ప్రధాన మంత్రి కార్యాలయం
azadi ka amrit mahotsav

అఖిల భారత మేయర్ల సదస్సు ప్రారంభోత్సవంలో ప్రధాన మంత్రి ప్రసంగం పాఠం

प्रविष्टि तिथि: 17 DEC 2021 5:32PM by PIB Hyderabad

 

హర హర మహాదేవ్,

నమస్కారం,

ఈ కార్యక్రమంలో పాల్గొంటున్న ప్రజాదరణ కలిగిన ప్రజలకు ఉపయోగ పడే ఉత్తరప్రదేశ్   ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్ గారు, మంత్రివర్గంలో నా సహచరులు శ్రీ హర్ దీప్ సింగ్ పూరి గారు, యుపి ప్రభుత్వంలోని మంత్రులు శ్రీ అశుతోష్ టాండన్ గారు, నీలకంఠ తివారీ గారు, అఖిల భారత మేయర్ కౌన్సిల్ ఛైర్మన్ శ్రీ నవీన్ జైన్ గారు, కాశీతో పాటు దేశంలోని ఇతర ప్రాంతాల్లో ఉన్న మేయర్లుఇతర ప్రముఖులు, సోదర సోదరీమణులారా,

 

కాశీ ఎంపీగా ఉన్నందున మీ అందరినీ హృదయపూర్వకంగా స్వాగతిస్తున్నాను. కాశీలో మిమ్మల్ని వ్యక్తిగతంగా స్వాగతించడం నా అదృష్టం. సమయాభావం కారణంగా, మిమ్మల్ని స్వాగతించడానికి నేను అక్కడ లేను, కానీ కాశీ ప్రజలు మీ ఆతిథ్యంలో ఎటువంటి లోటు లేకుండా జాగ్రత్తగా చూసుకుంటారని నేను ఖచ్చితంగా అనుకుంటున్నాను. ఏదైనా లోటు ఉంటే అది కాశీవాసుల తప్పు కాదు, నాది కాబట్టి మీరు నన్ను క్షమించండి. మీరు ఈ సమావేశాన్ని ఆస్వాదిస్తారని, భారతదేశంలోని నగరాల ఉజ్వల భవిష్యత్తు కోసం మీ అనుభవాలను మాతో పాటు పంచుకుంటారని ఒకరి నుండి మరొకరు అనేక విషయాలను నేర్చుకుంటారని నేను ఆశిస్తున్నాను. మీ స్వంత మార్గంలో మీ నగరాలను ఉత్సాహంగా, అందంగా రూపొందించడానికి మీరు ఎటువంటి అవకాశాన్ని వదిలిపెట్టరని నేను గట్టిగా నమ్ముతున్నాను. మేయర్లందరూ తమ పదవీ కాలంలో తమ తమ నగరాలకు ఏదైనా లేదా మరేదైనా సహకారం అందించాలనే కోరికను కలిగి ఉండాలి. 5-20-50 సంవత్సరాల తర్వాత కూడా ప్రజలు మిమ్మల్ని గుర్తుంచుకునేలా మీరు ఖచ్చితంగా మీ నగరంలో మీ పనికి సంబంధించిన ముద్ర వేయాలని కోరుకుంటారు. ప్రతి ఒక్కరూ ఈ కల కలిగి ఉండాలి మీ పనులు చిరస్మరణీయం కావాలని సంకల్పించుకోవాలి, మీరు హృదయపూర్వకంగా ఈ తీర్మానానికి కట్టుబడి ఉండాలి. నగరం మొత్తం బాధ్యతను ప్రజలు మనపై అప్పగించినప్పుడు, దానిని నెరవేర్చడానికి మనం ప్రయత్నించాలి. మీరందరూ తప్పకుండా ఆ దిశగా ఏదైనా చేస్తారని నేను ఖచ్చితంగా అనుకుంటున్నాను. మంచి ఫలితాల కోసం మీరు మీ ప్రయత్నాలను కొనసాగించవలసి ఉంటుంది. ఈ ముఖ్యమైన కార్యక్రమం కోసం మీరు బనారస్, నా కాశీని ఎంచుకున్నందుకు పట్టణాభివృద్ధి మంత్రిత్వ శాఖ, ఉత్తర ప్రదేశ్ ప్రభుత్వంతో పాటు మీ అందరినీ నేను అభినందిస్తున్నాను. దేశాభివృద్ధికి సంబంధించిన మీ తీర్మానాలు బాబా విశ్వనాథ్‌చే ఆశీర్వదించబడినప్పుడు, మీరు కొత్త ప్రేరణతో, నూతన ఉత్సాహంతో తిరిగి వస్తారు. కాశీలో జరిగే ఈ కార్యక్రమం కోసం ఎన్నో అవకాశాలతో ఎదురుచూస్తున్నాను. ఒకవైపు, ప్రపంచంలోని పురాతన నగరాల్లో ఒకటిగా ఉన్న బనారస్, మరోవైపు, ఆధునిక భారతదేశంలోని ఆధునిక నగరాలకు బ్లూప్రింట్! ఈ మధ్య నేను కాశీలో ఉన్నప్పుడు, కాశీ అభివృద్ధి దేశం మొత్తం అభివృద్ధికి రోడ్‌మ్యాప్‌గా మారుతుందని చెప్పాను. మన దేశంలో చాలా నగరాలు సాంప్రదాయ నగరాలు, అవి సాంప్రదాయ పద్ధతిలో అభివృద్ధి చెందాయి. ఈ ఆధునికీకరణ యుగంలో, ఈ నగరాల ప్రాచీనత కూడా అంతే ముఖ్యమైనది. మన పురాతన నగరాల ప్రతి వీధి, రాయి, క్షణం మరియు చరిత్ర నుండి మనం చాలా నేర్చుకోవచ్చు. వారి చారిత్రక అనుభవాలను మన జీవితానికి స్ఫూర్తిగా మార్చుకోవచ్చు. మన వారసత్వాన్ని సంరక్షించడానికి, అందంగా మార్చుకోవడానికి కొత్త మార్గాలను అభివృద్ధి చేయవచ్చు. మా స్థానిక కళా నైపుణ్యాలు, ఉత్పత్తులను ఎలా అభివృద్ధి చేయాలో,  వాటిని నగరం ముఖ్య లక్షణంగా ఎలా మార్చాలో మనం నేర్చుకోవచ్చు!

