రక్ష‌ణ మంత్రిత్వ శాఖ‌
azadi ka amrit mahotsav

దేశంలోని నాలుగు రాష్ట్రాలు, రెండు కేంద్రపాలిత ప్రాంతాలలో సరిహద్దు రహదారుల సంస్థ BRO నిర్మించిన 24 వంతెనలు మూడు రోడ్లు. జాతికి అంకితం చేసిన రక్షణ మంత్రి.


102 మౌలిక సదుపాయాల ప్రాజెక్టులను సరిహద్దు రహదారుల సంస్థ BRO రికార్డు స్థాయిలో ఒకే సీజన్‌లో పూర్తి చేసిన ఘనత.

శ్రీ రాజ్‌నాథ్ సింగ్: “ప్రాజెక్టులు దేశభద్రతను పెంచుతాయి; సుదూర ప్రాంతాల సామాజిక-ఆర్థిక అభివృద్ధిని నిర్ధారిస్తాయి. భారతదేశాన్ని కొత్తగా అభివృద్ధి చేయడంలో దోహదపడతాయి.”

‘ఆజాదీ కా అమృత్ మహోత్సవ్’ వేడుకల్లో భాగంగా సరిహద్దు ప్రాంతాల్లో 75 చోట్ల ‘BRO కాఫీ షాపులు’ ఏర్పాటు

Posted On: 28 DEC 2021 2:07PM by PIB Hyderabad
రక్షణ మంత్రి శ్రీ రాజ్‌నాథ్ సింగ్ డిసెంబర్ 28, 2021న న్యూఢిల్లీ నుంచి ఆన్లైన్ సమావేశం  మాధ్యమంగా   నాలుగు రాష్ట్రాలు , రెండు కేంద్రపాలిత ప్రాంతాలలో బోర్డర్ రోడ్స్ ఆర్గనైజేషన్ (BRO) నిర్మించిన 24 వంతెనలు, మూడు రోడ్లను జాతికి  అంకితం చేశారు. 24 వంతెనలలో తొమ్మిది జమ్మూ, కాశ్మీర్‌లో ఉన్నాయి; లడఖ్ , హిమాచల్ ప్రదేశ్‌లో ఒక్కొక్క రాష్టంలో  ఐదు చప్పున ; ఉత్తరాఖండ్‌లో మూడు , సిక్కిం, అరుణాచల్ ప్రదేశ్‌లో ఒక్కొక్కటి. మిగిలిన మూడు రోడ్లలో రెండు లడఖ్‌లో , ఒకటి పశ్చిమ బెంగాల్‌లో ఉన్నాయి. సిక్కింలోని ఫ్లాగ్ హిల్-డోకలా మధ్య  11,000 అడుగుల ఎత్తులో నిర్మించిన భారతదేశపు మొట్టమొదటి స్వదేశీ క్లాస్ 70 (70 టన్నుల బరువు వాహనాలు, టాంకర్లు వంటివి వెళ్ళగలిగే)   140-అడుగుల వెడల్పు గల  డబుల్-లేన్ మాడ్యులర్ వంతెన , ఉమ్లింగ్ లా కనుమ వద్ద 19,000 అడుగుల ఎత్తులో ఉన్న చిసుమ్లే-డెమ్‌చోక్ రహదారిని ప్రారంభించడం గొప్ప విషయం.ఇది  ప్రపంచంలోనే అత్యంత ఎత్తైన  మోటారు రోడ్డు ప్రాంతంగా గిన్నిస్ వరల్డ్ రికార్డ్ కూడా సాధించింది.

