శాస్త్ర విజ్ఞాన- సాంకేతిక విజ్ఞాన మంత్రిత్వ శాఖ

సైంటిఫిక్ అప్లికేషన్లు, టెక్నలాజికల్ సపోర్ట్, సొల్యూషన్స్ కోసం 33 లైన్ మినిస్ట్రీల నుండి 168 ప్రతిపాదనలను స్వీకరించామని కేంద్ర మంత్రి డాక్టర్ జితేంద్ర సింగ్ వెల్లడించారు.


అన్ని సైన్స్ అండ్ టెక్నాలజీ మినిస్ట్రీలు/డిపార్ట్‌మెంట్ల మొట్టమొదటి ఉన్నత స్థాయి సామర్థ్య నిర్మాణ (కెపాసిటీ బిల్డింగ్) సమావేశానికి మంత్రి అధ్యక్షత వహిస్తారు.

వ్యవసాయం, ఆహారం, విద్య, నైపుణ్యం, రైల్వేలు, రోడ్లు, జల శక్తి, విద్యుత్ బొగ్గు వంటి రంగాల కోసం శాస్త్రీయ అప్లికేషన్లు & పరిష్కారాలను వెతకాలి: కేంద్రమంత్రి డాక్టర్ జితేంద్ర సింగ్

Posted On: 22 DEC 2021 5:03PM by PIB Hyderabad

కేంద్ర రాష్ట్ర మంత్రి (స్వతంత్ర బాధ్యత) సైన్స్ & టెక్నాలజీ;సహాయ మంత్రి (స్వతంత్ర బాధ్యత) ఎర్త్ సైన్సెస్; ఎంఒఎస్ పీఎంఒ, పర్సనల్, పబ్లిక్ గ్రీవెన్స్, పెన్షన్స్, అటామిక్ ఎనర్జీ,  స్పేస్ శాఖల మంత్రి డాక్టర్ జితేంద్ర సింగ్.. సైంటిఫిక్ అప్లికేషన్స్  టెక్నలాజికల్ సపోర్ట్ & సొల్యూషన్స్ కోసం 33 లైన్ మినిస్ట్రీలు/డిపార్ట్‌మెంట్లు, ఆరు ఎస్&టీ డిపార్ట్‌మెంట్ల నుంచి 168 ప్రతిపాదనలు/రిక్వైర్మెంట్లు అందాయని శుక్రవారం తెలియజేసారు.  సంబంధిత సైన్స్ మంత్రిత్వ శాఖలు  విభాగాలు వీటిపై కసరత్తు ప్రారంభించాయని ఆయన తెలిపారు. అన్ని సైన్స్ అండ్ టెక్నాలజీ మినిస్ట్రీలు/డిపార్ట్‌మెంట్ల ఉన్నత స్థాయి కెపాసిటీ బిల్డింగ్ సంయుక్త సమావేశంలో డాక్టర్ జితేంద్ర సింగ్ ఈ విషయాన్ని తెలిపారు. ఈ సమావేశంలో భారత ప్రభుత్వ ప్రిన్సిపల్ సైంటిఫిక్ అడ్వైజర్ ప్రొఫెసర్ కె విజయ్ రాఘవన్, కెపాసిటీ బిల్డింగ్ కమిషన్ సెక్రటరీ హేమాంగ్ జానీ, మినిస్ట్రీ ఆఫ్ ఎర్త్ సైన్సెస్ సెక్రటరీ డాక్టర్ ఎం. రవిచంద్రన్, డిఎస్‌టి సెక్రటరీ డాక్టర్ ఎస్. చంద్రశేఖర్, డాక్టర్ రాజేష్ పాల్గొన్నారు. డీటీబీ సెక్రటరీ గోఖరే,  డిఎస్ఐఆర్ సెక్రటరీ డాక్టర్ శేఖర్ సి మండే,  ఇతర సీనియర్ అధికారులు కూడా కార్యక్రమానికి హాజరయ్యారు.

ఈ విశిష్ట కార్యక్రమం డాక్టర్ జితేంద్ర సింగ్ ఈ సంవత్సరం సెప్టెంబర్ మధ్యలో ప్రారంభించారు, ఇందులో సైన్స్ & టెక్నాలజీ, ఎర్త్ సైన్సెస్, అటామిక్ ఎనర్జీ, స్పేస్/ఐఎస్ఆర్ఒ, సీఎస్ఐఆర్  బయోటెక్నాలజీతో సహా అన్ని సైన్స్ మినిస్ట్రీల ప్రతినిధులు విడివిడిగా ప్రతి ఒక్కరితో విస్తృతమైన చర్చలు జరిపారు. వివిధ కేంద్ర మంత్రిత్వ శాఖలు ఏ రంగంలో ఏ శాస్త్రీయ అనువర్తనాలను (అప్లికేషన్స్) ఉపయోగించవచ్చో తెలుసుకోవడానికి సంప్రదింపులు జరిపారు. నిర్దిష్ట మంత్రిత్వ శాఖ ఆధారిత లేదా నిర్దిష్ట శాఖ ఆధారిత ప్రాజెక్టులకు బదులుగా ఇంటిగ్రేటెడ్ థీమ్ ఆధారిత ప్రాజెక్టుల ఆవశ్యకతను మంత్రి వివరించారు.