మిత్రులారా,

మీరు బనారస్‌ని సందర్శించినప్పుడు లేదా మీలో చాలామంది దీనిని ముందుగా సందర్శించి ఉండవచ్చు, మీరు ఖచ్చితంగా కొత్త మార్పులను చూడవచ్చు, పాత జ్ఞాపకాలతో పోల్చవచ్చు. అదే సమయంలో, మీ నగరం కూడా మీకు గుర్తుకు వస్తుంది. మీరు కాశీ వీధిని, నదిని మీ నగరంతో పోల్చి, మీ తోటి మేయర్లతో చర్చించడానికి ప్రయత్నిస్తారు. వారితో చర్చిస్తున్నప్పుడు మీరు కొత్త ఆలోచనలు, కార్యక్రమాలు పొందుతారు. మేయర్ తన నగరంలో ఆ పనిని పునరావృతం చేసినప్పుడు, మీ నగరంతో పాటు  రాష్ట్ర ప్రజలు చాలా సంతోషంగా ఉంటారు, వారు  కొత్త విశ్వాసాన్ని పొందుతారు. మనం పరిణామాన్ని నమ్మడానికి ప్రయత్నించాలి, భారతదేశానికి ఈ రోజు విప్లవం అవసరం లేదు. మనకు పునరుజ్జీవనం కావాలి ఎందుకంటే పాతదంతా కూల్చివేయడానికి ఇది మా మార్గం కాదు. పాత కాలాన్ని తీర్చిదిద్ది, ఆధునిక యుగం అవసరాలను తీర్చుకుంటూ ముందుకు సాగేందుకు కృషి చేయాలి. మీరు గమనిస్తే, దేశవ్యాప్తంగా స్వచ్ఛత ప్రచారం జరుగుతోంది. ప్రతి సంవత్సరం పరిశుభ్రమైన నగరంగా ప్రకటించబడుతుంది. కొన్ని నగరాలు తమను తాము స్థాపించుకున్నప్పటికీ, మరికొన్ని నగరాలు ఫలానా నగరానికి అవార్డు వస్తుందనే ఉద్దేశ్యంతో వదులుకున్నాయి. మనం చేయలేము అనే ఈ మనస్తత్వం ఉండకూడదు. వచ్చేసారి పరిశుభ్రత పోటీలో మీరెవరికీ రెండో స్థానం ఉండదని మేయర్లందరూ ప్రతిజ్ఞ చేయాలి. మీరు ఈ తీర్మానం చేయగలరా లేదా? పరిశుభ్రమైన నగరాలకు బహుమతులు ఇస్తున్నప్పుడు, వాటిని గుర్తిస్తున్నప్పుడు, వారు ఉత్తమంగా ప్రయత్నిస్తున్న నగరాలను కూడా మనం ఏకకాలంలో గుర్తించాలని నేను హర్దీప్ పూరీని అభ్యర్థిస్తున్నాను. అదే సమయంలో, మేము మూడు పేలవమైన నగరాల జాబితాను తయారు చేయాలి మరియు పరిశుభ్రత కోసం వారు ఏమీ చేయడంలో వైఫల్యం చెందారో, వాటి గురించి ఆ రాష్ట్రాల్లో ప్రచారం చేయాలి. ఇది ప్రజల నుండి ఒత్తిడికి దారి తీస్తుంది, మంచి కోసం ఏదైనా చేయడానికి వారిని ప్రోత్సహిస్తుంది. పరిశుభ్రతను ఏడాది పాటు నిర్వహించే కార్యక్రమంగా చూడవద్దని మేయర్లను అభ్యర్థిస్తున్నాను. మీరు ప్రతి నెలా మున్సిపల్ బోర్డుల మధ్య పరిశుభ్రత పోటీని నిర్వహించగలరా? ఈ బోర్డుల పనితీరును అంచనా వేయడానికి జ్యూరీని ఏర్పాటు చేయాలి. బోర్డు కౌన్సిలర్ల మధ్య అలాంటి పోటీ ఉంటే అది సంచిత ప్రభావాన్ని చూపుతుంది, మొత్తం నగర రూపురేఖలను మార్చడానికి ఉపయోగపడుతుంది. పరిశుభ్రతకు సంబంధించి మరొక ముఖ్యమైన అంశం సుందరీకరణ. ప్రపంచవ్యాప్తంగా