శ్రీ రాజ్‌నాథ్ సింగ్ ఆన్లైన్ లో  ప్రారంభోత్సవం జరిపిన  ఈ ప్రాజెక్టులు దేశంలోని ఉత్తర , తూర్పు సరిహద్దుల వెంబడి రహదారి అక్షం, పార్శ్వం   పనులు  పూర్తయ్యాయి. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ సరిహద్దు ప్రాంతాల ప్రగతికి BRO నిబద్ధతకు ఈ ప్రారంభోత్సవం ప్రతిబింబమని, ఈ నిర్మాణ పనులు నవ భారత అభివృద్ధికి ఎంతగానో దోహదపడతాయని విశ్వాసం వ్యక్తం చేశారు. ఉమ్లింగ్-లా కనుమ  వద్ద  రహదారి సాయుధ దళాలు  వేగంగా వెళ్లేందుకు అవకాశముంటుంది, పర్యాటక రంగ అభివృద్ధికి  ఈ రహదారి దోహదం  చేస్తుంది , ఈ ప్రాంతం  సామాజిక-ఆర్థిక అభివృద్ధిని ఇది నిర్ధరిస్తుంది. "సరిహద్దు ప్రాంతాల్లోని రోడ్లు వ్యూహాత్మక అవసరాలను తీరుస్తాయి, దేశ అభివృద్ధిలో మారుమూల ప్రాంతాలకు సమాన భాగస్వామ్యాన్ని నిర్ధరిస్తాయి" అని ఆయన అన్నారు, అతి శీతల ఉష్ణోగ్రతలు , అధిక ఎత్తులో ఎదురయ్యే  సవాళ్లు ఎన్ని  ఉన్నప్పటికీ ఈ ఘనతను సాధించడంలో BRO కృషిని  ఆయన   ప్రశంసించారు.
రక్షణ మంత్రి స్వదేశీ రెండు వరుసల  మాడ్యులర్ బ్రిడ్జిని ‘ఆత్మనిర్భరత’ కు ఉజ్వల ఉదాహరణగా అభివర్ణించారు , ఇది చాలా తక్కువ ఖర్చుతో అభివృద్ధి చేయబడిందని , అవసరమైతే, తొలగించగలిగే అవకాశం ఉంటుందనీ  ప్రశంసించారు. “మన ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ ఊహించిన విధంగా దేశీయతయారీ  ‘మేక్ ఇన్ ఇండియా’ సాధించే మార్గంలో ఇది ఒక ముఖ్యమైన మైలురాయి. సరిహద్దు ప్రాంతాలకు వేగవంతమైన అనుసంధానాన్ని  అందించాలనే ప్రభుత్వ సంకల్పానికి ఇది ప్రతీక. అటువంటి ప్రాంతాల్లో మరిన్ని వంతెనల నిర్మాణానికి ఇది మార్గం సుగమం చేస్తుంది” అన్నారాయన.
ఈ  ప్రారంభోత్సవం భారతదేశానికి స్వాతంత్ర్యం వచ్చిన 75వ సంవత్సరంలో, BRO ద్వారా ఒకే సీజన్‌లో రికార్డు స్థాయిలో పూర్తీ చేసిన  మౌలిక సదుపాయాల ప్రాజెక్టుల సంఖ్యను 102కి తీసుకువెళ్లింది. చాలా వాటిలో BRO అత్యాధునిక సాంకేతికత ఉపయోగించి నిర్మాణాన్ని రికార్డు సమయ వ్యవధిలో పూర్తి చేసింది. శ్రీ రాజ్‌నాథ్ సింగ్ ఈ ఏడాది 'ఆజాదీ కా అమృత్ మహోత్సవ్' జరుపుకుంటున్న  75వ స్వాతంత్ర్య సంవత్సరం జూన్‌లో 12 రోడ్లు , 63 వంతెనలను - మొత్తం 75 ప్రాజెక్టులను దేశానికి అంకితం చేశారు.
 శ్రీ రాజ్‌నాథ్ సింగ్ సరిహద్దు ప్రాంతాల్లో రోడ్లు, హైవేలు, సొరంగాలు, వంతెనల నిర్మాణం బలమైన , సంపన్నమైన దేశాన్ని నిర్మించడంలో కీలకమని నిర్వచించారు, ఒక దేశం తన స్వంత మార్గాలను అభివృద్ధి చేసుకుంటే అది ప్రపంచానికి మార్గాన్ని చూపినట్టే అని  చెప్పారు. సుదూర ప్రాంతాల ప్రజల సామాజిక-ఆర్థిక స్థితిని నిరంతరం మెరుగుపరచడం, దేశం దాని భద్రత, కమ్యూనికేషన్ , వాణిజ్య లక్ష్యాలను సాధించడంలో సహాయం చేయడం ద్వారా దేశ నిర్మాణానికి BRO అందిస్తున్న సహకారాన్ని ఆయన ప్రశంసించారు. అటల్ సొరంగం , కైలాష్ మానసరోవర్ రోడ్డు, ఇటీవల 54 వంతెనల ప్రారంభోత్సవం , 'రహదారి భద్రత' రోడ్లు, వంతెనలు, సొరంగాలు , విమాన భూమార్గాలపై ‘సెంటర్ ఆఫ్ ఎక్సలెన్స్’ ఏర్పాటుతో సహా BRO  అందుకున్న ఇటీవలి మైలురాళ్ల గురించి ఆయన ప్రత్యేకంగా ప్రస్తావించారు.
