గ్రామీణాభివృద్ధి మంత్రిత్వ శాఖ

ఆజాదీ కా అమృత్ మహోత్సవ్‌లో భాగంగా దీన్ దయాళ్ ఉపాధ్యాయ గ్రామీణ కౌశల్య యోజన కింద దేశవ్యాప్తంగా ఉద్యోగ మేళాలు నిర్వహించిన గ్రామీణాభివృద్ధి మంత్రిత్వ శాఖ


ఉద్యోగ మేళాల్లో పాల్గొన్న 30 రంగాలకు చెందిన ప్రముఖ పరిశ్రమలు

దేశవ్యాప్తంగా నిర్వహించిన 285 ఉద్యోగ మేళాల్లో పాల్గొన్న 278 కి పైగా ప్రముఖ సంస్థలు

Posted On: 26 DEC 2021 12:29PM by PIB Hyderabad

ఆజాదీ కా అమృత్ మహోత్సవ్‌లో భాగంగా గ్రామీణాభివృద్ధి మంత్రిత్వ శాఖ దేశవ్యాప్తంగా ఉద్యోగ మేళాలు నిర్వహించింది. 2021 డిసెంబర్ 17 నుంచి 23 వరకు వారం రోజుల పాటు వీటిని గ్రామీణాభివృద్ధి మంత్రిత్వ శాఖ దేశంలో వివిధ ప్రాంతాల్లో నిర్వహించింది. దీన్ దయాళ్ ఉపాధ్యాయ గ్రామీణ కౌశల్య యోజన కింద గ్రామీణాభివృద్ధి మంత్రిత్వ శాఖ వివిధ రాష్ట్రాల గ్రామీణ జీవనోపాధి మిషన్, పథకాన్ని అమలు చేస్తున్న సంస్థల సహకారంతో వీటిని నిర్వహించింది. 

 

  

ప్రపంచ ప్రమాణాల మేరకు వేతనాలు అందించి ఉద్యోగాలు కల్పించాలన్న లక్ష్యంతో దీన్ దయాళ్ ఉపాధ్యాయ గ్రామీణ కౌశల్య యోజన కార్యక్రమం అమలు జరుగుతోంది. గతంలో అమలు జరిగిన జాతీయ గ్రామీణ ఉపాధి కల్పన మిషన్ లో మార్పులు చేసి నైపుణ్య అభివృద్ధికి ప్రాధాన్యత ఇస్తూ  గ్రామీణాభివృద్ధి శాఖ దీన్ దయాళ్ ఉపాధ్యాయ గ్రామీణ కౌశల్య యోజన కార్యక్రమాన్ని అమలు చేస్తోంది. 2024 సెప్టెంబర్ 25 నుంచి   దీన్ దయాళ్ ఉపాధ్యాయ గ్రామీణ కౌశల్య యోజన కార్యక్రమం అమలు జరుగుతోంది. నైపుణ్య అభివృద్ధితో పాటు ఉపాధి అవకాశాలు కల్పించడానికి అమలవుతున్న దీన్ దయాళ్ ఉపాధ్యాయ గ్రామీణ కౌశల్య యోజన కార్యక్రమం అమలుకు అవసరమైన నిధులను కేంద్ర ప్రభుత్వం, గ్రామీణాభివృద్ధి మంత్రిత్వ శాఖ సమకూరుస్తున్నాయి. 

