యువజన వ్యవహారాలు, క్రీడల మంత్రిత్వ శాఖ

నేషనల్ డోప్ టెస్టింగ్ లాబొరేటరీ (NDTL) ప్రపంచ డోపింగ్ నిరోధక ఏజెన్సీ (వాడా) గుర్తింపును నిలబెట్టుకుంది

Posted On: 23 DEC 2021 6:11PM by PIB Hyderabad

నేషనల్ డోప్ టెస్టింగ్ లాబొరేటరీ (NDTL) ప్రపంచ డోపింగ్ నిరోధక ఏజెన్సీ (వాడా) గుర్తింపును తిరిగి పొందింది. NDTL అక్రిడిటేషన్ పునరుద్ధరించారని WADA ద్వారా తెలియజేశారు. దీనితో, NDTL యాంటీ డోపింగ్ పరీక్షలు అనుబంధ కార్యక్రమాలు తక్షణ ప్రభావంతో పునఃప్రారంభిస్తారు.
ఈ విషయాన్ని కేంద్ర యువజన వ్యవహారాలు క్రీడల మంత్రి శ్రీ అనురాగ్ ఠాకూర్ ఈరోజు ఒక ట్వీట్‌లో ప్రకటించారు. అక్రిడిటేషన్ పునరుద్ధరణ క్రీడల్లో అత్యుత్తమ ప్రపంచ ప్రమాణాలను సాధించేందుకు భారతదేశం చేస్తున్న ప్రయత్నాలకు ఊతమిస్తుందని శ్రీ ఠాకూర్ తన ట్వీట్‌లో పేర్కొన్నారు.
ఎన్‌డిటిఎల్‌లోని అధికారులు, సిబ్బంది బృందం కూడా అక్రిడిటేషన్‌ను పునరుద్ధరించడానికి అవిశ్రాంతంగా కృషి చేశారు. NDTL WADA అక్రిడిటేషన్ 20 ఆగస్టు 2019 న రద్దు చేశారు, ఇది సెప్టెంబర్ 2018 లో జరిగిన లాబొరేటరీ యొక్క ఆన్-సైట్ పరిశీలనల సమయంలో గమనించిన అవకతవకల ఆధారంగా NDTL  ప్రక్రియలు, పద్దతులను పూర్తిగా రూపొందించడానికి WADA తన వంతుగా నిరంతర మార్గదర్శకత్వం మద్దతును అందిస్తుంది. అంతర్జాతీయ ప్రయోగశాల ప్రమాణాల సంస్థ (ISL)  తాజా స్థితి,  ప్రపంచ డోపింగ్ నిరోధక ఏజెన్సీ   సాంకేతిక పత్రాలు, 2021కి అనుగుణంగా మార్పులు చేసుకుని   NDTL వేగవంతమైన పురోగతిని సాధించింది. ఇప్పుడు దాని సౌకర్యాలు ప్రపంచవ్యాప్తంగా ఉన్న ల్యాబ్‌లతో సమానంగా ఉండేలా  వాడా గుర్తింపు పొందింది. ప్రపంచ స్థాయిలో  రాణించాలని  నిరంతర ప్రయత్నాలలో,  జాతీయ డోపింగ్ టెస్ట్ లాబ్ NDTL,  నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఫార్మాస్యూటికల్ ఎడ్యుకేషన్ అండ్ రీసెర్చ్ (NIPER) గౌహతి,  CSIR-IIIM జమ్మూ విభాగాలు  యాంటీ-డోపింగ్ సైన్స్ పరిశోధన కోసం సహకరిస్తున్నాయి. NDTL తన పరిశోధన కార్యక్రమాలను డోపింగ్ నిరోధక ప్రయత్నాలను బలోపేతం చేయడానికి ఇతర WADA గుర్తింపు పొందిన ప్రయోగశాలలతో కలిసి పనిచేస్తుంది.
దేశంలో మరిన్ని డోప్ టెస్టింగ్ ల్యాబొరేటరీలను స్థాపించి, గుర్తింపు పొందేందుకు   ప్రభుత్వం ఆసక్తిగా ఉంది. ఇటువంటి ప్రయోగశాలలు ఎక్కువ సంఖ్యలో నమూనాలను పరీక్షించే సామర్థ్యాన్ని సులభతరం చేస్తాయి. దేశంలో అధిక జనాభాతో పాటు  పెరుగుతున్న క్రీడాకారుల సంఖ్యను పరిగణనలోకి తీసుకోవాల్సి ఉంటుంది. ఇవి దేశంలో మెగా స్పోర్ట్స్ ఈవెంట్‌లను నిర్వహించేందుకు భారత్‌ను బలోపేతం చేస్తాయి.
జాతీయ డోపింగ్ నిరోధక బిల్లు 2021, 17 డిసెంబర్ 2021న పార్లమెంట్‌లో ప్రవేశపెట్టారు, ఇది మనదేశం క్రీడా శక్తిగా మారడానికి భారతదేశ ఆకాంక్షల సాకారానికి వేసిన  మరో అడుగు.

 

*******



(Release ID: 1784807) Visitor Counter : 189