంగ్ ఎస్‌హెచ్‌జి 2014లో హెచ్‌ మఖాయ్ గ్రామంలో'సాహెయి ఫౌండేషన్ ద్వారా నార్త్ ఈస్టర్న్ రీజియన్ కమ్యూనిటీ రిసోర్స్ మేనేజ్‌మెంట్ ప్రాజెక్ట్ (ఎన్‌ఈఆర్‌సిఓఆర్‌ఎంపీ) సహాయంతో ఏర్పడింది. డెన్‌లాంగ్ ఎస్‌హెచ్‌జిలో అధ్యక్షులు, కార్యదర్శి మరియు కోశాధికారితో సహా 15 మంది సభ్యులు ఉన్నారు. ఎస్‌హెచ్‌జి సమావేశం నెలలో రెండుసార్లు నిర్వహిస్తారు. ఇక్కడ ప్రతి సభ్యురాలి సహకారం మొత్తం రూ.40/- మాత్రమే మరియు ప్రతి నెలలో వారు రూ.80 విరాళంగా అందిస్తారు. ఎస్‌హెచ్‌జి ప్రారంభమైనప్పటి నుండి ఎటువంటి అడ్డంకులు లేకుండా అభివృద్ధి చెందుతోంది. ఈ స్వయం సహాయక బృందం ద్వారా ఆదాయం పొందడమే కాకుండా పరిశుభ్రత, వైద్య సదుపాయాలు వంటి అనేక కార్యక్రమాలతో పాటు గ్రామంలో చిన్నపాటి చెత్తకుండీలను నిర్వహిస్తున్నారు.


image.png
హెచ్‌ మఖాయ్ గ్రామంలో డెన్‌లాంగ్ ఎస్‌హెచ్‌జి

మష్రూమ్ కల్చర్, ఆకు కూరలు పండించడం, నేతపని మరియు పౌల్ట్రీ వంటి సమూహ ఆదాయాన్ని సృష్టించే కొన్ని కార్యకలాపాలు మునుపటి సంవత్సరాల్లో జరిగాయి. సమావేశంలో తీర్మానం ఆమోదించబడిన తర్వాత ఈ కార్యకలాపాలను ఎస్‌హెచ్‌జి స్వచ్ఛందంగా ప్రారంభించింది. ఆదాయాన్ని ఉత్పత్తి చేసే కార్యాచరణ లాభం వారి గ్రూప్‌ ఖాతాలోకి వెళుతుంది. అంటే సమూహ కార్యకలాపాలు వారి సమూహం ద్వారా వ్యక్తులకు ప్రయోజనం చేకూర్చడానికి ఉద్దేశించబడ్డాయి. ఈ పొదుపులన్నీ తమ కోసమేనని వారికి స్పష్టంగా అర్థమైంది.

డెన్‌లాంగ్ ఎస్‌హెచ్‌జి 2014లో జీరో బ్యాలెన్స్‌తో ఏర్పడింది. అయితే అవి పురోగమిస్తున్నప్పుడు 2021లో వారి కార్పస్ ఫండ్‌గా రూ.2.50 లక్షల కంటే ఎక్కువ మాత్రమే ఉన్నాయి. ఈ మొత్తాలను 2 శాతం వడ్డీ రేటుతో సభ్యుల మధ్య రివాల్వింగ్ ఫండ్‌గా ఉపయోగించారు. రివాల్వింగ్ ఫండ్ ఆర్థిక పురోభివృద్ధి, చిన్న/మధ్యతరహా వ్యాపార సంస్థలను తెరవడం మరియు అత్యవసర సమయాల్లో భద్రతగా ఉపయోగపడుతుంది.

image.png
డెన్‌లాంగ్ ఎస్‌హెచ్‌జి సభ్యులు ఫీడ్ బ్లాక్ మెషీన్‌ను నిర్వహిస్తున్నారు

 