జరుగుతున్న అందాల పోటీలను నేను ప్రస్తావించడం లేదు. సుందరీకరణ ప్రచారాలను ప్రారంభించవచ్చు. పరిశుభ్రత, సౌందర్యం ప్రామాణికం కావచ్చు. ప్రతి నగరం జ్యూరీని   ఏర్పాటు చేయాలి. గోడలకు ఎలా రంగులు వేశారు, దుకాణాలపై డిస్‌ప్లే బోర్డులు ఎలా వేశారు, వీధులు, చిరునామాలు ఎలా రాసారు. ఇలాంటివి చాలా ఉన్నాయి. స్వాతంత్ర్య అమృత్ మహోత్సవ్ సందర్భంగా మీరు ఒక సామాన్యుడి నుండి మూడు పనులు చేయవచ్చు. మొదట, స్వాతంత్ర్య కొన్ని సంఘటనల ఆధారంగా రంగోలీ పోటీని నిర్వహించవచ్చు. నగర స్థాయిలో పోటీ ఉండాలి. వచ్చే ఏడాది జనవరి 26 వరకు  వాతావరణాన్ని సృష్టించండి. అదేవిధంగా, మీ నగరంలో స్వాతంత్ర్య ఉద్యమానికి సంబంధించిన సంఘటనల ఆధారంగా పాటల పోటీని నిర్వహించవచ్చు. అదే తరహాలో మన తల్లులు, కూతుళ్లను కలుపుకుని ఓ కార్యక్రమం నిర్వహించవచ్చు. నవజాత శిశువులకు జోల పాటలు పాడే పాత సంప్రదాయం మనకు ఉంది. మనం ఆధునిక లాలిపాటలు చేయగలమా? 2047లో దేశానికి 100 ఏళ్లు నిండినప్పుడు భారతదేశ భవిష్యత్తు ఎలా ఉంటుంది, ఈరోజు తన తల్లి జోలపాటలు చెబుతోందని పుట్టిన బిడ్డ కల  ఎలా ఉంటుంది? ఆమె ఉజ్వల భవిష్యత్తు జోలపాటను పఠించాలి, అతనిని మొదటి నుండి సంస్కారవంతుడిని చేయాలి. మనం దీన్ని చేయగలమా? నిన్న మీరు గంగా ఘాట్‌లను తప్పక చూసి ఉంటారు. ప్రపంచం నలుమూలల నుండి పర్యాటకులు కాశీకి వస్తుంటారు. కాశీ ఆర్థిక వ్యవస్థను నడిపించడంలో గంగమ్మది పెద్ద పాత్ర. గంగామాత ఒడ్డున పునరుజ్జీవన పనులు కాశీ ఆర్థిక వ్యవస్థకు బలాన్నిస్తాయి. కొన్ని నదుల ఒడ్డున ఉన్న అనేక నగరాలు ఉన్నాయి, కానీ కాలక్రమేణా, ఆ నది తన రంగును కోల్పోయింది మరియు వాటిలో చాలా మురికి కాలువలుగా మారాయి. ఈ నదుల పట్ల మనం చాలా సున్నితమైన విధానాన్ని అవలంబించాలి. ప్రపంచమంతా నీటి సంక్షోభం, గ్లోబల్ వార్మింగ్ మరియు వాతావరణ మార్పుల గురించి మాట్లాడుతున్న తరుణంలో మనం ఆ నదుల గురించి పట్టించుకోకపోతే మనం వాటి గురించి ఎలా గర్వపడగలం?

 

ప్రతి సంవత్సరం ఏడు రోజులు నదీ పండుగను నిర్వహించగలమా? నదిని శుభ్రపరచడం, లేదా నది చరిత్ర లేదా నదికి సంబంధించిన సంఘటనల గురించి అవగాహన కల్పించడం వంటి కార్యక్రమాలలో నగరం మొత్తం పాలుపంచుకోవాలి. కవుల సమ్మేళనం ఉండవచ్చు. నగర అభివృద్ధి ప్రయాణంలో కేంద్రంగా నిలిచిన నదిని మనం తేలికగా తీసుకోకూడదు. మీ నగరానికి కొత్త జీవితం నింపబడిందని మరియు నది ప్రాముఖ్యత పట్ల కొత్త ఉత్సాహాన్ని మీరు గమనించవచ్చు.

