నీతి ఆయోగ్
రాష్ట్రాల పనితీరుకు ర్యాంకింగ్ ఇచ్చే ది హెల్దీ స్టేట్స్, ప్రోగ్రెసివ్ ఇండియా నాలుగవ ఎడిషన్‌ను 27 డిసెంబర్ 2021న విడుదల చేయనున్న నీతీ ఆయోగ్
Posted On:
25 DEC 2021 11:32AM by PIB Hyderabad
భారత ప్రభుత్వ ప్రతిష్ఠాత్మక విధాన థింక్ ట్యాంక్ ( నిర్ధిష్ట సామాజిక, రాజకీయ ఆర్ధిక అంశాలపై సలహా, సూచనలను ఇచ్చే నిపుణుల బృందం) నీతీ ఆయోగ్ (ఎన్ఐటిఐ ఆయోగ్) అంచనా వేయదగిన దేనినైనా సాధ్యం చేయవచ్చనే మంత్రాన్ని విశ్వసిస్తుంది. సహకార & పోటీ సమాఖ్యవాదంలో భాగంగా, మెరుగైన ఆరోగ్య ఫలితాలను సాధించడం కోసం నిరంతరం రాష్ట్రాలను, కేంద్రపాలిత ప్రాంతాలపై నీతీ ఆయోగ్, ఆరోగ్య, కుటుంబ సంక్షేమ మంత్రిత్వ శాఖ (ఎంఒహెచ్ఎఫ్ డబ్ల్యు) ముందుకు నడిపిస్తుంటాయి.
రాష్ట్రాలు, కేంద్ర పాలిత ప్రాంతాలలో ఆరోగ్య రంగంలో సమగ్ర పనితీరును, మెరుగుపడుతున్న పనితీరును ట్రాక్ చేసేందుకు 2017లో ది నేషనల్ ఇనిస్టిట్యూషన్ ఫర్ ట్రాన్స్‌ఫార్మింగ్ ఇండియా (ఎన్ ఐటిఐ ఆయోగ్ - భారత్ పరివర్తనకుద్దేశించిన జాతీయ సంస్థ), ఆరోగ్య, కుటుంబ సంక్షేమ శాఖ (ఎంఒహెచ్ఎఫ్ డబ్ల్యు), ప్రపంచ బ్యాంక్ సహకారంతో వార్షిక ఆరోగ్య సూచీని ప్రారంభించింది.
ఆరోగ్య ఫలితాలు, ఆరోగ్య వ్యవస్థల పనితీరు పురోగతిని ట్రాక్ చేయడం, రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాల మధ్య ఆరోగ్యకరమైన పోటీని, ఒకరి నుంచి మరొకరు విజయవంతమైన మరిన్ని అంశాలను అందిపుచ్చుకోవడాన్ని ప్రోత్సహిస్తుంది. రాష్ట్రాలు, కేంద్ర పాలిత ప్రాంతాలకు ఆరోగ్య సూచీ స్కోర్లను, ర్యాంకింగ్‌లను పెరుగుతున్న పని తీరు (ఏడాది ఏడాదికి పురోగతి), సమగ్ర పనితీరు (ప్రస్తుత పనితీరు)ను అంచనావేసేందుకు ఇస్తారు. సార్వత్రిక ఆరోగ్య కవరేజీ, ఇతర ఆరోగ్య ఫలితాలకి సంబంధించిన వాటితో సహా ఆరోగ్య సంబంధిత స్థిరాభివృద్ధి లక్ష్యాలు (సస్టైనబుల్ డెవలప్‌మెంట్ గోల్స్ - ఎస్డీజీ)ని సాధించేందుకు రాష్ట్రాలు, కేంద్ర పాలిత ప్రాంతాలను ముందుకు నడిపించేందుకు ఈ ప్రయోగం తోడ్పడుతుందని అంచనా.