 దేశ సమగ్రాభివృద్ధికి ప్రభుత్వ సంకల్పాన్ని పునరుద్ఘాటిస్తూ, రక్షణ మంత్రి మాట్లాడారు.  దేశ భద్రతా అవసరాలను దృష్టిలో ఉంచుకుని, అంతర్గత భాగాలు బలోపేతం చేయడంపై దృష్టి సారించినట్లే సరిహద్దు ప్రాంతాల్లో మౌలిక సదుపాయాల అభివృద్ధికి ప్రభుత్వం మొదటి ప్రాధాన్యతనిస్తోందని చెప్పారు. . “మనం ఇటీవల ఉత్తర భూభాగంలో  ప్రత్యర్థిని చిత్తశుద్ధితో , దృఢసంకల్పంతో ఎదుర్కొన్నాము.  మౌలిక సదుపాయాల అభివృద్ధి లేకపోతే   ఇది సాధ్యం కాదు. BRO తన విధులను అత్యంత అంకితభావంతో నిర్వర్తిస్తుంది. నేటి అనిశ్చిత కాలంలో సరిహద్దు ప్రాంతాలలో బలమైన మౌలిక సదుపాయాలు అవసరం, ఎందుకంటే ఇది వ్యూహాత్మకంగా మన సామర్థ్యాలను బలోపేతం చేస్తుంది. మన సరిహద్దు మౌలిక సదుపాయాలను పటిష్టం చేసుకునే దిశలో మనం ముందుకు సాగుతున్నప్పుడు, మన నిఘా వ్యవస్థలను కూడా బలోపేతం చేయాలి. చొరబాట్లు, వాగ్వివాదాలు, అక్రమరవాణా, స్మగ్లింగ్ మొదలైన సమస్యలు సరిహద్దు ప్రాంతాలలో తరచుగా కొనసాగుతాయి. దీని దృష్ట్యా, ప్రభుత్వం కొంతకాలం క్రితం సమగ్ర ఏకీకృత సరిహద్దు  నిర్వహణ వ్యవస్థను ప్రారంభించింది”అన్నారాయన.
ఈ వేగవంతమైన నిర్మాణం, అభివృద్ధితో, సరిహద్దు రహదారి సంస్థ  రాబోయే కాలంలో ఇలాంటి మరిన్ని ప్రాజెక్టులను పూర్తి చేసి 'ఆత్మనిర్భర్ భారత్' సాధించడంలో సహాయపడుతుందని శ్రీ రాజ్‌నాథ్ సింగ్ విశ్వాసం వ్యక్తం చేశారు. సరిహద్దు ప్రాంతాలను అభివృద్ధి చేయడానికి , అవసరమైన మౌలిక సదుపాయాలతో BRO ని సన్నద్ధం చేయడానికి మాజీ ప్రధాని దివంగత అటల్ బిహారీ వాజ్‌పేయి , మాజీ రక్షణ మంత్రి దివంగత అరుణ్ జైట్లీని కూడా ఆయన గుర్తు చేసుకున్నారు. BROను బలోపేతం చేయడానికి ప్రభుత్వం గత ఆరు-ఏడేళ్లలో బడ్జెట్‌ను మూడు నుండి నాలుగు రెట్లు పెంచడంతోపాటు అనేక చర్యలు తీసుకుందని, వారి ఆయన అన్నారు. రక్షా మంత్రి తన సిబ్బంది సంక్షేమమే లక్ష్యంగా BRO చేపడుతున్న కార్యక్రమాలను అభినందించారు. వీటిలో అధిక-ఎత్తు ప్రాంతాలలో మంచి నాణ్యమైన గృహాలు, జాకెట్లు, రేషన్ అందించడానికి ప్రత్యేక డ్రైవ్; భవన నిర్మాణ కార్మికుల వేతనాల పెంపు; మెరుగైన ఆరోగ్య సంరక్షణ సౌకర్యాలు , సిబ్బందికి టీకాలు వంటివి ఉన్నాయి.  ఇది దేశం పట్ల BRO  బాధ్యత , BRO పట్ల ప్రభుత్వ మద్దతును తెలియజేస్తుందని ఆయన అన్నారు.
పర్యాటకాన్ని ప్రోత్సహించడానికి , సరిహద్దు ప్రాంతాల్లో సాయుధ దళాల సిబ్బందికి సౌకర్యాలు కల్పించడానికి, రక్షణ మంత్రి ‘ఆజాదీ కా అమృత్ మహోత్సవ్’ వేడుకల్లో భాగంగా 75 
ప్రదేశాలలో ‘BRO కేఫ్‌లు’ ఏర్పాటు చేస్తున్నట్లు ప్రకటించారు. ఈ ఫలహారశాలలు స్థానిక సంప్రదాయాలు , ఆహారం, పార్కింగ్, కూర్చునే ప్రదేశం, సావనీర్ దుకాణాలు, వైద్య తనిఖీ గదులు , ఫోటో గ్యాలరీలు వంటి సౌకర్యాలను కలిగి ఉంటాయి. శ్రీ రాజ్‌నాథ్ సింగ్   BRO ని ప్రశంసిస్తూ, “ఇది పర్యాటకం,   ప్రాంతీయ సంస్కృతిని ప్రోత్సహిస్తుంది , స్థానిక ప్రజలకు ఉపాధి అవకాశాలను కల్పించడం ద్వారా వారి సామాజిక-ఆర్థిక స్థితిని మెరుగుపరుస్తుంది” అన్నారు.