 

అదేవిధంగా, సింగిల్ యూజ్ ప్లాస్టిక్‌పై మన నగరాల్లో మనం ఎంత అవగాహనతో ఉన్నామో మీరు గమనించి ఉండాలి. మన నగరంలో ఎక్కడా సింగిల్ యూజ్ ప్లాస్టిక్ వాడకుండా దుకాణదారులకు, వ్యాపారులకు వివరించాలి. దీన్ని వ్యవస్థ నుండి తీసివేసి, బదులుగా పేదలు వార్తాపత్రిక వ్యర్థాలతో తయారు చేసిన పేపర్ బ్యాగ్‌లను వినియోగిద్దాం. దీన్ని వాడండి లేదా షాపింగ్‌కు వెళ్లేటప్పుడు ఇంటి నుంచి బ్యాగ్‌ని తీసుకెళ్లడం అలవాటు చేసుకోండి. మరియు ఇప్పుడు వృత్తాకార ఆర్థిక వ్యవస్థ యొక్క ప్రాముఖ్యత ప్రపంచవ్యాప్తంగా పెరుగుతోంది, వ్యర్థాలను ఉత్తమంగా చేస్తుంది. కొన్నిసార్లు నగరంలో వ్యర్థాలను ఉత్తమంగా చేయడానికి మరియు ఎగ్జిబిషన్ లేదా మార్కెటింగ్ ఫెయిర్ నిర్వహించడానికి పోటీ ఉండవచ్చు. విస్మరించిన ఉత్పత్తుల నుండి అద్భుతమైన వస్తువులను తయారు చేయడం చాలా మంది డిజైనర్లను మీరు తప్పక చూసి ఉంటారు. మరియు కూడలిలో ఉంచినట్లయితే, అది ఒక స్మారక చిహ్నంగా మారుతుంది. వ్యర్థాల నిర్వహణ కూడా ఆదాయ నమూనాగా మారవచ్చు. కొన్ని నగరాలు చేసిన విధంగా ఆ నమూనాను ఎలా అభివృద్ధి చేయాలనే దిశగా మనం కృషి చేయాలి. అదేవిధంగా మురుగునీటిని తిరిగి వినియోగించుకోవచ్చు. నేడు తోటల్లో నీటిని వాడుతున్నాం. ఊరి రైతులు నీళ్లు ఆపేసి నగరానికి నీళ్లివ్వాలని డిమాండ్ చేస్తే ఏం జరుగుతుందో ఊహించుకోవచ్చు.

తోటల మాదిరిగా తాగునీరు అవసరం లేని చోట శుద్ధి చేసిన మురుగునీటినే వాడుకోవచ్చు. వ్యర్థాలు సంపదగా మారుతాయి మరియు నీటి మురికి కూడా తొలగిపోతుంది. నగర ఆరోగ్యంలో కూడా గణనీయమైన మార్పు రానుంది. నగరాల ఆరోగ్యం కోసం మనం ఈ నివారణ విషయాలపై దృష్టి పెట్టకపోతే, మనం ఎన్ని ఆసుపత్రులు నిర్మించినా సరిపోదు. కాబట్టి, మన నగరాన్ని పరిశుభ్రంగా మరియు ఆరోగ్యంగా ఉంచుకోవడానికి మనం కృషి చేయాలి. మన వంటశాలలు, వీధులు మరియు నిర్మాణ స్థలాల నుండి చెత్తను ఏ నిర్దేశిత స్థలంలో వేయకూడదు. మనం ఆవిష్కరణకు ప్రయత్నించాలి. ఉదాహరణకు, మురుగునీటి శుద్ధి యొక్క ఆధునిక నమూనా సూరత్‌లో అభివృద్ధి చేయబడింది. మురుగు నీటిని శుద్ధి చేసిన తర్వాత పరిశ్రమలకు విక్రయించి స్థానిక సంస్థ సొమ్ము చేసుకుంటున్నారు. ఇతర నగరాల్లో కూడా అలాంటిదే జరగాలి. నాకు తెలుసు కాబట్టి, నేను ప్రస్తావించాను. నగరాలు తమ ఆదాయాన్ని పెంచుకోవచ్చు. మన నగరాల పుట్టిన తేదీని తెలుసుకోవడానికి కూడా ప్రయత్నించాలి, కొన్ని రికార్డులు ఎక్కడో అందుబాటులో ఉంటాయి. నగర జన్మదిన వేడుకలను ఘనంగా జరుపుకోవాలి. నగరం యొక్క గర్వం కోసం అనేక పోటీలు ఉండాలి. నగరానికి ఏదైనా చేయాలనే స్ఫూర్తి ప్రతి పౌరుడిలోనూ ఉండాలి. లేకపోతే, మనం అప్రధానమైన విషయాలను చర్చించుకోవడం జరుగుతుంది.