వ్యవసాయం, పాడిపరిశ్రమ, ఆహారం,  జల శక్తి, విద్యుత్  బొగ్గు, విద్య, నైపుణ్యం, రైల్వేలు, రోడ్లు వంటి రంగాల కోసం వివిధ సైంటిఫిక్ అప్లికేషన్లను రూపొందించడానికి సెప్టెంబర్‌లో ఒక కార్యక్రమాన్ని ప్రారంభించారు. కేవలం మూడు నెలల్లోనే లైన్ మినిస్ట్రీల నుండి ఇంత పెద్ద సంఖ్యలో ప్రతిపాదనలు అందాయని డాక్టర్ జితేంద్ర సింగ్ సంతృప్తి వ్యక్తం చేశారు. నేడు ప్రతి రంగం శాస్త్ర సాంకేతికతపై ఎక్కువగా ఆధారపడుతున్నదనే విషయాన్ని దృష్టిలో ఉంచుకోవాలని ఆయన అన్నారు.   ప్రధాని నరేంద్ర మోదీకి సహజంగా సైన్స్ పట్ల మక్కువ ఉండటమే కాకుండా సైన్స్ అండ్ టెక్నాలజీ ఆధారిత కార్యక్రమాలు  ప్రాజెక్టులకు మద్దతు ఇవ్వడంలో  ప్రోత్సహించడంలో కూడా ముందుకు వస్తున్నారని మంత్రి అన్నారు. మంచి ఫలితాల కోసం సమీకృత విధానాన్ని అనుసరించడానికి, సమస్యల నుండి బయటకు రావడానికి ఇదే సరైన సమయమని ఆయన అన్నారు. మనదేశం ఐదు ట్రిలియన్ డాలర్ల ఆర్థిక వ్యవస్థగా ఎదగాలన్న  ప్రధాన మంత్రి ఆశయాన్ని సాధించడానికి,  పౌరులందరికీ జీవన సౌలభ్యాన్ని మెరుగుపరచడానికి భారత ప్రభుత్వ ఆధ్వర్యంలోని సైన్స్ మంత్రిత్వ శాఖలు  విభాగాల సామర్థ్యాన్ని పెంపొందించడానికి ఈ సమావేశం దృష్టి పెట్టిందని అన్నారు. సివిల్ సర్వీస్ కెపాసిటీ బిల్డింగ్‌లో పరివర్తన మార్పు ద్వారా దేశంలో పాలనను మెరుగుపరచడం లక్ష్యంగా పెట్టుకున్న మిషన్ కర్మయోగి  ముఖ్య అవసరాల్లో ఈ విభాగాల సామర్థ్య నిర్మాణ అవసరాలు కూడా భాగం. డాక్టర్ జితేంద్ర సింగ్ ఆదేశాల మేరకు, భారత ప్రభుత్వ ప్రిన్సిపల్ సైంటిఫిక్ అడ్వైజర్ ప్రొఫెసర్ కె విజయరాఘవన్ ఇప్పటి వరకు లైన్ విభాగాలు/మంత్రిత్వ శాఖలు  ఎస్&టీ డిపార్ట్‌మెంట్‌లతో డజనుకు పైగా సమావేశాలకు అధ్యక్షత వహించారు  సమావేశానికి సంబంధించిన ఐదు అంశాలను గుర్తించారు. ఇవి (1) శక్తి  వాతావరణ మార్పుల తగ్గింపు,(2) మౌలిక సదుపాయాలు  పరిశ్రమలు;(3) వ్యవసాయం, ఆహారం  పోషకాహారం (4) విద్య, నైపుణ్యం  సామాజిక సాధికారత;(5) ఆరోగ్యం. పరిష్కారం- ఆధారిత పరిశోధనలు, పబ్లిక్ ఆర్&డీ వ్యవస్థ, లైన్ మంత్రిత్వ శాఖల  సవాళ్లు, పరిశ్రమల ఆర్థిక పోటీతత్వాన్ని మెరుగుపరచడం,  పౌరులకు ప్రభుత్వ సేవలను అందించడంపై సమావేశం దృష్టి పెట్టింది. లైన్ మినిస్ట్రీలు సైన్స్ అండ్ టెక్నాలజీ విభాగాలతో సమన్వయంతో ముఖ్యమైన పరిశోధనల అవసరాలను గుర్తించి, వారి ఆర్&డీ బడ్జెట్‌లను ఉపయోగించుకోవాలని కోరింది.

***



(Release ID: 1785111) Visitor Counter : 156


Read this release in: English , Urdu , Hindi , Marathi