ప్రస్తుతం 27 రాష్ట్రాలు, నాలుగు కేంద్రపాలిత ప్రాంతాల్లో దీన్ దయాళ్ ఉపాధ్యాయ గ్రామీణ కౌశల్య యోజన కార్యక్రమం అమలు జరుగుతోంది. కార్యక్రమంలో భాగంగా 1891 ప్రాజెక్టులలో 2369 శిక్షణా  కేంద్రాలు ఏర్పాటయ్యాయి. ప్రాజెక్టును అమలు చేయడానికి  877 కి పైగా  సంస్థలు ఎంపిక అయ్యాయి. 616 కి పైగా ఉద్యోగాల కల్పన కోసం 57 రంగాలలో ఈ సంస్థలు శిక్షణ ఇస్తున్నాయి. కార్యక్రమం ప్రారంభం అయిన నాటి నుంచి ఇంతవరకు 11.15 లక్షల మంది శిక్షణ పొందారు. దీన్ దయాళ్ ఉపాధ్యాయ గ్రామీణ కౌశల్య యోజన కార్యక్రమం ప్రారంభం అయిన తరువాత 7.13 లక్షల మందికి శిక్షణ ఇవ్వడం జరిగింది. 

 

  

గ్రామీణాభివృద్ధి మంత్రిత్వ శాఖ నిర్వహించిన ఉద్యోగ మేళాలకు  ఉపాధి కోసం ఎదురుచూస్తున్న లక్షలాది మంది శిక్షణ పొందిన అభ్యర్థులు హాజరయ్యారు. దేశం వివిధ ప్రాంతాలలో 285 పైగా ఉద్యోగ మేళాలను నిర్వహించారు. వీటిలో అమెజాన్ ఇండియాస్విగ్గీమెడ్ ప్లస్యాక్సిస్ బ్యాంక్కియా మోటార్స్ఇన్నోసోర్స్ఫ్లిప్‌కార్ట్నానా భారత్ ఫర్టిలైజర్స్రిలయన్స్ ట్రెండ్స్వెస్ట్‌సైడ్స్పెన్సర్స్లీలా హోటల్జేడబ్ల్యు  మారియోట్బెంగళూరుటీమ్‌లీజ్ సర్వీసెస్ లాంటి 278 ప్రముఖ సంస్థలు పాల్గొన్నాయి. 

 

 

ఈ సంస్థలు     రిటైల్, నిర్మాణ , ఫార్మాస్యూటికల్, ఉత్పత్తి , ఇ-కామర్స్, మైక్రో ఫైనాన్స్, మానవ వనరుల నిర్వహణ ఐటీ- ఐటీఈలు, ఆటోమొబైల్ మొదలైన వాటితో సహా 30 ప్రధాన రంగాలు/వ్యాపార రంగంలో ఉన్నాయి.  వేలాది మంది గ్రామీణ యువకులకు ఉద్యోగాలు ఇచ్చేందుకు ఈ సంస్థలు సంసిద్ధత వ్యక్తం చేయడంతో ఉద్యోగ మేళాలు విజయం సాధించాయి.  దేశంలోని  ప్రముఖ కంపెనీలలో పని  పనిచేయడానికి గ్రామీణ ప్రాంతాలకు చెందిన యువతకు అవకాశం లభించింది. 

18-35 సంవత్సరాల వయస్సు కలిగి  5 నుంచి 10  తరగతి  ప్రాథమిక పాఠశాల విద్య,  సీనియర్ సెకండరీ లేదా ఐటిఐ పూర్తి చేసి మేళాకు హాజరైన అభ్యర్థులకు కేంద్రాల్లో  కౌన్సిలింగ్ అందించబడింది. ప్రత్యక్ష ఉపాధి పోస్ట్ శిక్షణలతో వివిధ ట్రేడ్‌లలో ముందస్తు శిక్షణ కోసం అర్హులైన అభ్యర్థులు కూడా ఎంపిక చేయడం జరిగింది. తమ సొంత రాష్ట్రం వెలుపల ఉపాధి కోసం ఎంపికైన అభ్యర్థులకు సరైన ఆహారం మరియు బస సౌకర్యాలు కల్పించేందుకు చర్యలు తీసుకోవాలని సంస్థలకు గ్రామీణాభివృద్ధి మంత్రిత్వ శాఖ సూచించింది. 

***



(Release ID: 1785395) Visitor Counter : 123