యోగి గారు తన ప్రసంగంలో ఎల్ ఈడి బల్బుల గురించి ప్రస్తావించారు. ఎల్ ఈడి బల్బ్ లేని ఒక్క పోల్ కూడా మీ నగరంలో ఉండకుండా మీరు ధృవీకరించగలరా? మునిసిపల్ కార్పొరేషన్ విద్యుత్ బిల్లు పూర్తిగా తగ్గుతుందని మరియు కాంతి యొక్క వెలుగు కూడా భిన్నంగా ఉంటుందని మీరు కనుగొంటారు. ఈ ప్రచారం రెండు లేదా మూడు నెలల్లో పూర్తయ్యేలా మీరు ధృవీకరించుకోవాలి. అదేవిధంగా, మీరు ఓటర్లను సంప్రదించవచ్చు. మధ్యతరగతి కుటుంబాలలో ఎల్ ఈడీ బల్బుల వినియోగం ఉంటే వారి నెలవారీ విద్యుత్ బిల్లు గణనీయంగా తగ్గి, 200-2000 రూపాయల మధ్య ఆదా చేయగలుగుతారు. ఈ దిశ లో మ నం ప్ర య త్నాలు చేయాల్సి ఉంది. ఇప్ప టికే అనేక ప థ కాలు అందుబాటులో ఉన్నాయి.

భారతదేశం స్వాతంత్ర్య అమృత్ మహోత్సవాన్ని జరుపుకుంటోంది. నగర అభివృద్ధిలో ప్రజల భాగస్వామ్యం ఉండాలి మరియు మేము దానికి ప్రాధాన్యత ఇవ్వాలి. పాఠశాలల్లో ఎన్ సిసి యూనిట్లను నిమగ్నం చేయండి. వివిధ ప్రదేశాలలో బాబాసాహెబ్ అంబేద్కర్, మహాత్మా గాంధీ, స్వామి వివేకానంద, షహీద్ భగత్ సింగ్, మహారాణా ప్రతాప్ లేదా ఛత్రపతి శివాజీ మహారాజ్ విగ్రహాలు ఉంటాయి. మేము విగ్రహాలను ప్రతిష్టించేటప్పుడు చాలా స్పృహతో ఉంటాము. కానీ కొంతకాలం తర్వాత, ఎవరూ బాధపడరు. పుట్టిన రోజున మాత్రమే మనం వారిని స్మరించుకుంటాము. ఎన్‌సీసీ బృందాలను గ్రూపులుగా ఏర్పాటు చేసి విగ్రహాల శుభ్రతకు బాధ్యత వహించాలి. ఆ విగ్రహాలను సందర్శించే పిల్లలకు ఈ వ్యక్తుల సహకారం గురించి వివరించాలి. ఇవి చిన్న విషయాలే కానీ మొత్తం నగరాన్ని మార్చే గొప్ప శక్తిని కలిగి ఉంటాయి.

ఈ అమృత మహోత్సవం మీ హయాంలో వచ్చింది. అదేవిధంగా, మీరు స్వాతంత్ర్య ఉద్యమానికి అనుకూలమైన లేదా భారతదేశం యొక్క ఉజ్వల భవిష్యత్తును హైలైట్ చేసే ఒక ప్రత్యేకమైన స్మారక చిహ్నాన్ని తయారు చేయవచ్చు మరియు దానిని ఒక ముఖ్యమైన కూడలిలో ఏర్పాటు చేయవచ్చు. ఇది ప్రభుత్వ-ప్రైవేటు భాగస్వామ్యంతో జరగాలి తప్ప ప్రభుత్వ సొమ్ముతో కాదు. పోటీ నిర్వహించి అత్యుత్తమ డిజైన్లను అందజేయాలి. డిజైనర్లు వారి జీవిత జ్ఞాపకాలను వదిలివేస్తారు. మీ నగరానికి గుర్తింపు ఉండాలని మీరు అనుకోలేదా? నిర్దిష్ట ఆహార పదార్థానికి ప్రసిద్ధి చెందిన నగరం ఉండవచ్చు. ఉదాహరణకు, బనారసీ పాన్! ఎవరైనా కష్టపడి పని చేసి ఉండాలి, అందుకే ఇది ఒక గుర్తింపుగా మారింది. బహుశా ఈ మేయర్లందరూ కూడా బనారస్ పాన్ రుచి చూస్తారు. నా ఉద్దేశ్యం ఏమిటంటే, మీ నగరంలో మీరు బ్రాండ్ చేయగల కొన్ని ఉత్పత్తులు, కొన్ని చారిత్రక ప్రదేశాలు ఉంటాయి.

