విద్యుత్తు మంత్రిత్వ శాఖ
azadi ka amrit mahotsav

గ్రామ ఉజాలా పథకం కింద 50 లక్షల ఎల్ఈడీ బల్బులు పంపిణీ చేసి సరికొత్త మైలురాయి చేరుకున్న సిఈఎస్ఎల్

2021 మార్చి 31 నాటికి 20 లక్షల గృహాలకు కోటి ఎల్ఈడీ బల్బులు సరఫరా చేయాలన్న లక్ష్యంతో పనిచేస్తున్న సిఈఎస్ఎల్

Posted On: 28 DEC 2021 12:20PM by PIB Hyderabad

గ్రామ ఉజాలా పథకం కింద 50 లక్షల  ఎల్ఈడీ బల్బులు పంపిణీ చేసి కన్వర్జెన్స్ ఎనర్జీ సర్వీసెస్ లిమిటెడ్ (సిఈఎస్ఎల్)  యాజమాన్యంలో పూర్తి  అనుబంధ సంస్థగా పనిచేస్తున్న   కన్వర్జెన్స్ ఎనర్జీ సర్వీసెస్ లిమిటెడ్ (సిఈఎస్ఎల్సరికొత్త మైలురాయిని చేరుకుంది. 

బీహార్ఉత్తరప్రదేశ్ఆంధ్రప్రదేశ్కర్నాటక మరియు తెలంగాణ రాష్ట్రాల గ్రామీణ గృహాలలో గ్రామ ఉజాలా పథకం అమలు జరుగుతోంది. 

కేంద్ర విద్యుత్ మరియు నూతన పునరుత్పాదక ఇంధన శాఖ మంత్రి శ్రీ ఆర్కే సింగ్  సమర్థ నాయకత్వంలో  సిఈఎస్ఎల్  ఈ సంవత్సరం మార్చిలో గ్రామీణ ప్రాంతాలలో వెలుగులు నింపాలన్న లక్ష్యంతో ఈ పథకాన్ని ప్రారంభించింది. ఇంధన పరిరక్షణ దినోత్సవం సందర్భంగా ఒకే రోజులో 10 లక్షల బల్బులను సిఈఎస్ఎల్ పంపిణీ చేసింది.

 

పని చేస్తున్న సాధారణ  బల్బులకు బదులుగా ఒక్క బల్బుకు 10 రూపాయలు తీసుకుని  సంవత్సరాల గ్యారంటీతో  అధిక నాణ్యత గల 7-వాట్ మరియు 12-వాట్ల  ఎల్ఈడీబల్బులను సిఈఎస్ఎల్ అందిస్తోంది. ప్రతి కుటుంబం గరిష్టంగా బల్బులను మార్చుకోవచ్చు. పంపిణీ ఫలితంగా పథకం అమలు జరుగుతున్న  రాష్ట్రాల గ్రామీణ ప్రాంతాల్లో సంవత్సరానికి 250 కోట్ల రూపాయల ఖర్చు తగ్గడంతోపాటు   71,99,68,373.28 యూనిట్ల ఇంధన ఆదా జరిగింది. ఈ పథకం 2022  మార్చి 31  వరకు అమలు జరుగుతుంది.

గ్రామీణ ప్రాంతాల పర్యావరణ వ్యవస్థను సమగ్రంగా అభివృద్ధి చేయాలనే లక్ష్యంతో పథకాన్ని అమలు చేస్తున్నామని సిఈఎస్ఎల్ మేనేజింగ్ డైరెక్టర్,సీఈఓ    ఈ సందర్భంగా మాట్లాడిన  సిఈఎస్ఎల్ శ్రీమతి మహువా ఆచార్య  తెలిపారు. కేంద్ర మంత్రి శ్రీ ఆర్ కే సింగ్ ప్రత్యక్ష పర్యవేక్షణలో పథకాన్ని అయిదు రాష్ట్రాల్లో అమలు చేస్తున్నామని అన్నారు. కర్బన ఉద్గారాలను తగ్గించి గ్రామీణ ప్రాంతాల్లో వెలుగులు నింపాలన్న లక్ష్యంతో  ప్రాజెక్ట్ క్రోర్ అమలు జరుగుతున్నదని వివరించారు. ప్రాజెక్ట్ క్రోర్ పూర్తయిన తర్వాత పథకాన్ని ఇతర రాష్ట్రాల్లో అమలు చేస్తామని వివరించారు. 

షైన్ కార్యక్రమం కింద బల్బుల పంపిణీలో  సిఈఎస్ఎల్ కు సి-క్వెస్ట్ కాపిటల్ సహకారం అందిస్తోంది. 

రెండు సంస్థల మధ్య కుదిరిన అవగాహన పట్ల సి-క్వెస్ట్ ముఖ్య కార్యనిర్వహణాధికారి కెన్ న్యూకోంబ్  హర్షం వ్యక్తం చేశారు. కర్బనాన్ని ఆర్థిక వనరుగా పరిగణించడం వల్ల భారతదేశంలో గ్రామీణ ప్రాంతాల్లో ఇంధన వినియోగ సామర్ధ్యం పెరుగుతుందని అన్నారు. 50 లక్షల మైలురాయిని చేరుకోవడం పట్ల ఆయన హర్షం వ్యక్తం చేశారు. భారత ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా అమలు చేస్తున్న కార్యక్రమాన్ని పూర్తి సహాయ సహకారాలు అందిస్తామని హామీ ఇచ్చారు. 

సిఈఎస్ఎల్ గురించి:

కేంద్ర  విద్యుత్ మంత్రిత్వ శాఖ క్రింద ప్రభుత్వ రంగ సంస్థల భాగస్వామ్యంతో జాయింట్ వెంచర్ గా  ఏర్పాటైన  ఎనర్జీ ఎఫిషియెన్సీ సర్వీసెస్ లిమిటెడ్ అనుబంధ సంస్థగా  సిఈఎస్ఎల్ పనిచేస్తోంది.    స్వచ్ఛమైనసరసమైన మరియు నమ్మదగిన ఇంధనాన్ని సరఫరా చేయాలన్న లక్ష్యంతో  సిఈఎస్ఎల్ పనిచేస్తోంది. 

పునరుత్పాదక శక్తివిద్యుత్ చలనశీలత మరియు వాతావరణ మార్పుల అంశాలతో ముడిపడి ఉన్న ఇంధన వనరుల సమస్యల పరిష్కారానికి  పరిష్కారాలపై సిఈఎస్ఎల్ కృషి చేస్తోంది. భారతదేశంలో విధ్యుత్  వాహనాల వినియోగాన్ని పెంచడానికి బ్యాటరీతో నడిచే ఎలక్ట్రిక్ వాహనాల ఉత్పత్తికి అవసరమైన మౌలిక సదుపాయాల కల్పన, వాహన  డిజైన్ వ్యాపార నమూనాలు ప్రారంభించేందుకు కూడా  సిఈఎస్ఎల్ సహకరిస్తుంది. పొదుపు రాయితీ మరియు వాణిజ్య మూలధనంకార్బన ఆర్థిక సహకారం  ఫైనాన్స్ మరియు గ్రాంట్ల రూపంలో  ప్రత్యేకమైన వ్యాపార నమూనాలు ఉపయోగించడం, సమస్యల పరిష్కారం ద్వారా వాణిజ్య ఉత్పత్తులను ప్రోత్సహించడానికి   సిఈఎస్ఎల్ తగు చర్యలను రూపొందించి అమలు చేస్తోంది. 

 

****(Release ID: 1785787) Visitor Counter : 47