  • 2015లో ఎస్‌హెచ్‌జినుండి రుణం తీసుకున్న గ్రూప్‌ సభ్యురాలు శ్రీమతి నెంగ్నీవా.. ఆ రూ. 4000/- చిన్నపాటి మొత్తాన్ని చిన్న పౌల్ట్రీ వ్యాపారం ప్రారంభించడానికి ఉపయోగిచించారు. కుటుంబాన్ని పోషించడానికి ఆమె భర్తకు శాశ్వత పని లేదు కానీ ఇప్పుడు వారిద్దరూ కలిసి పని చేసి విజయం సాధించారు. వారు తమ వ్యాపారాన్ని కూడా విస్తరించారు మరియు మునుపటి కంటే ఆర్థికంగా మరింత స్వతంత్రంగా మారారు. ఆ లాభాలతో ఆమె కుటుంబ అవసరాలను నిర్వహిస్తుంది మరియు పందుల పెంపకం ప్రారంభించింది. మరియు ఇప్పుడు ఆమె వద్ద ఉన్న 4 పందులను మంచి ధరకు అమ్మవచ్చు.
  • 30 సంవత్సరాల శ్రీమతి లామ్నీకిమ్ ఎస్‌హెచ్‌జి సభ్యురాలు. 2016లో ఆమె బిడ్డ తీవ్ర అనారోగ్యానికి గురైంది. తన బిడ్డకు చికిత్స చేయడానికి ఆమె వద్ద డబ్బు లేదు కాబట్టి ఆమె రూ. 20,000/-ఎస్‌హెచ్‌జి నుండి తీసుకునిఆమె బిడ్డ చికిత్స కోసం ఆ డబ్బును ఉపయోగించింది. చికిత్స అందిన కొద్దిరోజులకు ఆ బాలుడు తిరిగి ఆరోగ్యవంతుడయ్యాడు. 3 నెలల తర్వాత ఆమె ఎస్‌హెచ్‌జికి డబ్బు తిరిగి చెల్లిస్తోంది.
  • శ్రీమతి నెమ్‌ఖోకిమ్ ఎస్‌హెచ్‌జి సభ్యురాలు.ఆమె భర్త వివిధ నిర్మాణ స్థలంలో కూలీ పనుల్లో నిమగ్నమై ఉన్నారు. కానీ మాన్యువల్ లేబర్ పని ఆమె కుటుంబానికి ఎటువంటి సామాజిక భద్రతను అందించలేదు. 2015 సంవత్సరంలో ఆమె ఎస్‌హెచ్‌జి నుండి రుణం తీసుకుని నేతకు సంబంధించిన ముడిసరుకులను కొనుగోలు చేయడానికి పెట్టుబడి పెట్టింది. నేత పని లాభదాయకంగా మారింది. అంతేకాకుండా ఆమె మళ్లీ అప్పు తీసుకుని పాల వ్యాపారంలోకి దిగింది. రెండేళ్ల వ్యవధిలోనే ఆమె తన వ్యాపారాన్ని విస్తరించుకోగలిగింది మరియు పశువులు వారికి విలువైన ఆస్తిగా మారాయి. ఆమె భర్త కూడా వ్యాపారంలో పాలుపంచుకుంటున్నారు.
  • ఆమె మరింత రుణం తీసుకుంది. ఆ మొత్తంతో వారు అల్లం తోటను ప్రారంభించారు. సీజన్ ముగిసే సమయానికి వారు పండించిన పంటను మంచి లాభాలకు విక్రయించారు. స్వయం సహాయక సంఘాలు అందించే రుణం ద్వారా మరింత ఆర్థిక స్వాతంత్ర్యం పొందేందుకు ఇది వారికి వీలు కల్పించింది.


ఎస్‌హెచ్‌జి వారి రోజువారీ ఆదాయ ఆధారిత కార్యాచరణను ప్రోత్సహించడానికి కస్టమర్లకు మద్దతు ఇచ్చే విలువైన బ్యాంకుగా పనిచేస్తుంది. వ్యక్తిగత స్థాయిలో సభ్యులు ఎటువంటి సంకోచం లేకుండా డబ్బును ఉపయోగించారు మరియు వారికి ప్రయోజనం చేకూర్చే వెంచర్లను ప్రారంభించారు. పైగా, 2 శాతం తక్కువ వడ్డీతో వారు రుణాన్ని తిరిగి చెల్లించవచ్చు. డబ్బు పంపిణీ, కేటాయింపు, వడ్డీ, తిరిగి చెల్లింపు మరియు పంపిణీలో నియమాలు మరియు నియంత్రణలు సరిగ్గా అనుసరించబడ్డాయి.

ఆర్థిక అవసరాలు మరియు ఆర్థిక మద్దతుతో పాటు ఎస్‌హెచ్‌జి వారి సమస్యలను పంచుకోవడం మరియు అవసరమైన సమయాల్లో ఒకరికొకరు సహాయం చేయడం ద్వారా సభ్యుల మధ్య మరింత దృఢమైన సామాజిక బంధాన్ని అందిస్తుంది. చర్చి, విలేజ్ అథారిటీ, ఎన్‌ఎఆర్‌ఎం-జి వంటి ఇప్పటికే ఉన్న సంస్థలకు మద్దతు ఇవ్వడంలో ఎస్‌హెచ్‌జి గ్రామానికి ఆస్తిగా మారుతుంది. ఎస్‌హెచ్‌జి సభ్యురాలు, వారి భర్తలు సమావేశాలు మరియు కార్యకలాపాలలో ఎటువంటి ఫిర్యాదు చేయనందున వారి స్థితి మరింత స్వతంత్రంగా ఉందని తెలిపారు. వారు పనిలో నిమగ్నమై ఉన్నందున బదులుగా ఇంటి పనిలో మాకు మద్దతు ఇస్తారని తెలిపారు.


 

****



(Release ID: 1786184) Visitor Counter : 185