 

ఉత్తరప్రదేశ్ వన్ డిస్ట్రిక్ట్, వన్ ప్రొడక్ట్ అనే చాలా ప్రశంసనీయమైన కార్యక్రమాన్ని నడుపుతోంది. ఇది చాలా ప్రసిద్ధి చెందిన జిల్లా కు సంబంధించిన ఒక నిర్దిష్ట ఉత్పత్తిని మ్యాప్ చేసింది. సావనీర్లు కూడా ఉన్నాయి. ఇది చాలా మంచి ప్రభావాన్ని సృష్టించింది. మీ నగరంలో క్రీడా వస్తువులకు ప్రసిద్ధి చెందిన ప్రదేశం ఉంటుంది. ఉదాహరణకు, బనారసీ చీర దేశవ్యాప్తంగా ప్రసిద్ధి చెందింది. దేశంలోని ఏ ప్రాంతంలోనైనా వివాహం జరిగినప్పుడు, ప్రతి ఒక్కరూ బరాణాసి చీర కొనాలని భావిస్తారు. ఎవరో దాని బ్రాండింగ్ చేసి ఉండాలి. అదేవిధంగా, దేశంలో ప్రసిద్ధి చెందిన ఒక నిర్దిష్ట ఉత్పత్తి మీ నగరంలో ఉండాలి. అది పాట్నా, హైదరాబాద్, కొచ్చి, తిరువనంతపురం లేదా చెన్నై ఏదైనా నగరం కావచ్చు. మీ నగరం యొక్క ప్రత్యేకత ఏమిటో తెలుసుకోవడానికి ప్రయత్నించండి. ఇది మా అతిపెద్ద బలం మరియు మేము దానిని ప్రోత్సహించాలని నగరం మొత్తం కలిసి నిర్ణయించుకుందాం. త్వరలో, ఇది ఆర్థిక కార్యకలాపాలకు గొప్ప సాధనంగా మారుతుంది. ఒక్కమాటలో చెప్పాలంటే, నగరాల అభివృద్ధిని కొత్త స్థాయికి తీసుకెళ్లాలి మరియు ఆ దిశగా మనం కృషి చేయాలి. పెరుగుతున్న జనాభా రద్దీ కారణంగా నగరాల్లో ట్రాఫిక్ జామ్‌ల సమస్య ఉంది. ఎన్ని ఫ్లై ఓవర్లు నిర్మించినా పరిస్థితి మెరుగుపడదు. మీరు సూరత్‌కు వెళితే, ప్రతి 100 మీటర్ల తర్వాత ఒక ఫ్లై ఓవర్ కనిపిస్తుంది. బహుశా ఇది ఫ్లై ఓవర్ల నగరంగా మారింది. ఫ్లై ఓవర్లు సమస్యకు పరిష్కారం కాదు. మేము ప్రజా రవాణా వ్యవస్థ మరియు మెట్రో నెట్‌వర్క్‌పై ఎక్కువ దృష్టి పెట్టాము. అయితే ఇది కాకుండా ఇంకా చాలా విషయాలు ఉన్నాయి. మన సామాజిక జీవితంలో మార్పు తీసుకురావడానికి కృషి చేయాలి. అదేవిధంగా, దివ్యాంగుల సమస్య ఉంది. నగరంలో కొత్త భవన నిర్మాణం, రోడ్లు, క్రాస్ సెక్షన్, టాయిలెట్లు, బస్సులు ఎక్కే మెట్లు వంటి ఏదైనా అభివృద్ధి పనులు చేపట్టేటప్పుడు యాక్సెస్‌బుల్ ఇండియా క్యాంపెయిన్ కింద వారి అవసరాలను మనం గుర్తుంచుకోవాలి. మా ప్రణాళికలలో భాగం. అప్పుడే అది జరుగుతుంది మరియు మన ఆర్థిక వ్యవస్థకు చోదక శక్తి మన నగరాలు అనేది ఒక్కటి నిజం. మనం నగరాలను శక్తివంతమైన ఆర్థిక వ్యవస్థగా మార్చాలి. కొత్త పరిశ్రమలు ఏర్పాటయ్యే స్థలాన్ని గుర్తించడంపై దృష్టి సారించాలి. కూలీలు తమ పని ప్రదేశానికి చాలా దూరం వెళ్లాల్సిన అవసరం లేదని, వారికి అక్కడే పని కల్పించాలని, అక్కడే వసతి సౌకర్యం ఉండేలా చూసుకోవాలి. మన అభివృద్ధి నమూనాలో ఈ సమగ్ర మరియు సమగ్ర విధానాన్ని మనం ఉంచుకోవాలి మరియు అప్పుడే ప్రతి ఒక్కరూ ఆర్థిక కార్యకలాపాలకు వస్తారు. ఆ ప్రదేశంలో పర్యావరణ వ్యవస్థ ఉందని, అక్కడ అతను తన పరిశ్రమ లేదా కర్మాగారాన్ని స్థాపించి ఉపాధిని కల్పించగలడని అతను ఒప్పించాలి. మన అభివృద్ధి నమూనాలో ఎంఎస్ఎంఈ లను ఎలా శక్తివంతం చేయవచ్చో కూడా మనం ఆలోచించాలి. నేను చెప్పినదంతా మీరు చేయగలరో లేదో నాకు తెలియదు, కానీ మీకు అపారమైన ఆనందాన్ని మరియు సంతృప్తిని ఇచ్చే ఒక పనిని చేయవలసిందిగా మేయర్లందరినీ నేను కోరుతున్నాను మరియు అది ప్రధానమంత్రి స్వనిధి పథకం.

