యువజన వ్యవహారాలు, క్రీడల మంత్రిత్వ శాఖ
ప్రధానమంత్రి పిలుపు మేరకు, చాంపియన్లను కలుసుకోండి అన్న కార్యక్రమంలో భాగంగా పానిపట్ పాఠశాలల్లోని పిల్లలను కలుసుకున్న ఒలింపియన్ భజరంగ్ పునియా
ఇండియాను ఉన్నతస్థాయిలో నిలపడానికి పిల్లలు సరైన ఆహారం తీసుకోవాలని , తగిన ఎక్సర్‌సైజ్ చేయాలని పిలుపునిచ్చిన పునియా
Posted On:
23 DEC 2021 4:41PM by PIB Hyderabad
ముఖ్యాంశాలు.
సంతులిత్ ఆహారం, ఫిట్‌నెస్ ప్రాధాన్యత గురించి భజరంగ్ పునియా విద్యార్థులతో ముచ్చటించారు.
ప్రభుత్వం ప్రారంభించిన ,ఆజాది కా అమృత్ మహోత్సవ్ లో భాగంగా ఈ ప్రత్యేక కార్యక్రమాన్ని ఒలింపిక్ స్వర్ణపతక విజేత నీరజ్ చోప్రా గుజరాత్‌లో ప్రారంభించారు.
ప్రధానమంత్రి నరేంద్రమోదీ ప్రారంభించిన పాఠశాలల సందర్శన ప్రత్యేక కార్యక్రమాన్ని భారత రెజ్లర్, టోక్యో ఒలింపిక్స్ కాంస్య పతక విజేత భజరంగ్ పునియా గురువారం హర్యానాలోని పానిపట్ లో గల ఆరోహి మోడల్ స్కూల్ విద్యార్థులు, నాలుగు జిల్లాలకు చెందిన 75 పాఠశాలల విద్యార్థులతో ముచ్చటించారు.
పాఠశాల సందర్శన కార్యక్రమంలో భాగంగా సంతులిత ఆహారం ప్రాధాన్యత గురించి శరీరదారుఢ్యం ప్రాధాన్యత గురించి ఆయన విద్యార్థులకు తెలియజేశారు. అలాగే భారతీయ సంప్రదాయ క్రీడలను ప్రోత్సహించాల్సిన అవసరం గురించి మాట్లాడారు. విద్యార్ధులతో కలిసి ఖో-ఖో ఆడారు. ఫిట్‌నెస్ కు సంబంధించి కొన్ని సులభమైన ఎక్సర్ సైజులు ఆయన విద్యార్థులకు నేర్పించారు.
దేశవ్యాప్తంగా గల పాఠశాలలను సందర్శించి విద్యార్థులతో ముచ్చటించాల్సిందిగా ప్రధానమంత్రి ఒలింపియాన్స్‌ను పారా ఒలింపియాన్స్‌ను కోరడం, ఇలాంటి ఆలోచన ప్రధానమంత్రి చేయడాన్ని పునియా కొనియాడారు. ఈ సందర్బంగా ఆయన మాట్లాడుతూ , " నేను ఈ పాఠశాలకు రావడం ఎంతో ఆనందంగా ఉంది. ఇది నాకు నా పాఠశాల రోజులను గుర్తుకు తెస్తోంది. ఎందుకంటే నేను కూడా హర్యానాలోని ఒక గ్రామం నుంచే వచ్చాను. ఇక్కడకు రావడమంటే తిరిగి పాఠశాల రోజులలోకి వెళ్లినట్టు ఉంది అని ఆయన అన్నారు. ."
సరైన ఆహారం తీసుకోవలసిన అవసరం గురించి, శరీరదారుఢ్యాన్ని పాటించడం గురించి విద్యార్థులతో ముచ్చటిస్తూ ఆయన, మానసికంగా, శారీరకంగా బలంగా ఉండాలంటే , అలాగే ఏ రంగంలో అయినా భారతదేశం ఉన్నతస్థాయిలో ఉండాలంటే మనం సరైన ఆహారం తీసుకోవాలి, రోజుకు రెండుసార్లు ఎక్సర్ సైజులు చేయాలి అని ఆయన విద్యార్థులకు చెప్పారు.
భారత ప్రభుత్వ ఆజాది కా అమృత్ మహోత్సవ్ లో భాగంగా ఈ ప్రత్యేక కార్యక్రమాన్ని చేపట్టారు. దీనినని ఒలింపిక్ స్వర్ణపతక విజేత నీరజ్ చోప్రా ఈ నెల మొదట్లో గుజరాత్ లో ప్రారంభించారు.
ప్రోటీన్లు, కార్బోహైడ్రేట్లు, ఆకు కూరలు, మినరల్స్ వంటి వాటితో కూడిన ఇంటి వంట ప్రాధాన్యతను పునియా నొక్కి చెప్పారు. జంక్‌ఫుడ్ కు దూరంగా ఉండాలని కోరారు. తాము శిక్షణ తీసుకున్న తొలి రోజుల గురించి వివరిస్తూ ,మేం శిక్షణ తీసుకునే రోజులలో, రోజూ శిక్షణ కేంద్రం నుంచి వెలుపలకు వెళ్లడానికి కూడా అనుమతించే వారు కాదని , ఎప్పుడైనా ఒకసారి వెలుపలకు వెళ్లే అవకాశం వస్తే రోడ్డు పక్కన ఉండే చాట్, టిక్కి వంటి వి తినే వాళ్లమని అన్నారు. అది కూడా ఎప్పుడో నెలకు ఒకసారి మాత్రమే నని , రెగ్యులర్‌గా కాదని చెప్పారు. అందువల్ల విద్యార్థినీ విద్యార్థులు రెగ్యులర్‌గా జంక్ ఫుడ్ తినబోమని , వాటిని వదిలివేసేందుకు ప్రయత్నిస్తామని ప్రామిస్ చేయాల్సిందిగా ఆయన పిలుపునిచ్చారు.
***
(Release ID: 1785213)
Visitor Counter : 150