కేంద్ర  సైన్స్ & టెక్నాలజీ మంత్రిత్వ శాఖ మంత్రి (స్వతంత్ర బాధ్యత), డాక్టర్ జితేంద్ర సింగ్; ఆర్మీ స్టాఫ్ చీఫ్ జనరల్ ఎంఎం  నరవాణే; డైరెక్టర్ జనరల్ బోర్డర్ రోడ్స్ లెఫ్టినెంట్ జనరల్ రాజీవ్ చౌదరి, రక్షణ మంత్రిత్వ శాఖ సీనియర్ అధికారులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. హిమాచల్ ప్రదేశ్ ముఖ్యమంత్రి శ్రీ జైరాం ఠాకూర్, ఉత్తరాఖండ్ ముఖ్యమంత్రి శ్రీ పుష్కర్ సింగ్ ధామి, కేంద్ర  మైనారిటీ వ్యవహారాల మంత్రి శ్రీ జాన్ బార్లా, జమ్మూ కాశ్మీర్ లెఫ్టినెంట్ గవర్నర్ శ్రీ మనోజ్ సిన్హా, లడఖ్ లెఫ్టినెంట్ గవర్నర్ శ్రీ ఆర్కే మాథుర్, సిక్కిం ప్రభుత్వ రోడ్లు వంతెనల మంత్రి శ్రీ సందుప్ లెప్చా, పార్లమెంటు సభ్యులు  శ్రీ తిరత్ సింగ్ రావత్, జనరల్-ఆఫీసర్-కమాండింగ్, చినార్ కార్ప్స్ లెఫ్టినెంట్ జనరల్ డిపి  పాండే , BRO సిబ్బంది  ఈ కార్యక్రమానికి హాజరయ్యారు.

***


(Release ID: 1785954) Visitor Counter : 180