ప్రతి నగరంలో వీధి వ్యాపారులు ఉన్నారని మీకు తెలుసు మరియు ప్రతి ఒక్కరి జీవితంలో వారి ప్రాముఖ్యతను తగ్గించలేము మరియు సూక్ష్మ ఆర్థిక వ్యవస్థలో వారు కూడా ప్రధాన శక్తిగా ఉన్నారు. కానీ వాటిని ఎవరూ పట్టించుకోవడం లేదని నిర్లక్ష్యానికి గురవుతున్నారు. వడ్డీ వ్యాపారులకు ఖరీదైన వడ్డీలు చెల్లించి, తమ ఇంటిని ఎలాగోలా నడిపి, సంపాదనలో సగం వడ్డీకే పోయే వారి గురించి మనం ఎప్పుడైనా బాధపడ్డామా? వీధుల్లో అరుస్తూ తమ వస్తువులను అమ్ముకుంటారు, పేదరికంతో పోరాడి కష్టపడి పనిచేయాలని కోరుకుంటారు. ప్రధానమంత్రి స్వనిధి యోజన వారి కోసమే. మరియు కరోనా కాలంలో, వారు లేకుండా జీవితం కష్టమని అందరూ గ్రహించారు. కరోనా కాలంలో వారు అక్కడ లేరు. ఇంతకుముందు ఎప్పుడూ అనిపించలేదు, కానీ కూరగాయలు అమ్మేవాడు, పాలవాడు, వార్తాపత్రికలు, క్లీనర్ లేదా వంట చేసేవాడు రాకపోవడంతో అందరూ చెమటలు పట్టవలసి వచ్చింది.

మన జీవితం పూర్తిగా ఆధారపడిన ఈ వ్యక్తుల ప్రాముఖ్యత మరియు విలువను కరోనా మనకు గ్రహించేలా చేసింది. వారిని వదలకుండా చూసుకోవడం మన బాధ్యత. అవి మన స్వంత ప్రయాణంలో భాగం. అందువల్ల, మేము ప్రధానమంత్రి స్వనిధి యోజనను ప్రారంభించాము, ఇది చాలా మంచిది. మీరు మీ నగరంలో ఉన్న ఈ వ్యక్తుల జాబితాను రూపొందించి, మొబైల్ ఫోన్‌ల ద్వారా ఎలా లావాదేవీలు జరపాలో వారికి బోధిస్తారు. వారికి బ్యాంకు నుంచి డబ్బులు వస్తాయి. వారు కూరగాయలను కొనుగోలు చేసే హోల్‌సేల్ వ్యాపారికి చెల్లింపు చేయడానికి వారి మొబైల్ ఫోన్‌లను ఉపయోగించాలి. వారు కూరగాయలను విక్రయించడానికి వందలాది ఇళ్లను సందర్శిస్తారు మరియు వారు నగదును కాకుండా డిజిటల్‌గా డబ్బును అంగీకరించాలి. వారు 100 శాతం డిజిటల్ రికార్డు సాధించగలిగితే, అప్పుడు బ్యాంకులు కూడా తమ వ్యాపార చరిత్ర గురించి తెలుసుకుంటారు మరియు డబ్బు ఇవ్వడానికి వెనుకాడరు. వారు 10,000 రూపాయలతో ప్రారంభించవచ్చు కానీ ఆ డబ్బు తిరిగి వచ్చినట్లయితే, వారు దానిని 20,000 రూపాయలు మరియు తరువాత 50,000 రూపాయలకు పెంచుతారు. నిజానికి 100 శాతం డిజిటల్ లావాదేవీలు చేస్తే వడ్డీ సున్నాకి వస్తుందని గతంలో కూడా చెప్పాను.