ఆరోగ్య సూచీ అనేది ఆరోగ్య రంగ పనితీరులో కీలక అంశాలను ఆవరించిన 24 సూచీలను పొందుపరిచిన భారీ మిశ్రమ గణన. నివేదికలో పొందుపరిచిన రంగాలు - ఆరోగ్య ఫలితాలు, పాలనా, సమాచారం, కీలక ఇన్‌పుట్లు, ప్రక్రియలను ఆవరించి ఉంటాయి.
బలమైన ఆరోగ్య వ్యవస్థల నిర్మాణం, మెరుగైన సేవల బట్వాడా లేదా నిర్వహణ దిశగా రాష్ట్రాలను, కేంద్రపాలిత ప్రాంతాలను ముందుకు తోసే లక్ష్యాన్ని ఈ ఆరోగ్య సూచీ నివేదికలు కలిగి ఉంటాయి.
జాతీయ ఆరోగ్య మిషన్ కింద ఈ ఆరోగ్య సూచీని, ప్రోత్సాహకాలతో లంకె పెట్టాలని ఎంఒహెచ్ఎఫ్ డబ్ల్యు తీసుకున్న ఈ నిర్ణయం ఈ వార్షిక సాధన ప్రాముఖ్యతను పునరుద్ఘాటించడమే. ఈ నివేదిక బడ్జెట్ వ్యయం, ఇన్‌పుట్లు, ఔట్ పుట్ల నుంచి దృష్టిని ఫలితాలపైకి మళ్ళించేందుకు ప్రయత్నించింది.
పనితీరును కొలిచేందుకు బలమైన, ఆమోదయోగ్యమైన సంవిధానాన్ని ఉపయోగిస్తున్నారు - సూచీలు అంగీకారాన్ని పొందాయి, ఎన్ఐటిఐ నిర్వహించే ఆన్‌లైన్ పోర్టల్ ద్వారా డేటాను సేకరించారు, తర్వాత దానిని పారదర్శక బిడ్డింగ్ ప్రక్రియ ద్వారా ఎంపిక చేసిన స్వతంత్ర ధ్రువీకరణ ఏజెన్సీ వాటిని ధృవీకరిస్తుంది, ధ్రువీకరించిన డేటా పత్రాలను పునః పరిశీలించేందుకు, సరి చూసేందుకు వాటిని రాష్ట్రాలకు పంపి, అప్పుడు డేటాను ఖరారు చేసి, విశ్లేషణకు, నివేదికను రాసేందుకు ఉపయోగిస్తారు.
ఆరోగ్య సూచీ అనేది కాలక్రమంగా రాష్ట్రాలు, కేంద్ర పాలిత ప్రాంతాల సమగ్ర పనితీరును, మెరుగుపడుతున్న పనితీరును కొలిచేందుకు, సరిపోల్చేందుకు ఉపయుక్తమైన సాధనం.అంతేకాక, ఆరోగ్య ఫలితాలు, పాలన, డేటా సమగ్రత, కీలక ఇన్‌పుట్లు, ప్రక్రియలు వివిధ పారామితుల వ్యాప్తంగా పనితీరులో ఉన్న తేడాలను అర్థం చేసుకునేందుకు ముఖ్యమైన పరికరం. పనితీరును పర్యవేక్షించేందుకు రాష్ట్రాలు, కేంద్ర పాలిత ప్రాంతాల స్థాయిలో డేటాను ఉపయోగించే సంస్కృతిని బలోపేతం చేయడమే కాక, దాదాపు అన్ని రాష్ట్రాలు, కేంద్ర పాలిత ప్రాంతాల అందుబాటును, నాణ్యత, సమయపాలనను మెరుగుపరచడం అన్న అజెండాకు దోహదం చేస్తోంది. ఈ నివేదిక ద్వారా రాష్ట్రాల, కేంద్ర పాలిత ప్రాంతాల వార్షిక పనితీరును ప్రభుత్వ అత్యున్నత స్థాయిలో పర్యవేక్షించడం జరుగుతుంది. ఆర్థిక సంవత్సరం 2019-2020కి సంబంధించిన నివేదికను 27 డిసెంబర్ 2021న మధ్యాహ్నం 12.00 గంటలకు విడుదల చేయనున్నారు.
***
(Release ID: 1785151)
Visitor Counter : 227