ఆయుష్

ఈశాన్య రాష్ట్రాలలో వ్యవసాయ రంగ అభివృద్ధికి అమలు చేయాల్సిన చర్యలపై వ్యవసాయ పారిశ్రామికవేత్తలు, నిపుణులతో చర్చించిన కేంద్ర మంత్రి సర్బానంద సోనోవాల్

Posted On: 27 DEC 2021 11:15AM by PIB Hyderabad

అస్సాం తో సహా ఈశాన్య రాష్ట్రాల్లో వ్యవసాయ రంగ అభివృద్ధికి అమలు చేయాల్సిన చర్యలపై  వసాయ పారిశ్రామికవేత్తలునిపుణులతో కేంద్ర ఆయుష్రేవులునౌకాయానంజలమార్గాల శాఖ మంత్రి శ్రీ శ్రీ సర్బానంద సోనోవాల్ ఆదివారం చర్చలు జరిపారు. వ్యవసాయ ఆధారిత వృద్ధి సాధించడానికి గల అవకాశాలను మంత్రి సమావేశంలో చర్చించారు. 

ప్రస్తుతం అమలు జరుగుతున్న వ్యవసాయ విధానాలు, వీటి వల్ల కలుగుతున్న ఆర్థిక, పర్యావరణ ప్రయోజనాలను నిపుణుల బృందం మంత్రికి వివరించింది. సాంప్రదాయ  వ్యవసాయం, సేంద్రియ వ్యవసాయం, సహజ వ్యవసాయ విధానాలకు సంబంధించిన వివిధ అంశాలు చర్చకు వచ్చాయి. వీటివల్ల ప్రాంత సుస్థిర అభివృద్ధి, ఆర్థికాభివృద్ధి సాధించడానికి గల అవకాశాలను చర్చించి అంచనా వేశారు. ప్రాంత పర్యావరణ, ఆర్థిక అంశాలను పరిరక్షించే విధంగా వ్యవసాయ రంగ అభివృద్ధికి సాధించేందుకు చర్యలు అమలు చేయాలని సమావేసంలో నిపుణులు స్పష్టం చేశారు. నిపుణుల  బృందానికి అస్సాం వ్యవసాయ విశ్వవిద్యాలయం  వైస్-ఛాన్సలర్ డాక్టర్ బిద్యుత్ దేకా నేతృత్వం వహించారు.

వివిధ అంశాలపై అభిప్రాయాలను తెలుసుకున్న మంత్రి సేంద్రియ వ్యవసాయం, సహజ వ్యవసాయ విధానాలపై సమగ్ర నివేదిక రూపొందించి అందించాలని నిపుణులను కోరారు. నివేదిక ఆధారంగా భవిష్యత్ కార్యాచరణను రూపొందిస్తామని మంత్రి తెలిపారు. అత్యున్నత స్థాయిలో ప్రభుత్వం నిర్ణయాలు తీసుకునేందుకు ఈ నివేదిక ఉపకరించాలని మంత్రి అన్నారు. అస్సాం వ్యవసాయ విశ్వవిద్యాలయం ఈ నివేదికను రూపొందిస్తుంది. ఈశాన్య ప్రాంతంలో అమలు జరుగుతున్న సాంప్రదాయ వ్యవసాయ విధానాలు, సేంద్రియ విధానంలో వ్యవసాయం సాగించి విజయం  వ్యవసాఅన్నారు. 

య పారిశ్రామికవేత్తలు అనుసరించిన విధానాలను నివేదికలో పొందుపరుస్తారు. 

ఆధునిక సాంకేతిక విధానాలను అనుసరించి ఈశాన్య ప్రాంత రైతులు ప్రయోజనం పొందడానికి కృషి చేయాలని శ్రీ సోనోవాల్ అన్నారు. ఈశాన్య ప్రాంతంలో వ్యవసాయ రంగం సుస్థిర అభివృద్ధిని సాధించాలని ఆయన పేర్కొన్నారు. సమగ్ర సుస్థిర అభివృద్ధిని సాధించేందుకు సాంప్రదాయ విధానాలకు ఆధునిక సాంకేతిక అంశాలను జోడించాలని శ్రీ  సోనోవాల్ అన్నారు. పర్యావరణ పరిరక్షణకు ప్రాధాన్యత ఇస్తూ ప్రాంత రైతుల ఆర్థిక వృద్ధి సాధించేలా వ్యవసాయ కార్యక్రమాలు సాగాలని అన్నారు. ఈశాన్య రాష్ట్రాల్లో ఆయుష్ ఆధారిత పరిశ్రమలో భాగస్వాములు కావాలని ఆయన రైతులను కోరారు. దీనివల్ల రైతులు ఆర్థికంగా ప్రయోజనం పొందుతారని, ఈశాన్య ప్రాంతం అభివృద్ధి సాదిస్తుందని శ్రీ సోనోవాల్ అన్నారు. 

అస్సాం వ్యవసాయ విశ్వవిద్యాలయం  ఎక్స్‌టర్నల్ ఎడ్యుకేషన్ డైరెక్టర్ డాక్టర్. పికె పాఠక్ విశ్వవిద్యాలయం రిసెర్చ్ అసోసియేట్ డైరెక్టర్ డాక్టర్ ఎం సైకియావ్యవసాయ విభాగాధిపతి డాక్టర్ కె. పాఠక్ ప్రిన్సిపాల్ డాక్టర్ ఎస్. పాఠక్నల్బరీకి ప్రాంతానికి చెందిన సహజ రైతు జయంత్ మల్ల బుజర్బరువామీర్జానుంచి  సేంద్రీయ రైతు బన్మాలి చౌదరి మరియు టెటెలియా ఆగ్రో ఆర్గానిక్ ప్రొడ్యూసర్స్ సాంకేతిక సలహాదారు కృష్ణ సైకియా తదితరులు సమావేశంలో  పాల్గొన్నారు.

 

***



(Release ID: 1785522) Visitor Counter : 130