ఈ వీధి వ్యాపారులు తమ వ్యాపారానికి వడ్డీ లేకుండా డబ్బు సంపాదించగలిగితే, వారు తమకు తాము బాగా రాణిస్తారని, తమ పిల్లల చదువులు చూసుకుంటారని, నాణ్యమైన వస్తువులను అమ్మడం ప్రారంభించి తమ వ్యాపారాన్ని విస్తరించుకుంటారని నా అభిప్రాయం. మీరు ప్రధాన మంత్రి స్వనిధి యోజనకు ప్రాధాన్యత ఇవ్వగలరా? 200-500-1000-2000 మంది వీధి వ్యాపారుల బ్యాంకు ఖాతాలను తెరిపిస్తామని, వచ్చే ఏడాది జనవరి 26లోపు వారికి డిజిటల్ లావాదేవీలపై శిక్షణ ఇస్తామని కాశీ భూమి నుండి మరియు మా గంగా తీరం నుండి ప్రతిజ్ఞ చేయండి. సరుకులు కొనుగోలు చేసే వ్యాపారులకు కూడా డిజిటల్‌ శిక్షణ ఇవ్వాలి. తక్కువ సమయంలో, డిజిటల్ వ్యాపారం అభివృద్ధి చెందుతుంది మరియు వీధి వ్యాపారులు తమ వ్యాపారాన్ని కనీసం లేదా వీలైతే సున్నా వడ్డీతో విస్తరించుకోగలుగుతారు.

 

మీరు కాశీకి వచ్చారు, దానిని నిశితంగా గమనిస్తారు. మీరు చాలా సలహాలను కలిగి ఉండవచ్చు, మీరు మీ సలహాలను నాకు పంపినట్లయితే, అది కాశీలో నా విధులను నిర్వహించడంలో నాకు చాలా సహాయపడుతుంది. మేయర్‌గా మీ నగరంలో మీరు తీసుకున్న చొరవ కాశీలో ఉపయోగపడుతుందని మీరు భావిస్తే, దయచేసి నాతో పంచుకోండి. నేను మీకు కృతజ్ఞతతో ఉంటాను. నేను మీ నుండి నేర్చుకోవాలనుకుంటున్నాను. అందుకే మేయర్లందరినీ ఇక్కడికి ఆహ్వానించాను. దయచేసి మీ నగరంలో మీరు చేసిన దాని గురించి కాశీ ప్రజలతో ఆలోచనలను పంచుకోండి. నేను మరియు నా సహోద్యోగులు ఖచ్చితంగా ఆ ఆలోచనలను అమలు చేస్తారు మరియు నేను మొదటి విద్యార్థిని అవుతాను. మేమంతా రాజకీయాల్లో ఉన్నాం. రాజకీయ జీవితంలో ముందుకు సాగడానికి చాలా మంచి అవకాశాలు ఉన్న స్థానం ఇది అని మీ అందరికీ తెలుసు. సర్దార్ వల్లభ్‌భాయ్ పటేల్ అహ్మదాబాద్ మునిసిపాలిటీకి మేయర్‌గా మరియు తర్వాత ప్రెసిడెంట్‌గా పనిచేసిన కాలంలోనే అయ్యారని మీకు తెలిసి ఉండాలి. అప్పట్లో అహ్మదాబాద్ నగరం చాలా చిన్నది. అక్కడి నుంచే ఆయన రాజకీయ ప్రయాణం మొదలైంది. మరియు నేటికీ దేశం ఆయనను గుర్తుంచుకుంటుంది. మునిసిపల్ కార్పొరేషన్ నుండి రాజకీయ జీవితం ప్రారంభించిన నాయకులు చాలా మంది ఉన్నారు. మీ జీవితం కూడా అలాంటి దశలోనే ఉంది. మీ ఉజ్వల రాజకీయ భవిష్యత్తును మరింత ముందుకు తీసుకెళ్లేందుకు మీరు పూర్తి అంకితభావంతో మీ ప్రాంత అభివృద్ధికి కట్టుబడి ఉంటారని నేను ఖచ్చితంగా అనుకుంటున్నాను. ఆధునిక నగరాలు నిర్మించబడాలి మరియు అదే సమయంలో వారసత్వాన్ని పునరుద్ధరించాలి. వారసత్వం మరియు అభివృద్ధి రెండూ అవసరం. మీ కలలను నెరవేర్చుకోవడానికి మీరు ముందుకు సాగాలని ఆశిస్తున్నాను. మరోసారి కాశీకి స్వాగతం పలుకుతున్నాను. కాశీ ప్రజలు మిమ్మల్ని బాగా చూసుకున్నారని నేను ఖచ్చితంగా అనుకుంటున్నాను. కాశీ వాసులు ఆత్మీయులు. మీరు ఆ ప్రేమను మరియు ఆప్యాయతను ఎప్పటికీ కోల్పోరు వాటిని మీ తిరుగు ప్రయాణంలో మీతో పాటు మీ వెంట తీసుకువెళతారు.

 

చాలా ధన్యవాదాలు, శుభాకాంక్షలు!

 

****


(रिलीज़ आईडी: 1785022) आगंतुक पटल : 245
इस विज्ञप्ति को इन भाषाओं में पढ़ें: English , Urdu , Marathi , हिन्दी , Bengali , Manipuri , Assamese , Punjabi , Gujarati , Odia , Tamil , Kannada , Malayalam