గిరిజన వ్యవహారాల మంత్రిత్వ శాఖ
azadi ka amrit mahotsav

శ్రీ అర్జున్ ముండా రేపు వాన్ ధన్ కార్యక్రమం మరియు 14 హనీ ఫార్మర్ ప్రొడ్యూసర్ ఆర్గనైజేషన్ (ఎఫ్‌పిఓలు) పై పిక్టోరియల్ క్రానికల్‌ను ప్రారంభించనున్నారు.
చిన్న అటవీ ఉత్పత్తులకు కనీస మద్దతు ధర కోసం ఎంఐఎస్‌ పోర్టల్ కూడా ప్రారంభించబడుతుంది.

గిరిజన కుగ్రామాలకు చేరుకోవడానికి "సంవాద్" అనే కమ్యూనికేషన్ ప్రచారంలో ట్రైఫెడ్&యునిసెఫ్ సంయుక్తంగా పని చేయబోతున్నాయి

Posted On: 22 DEC 2021 4:15PM by PIB Hyderabad

 

కేంద్ర గిరిజన వ్యవహారాల మంత్రి శ్రీ అర్జున్ ముండా డిసెంబర్ 23న న్యూ ఢిల్లీలో 'ట్రైఫెడ్ వాన్ ధన్- ఎ క్రానికల్ ఆఫ్ ట్రైబల్ గ్రిట్ & ఎంటర్‌ప్రైజ్‌'ను ప్రారంభించనున్నారు. శ్రీ అర్జున్ ముండా 14 హనీ ఫార్మర్ ప్రొడ్యూసర్ ఆర్గనైజేషన్స్ (ఎఫ్‌పిఓలు) ఏర్పాటును మరియు చిన్న అటవీ ఉత్పత్తులకు కనీస మద్దతు ధర కోసం ఎంఐఎస్‌ పోర్టల్‌ను కూడా ప్రారంభించనున్నారు. ఈ సందర్భంగా శ్రీ అర్జున్ ముండా 'సంవాద్‌' అనే కమ్యూనికేషన్ ప్రచారాన్ని కూడా ప్రారంభిస్తారు.వాటితో పాటు ట్రైబ్స్‌ ఇండియా మరియు వాన్ ధన్ ఉత్పత్తులను ప్రచారం చేయడం కోసం రూపొందించిన 9 ప్రచార వీడియోలను కూడా ఆవిష్కరిస్తారు.

ట్రైఫెడ్‌ దేశంలోని గిరిజన సంస్థల ప్రమోషన్ కోసం చేసిన కృషిని అలాగే వన్ ధన్ వికాస్ యోజన కింద గిరిజన పారిశ్రామికవేత్తల విజయాలను క్రానికల్ రూపంలో డాక్యుమెంట్ చేసింది. ఈ పిక్టోరియల్ క్రానికల్ పథకం అంతర్లీన ఆలోచన, ఏం జరిగింది, ఏం చేస్తున్నారు మరియు భవిష్యత్తులో స్కీమ్‌ను నిర్వహించే వ్యక్తులకు సహాయం చేయగలిగిన దాని గురించిన వివరాలను సంగ్రహిస్తుంది.

ట్రైఫెడ్‌ గత 3 సంవత్సరాల నుండి యునిసెఫ్‌తో అనుబంధం కలిగి ఉంది. కరోనా మరియు కోవిడ్-19కి సంబంధించి దేశవ్యాప్తంగా ఉన్న గిరిజన ప్రాంతాల్లో అవగాహన కల్పన కోసం సందేశాలను ట్రైఫెడ్‌ వ్యాప్తి చేస్తోంది. టీకాకరణ్ అభియాన్ కింద ఈ కార్యక్రమం ద్వారా 12 కోట్లకు పైగా టీకాలు వేయడం జరిగింది. ఇప్పుడు ట్రైఫెడ్‌ & యుసిసెఫ్‌లు  రేడియో మరియు ఇతర ఎలక్ట్రానిక్ మీడియా ద్వారా గిరిజన కుగ్రామాలకు చేరుకోవడానికి "సంవాద్‌" అనే కమ్యూనికేషన్ ప్రచారంలో సంయుక్తంగా పని చేయబోతున్నాయి. వాన్ ధన్ ప్రోగ్రామ్‌తో సహా కొన్ని గుర్తించగలిగే ఫలితాలకు దారితీసే సామాజికంగా ఉపయోగకరమైన పనులన్నింటికీ కమ్యూనికేషన్, పర్యవేక్షణ మరియు ఫీడ్‌బ్యాక్ మెకానిజం కలిగి ఉండటం దీని ఉద్దేశ్యం.

దేశంలో ట్రైబ్స్‌ ఇండియా మరియు వాన్ ధన్ ఉత్పత్తులను ప్రచారం చేయడం కోసం ట్రైఫెడ్‌ కోసం నేషనల్ ఫిల్మ్ డెవలప్‌మెంట్ కార్పొరేషన్ ద్వారా తొమ్మిది ప్రచార వీడియోలు సిద్ధం చేయబడ్డాయి. ఇవి కూడా రేపు ప్రారంభించబడతాయి.

ట్రైఫెడ్‌ అనేది ఛత్తీస్‌గఢ్, హిమాచల్ ప్రదేశ్, ఉత్తరాఖండ్, తమిళనాడు, కర్ణాటక, ఆంధ్రప్రదేశ్, ఒడిశా మరియు గుజరాత్ రాష్ట్రాల్లో 14 హనీ ఫార్మర్ ప్రొడ్యూసర్ ఆర్గనైజేషన్స్ (ఎఫ్‌పిఓలు) ఏర్పాటు  చేపట్టేందుకు వ్యవసాయ మంత్రిత్వ శాఖ యొక్క ఏజెన్సీ. ఈ 14 హనీ ఫార్మర్ ప్రొడ్యూసర్ ఆర్గనైజేషన్ (ఎఫ్‌పిఓలు) కోసం క్లస్టర్ బేస్డ్ బిజినెస్ ఆర్గనైజేషన్ (సిబిబిఓలు) ఖరారు చేయబడ్డాయి. ఇవి కమ్యూనిటీ సమీకరణ, బేస్‌లైన్ సర్వే, క్లస్టర్ ఫైనలైజేషన్, వాల్యూ చైన్ స్టడీ, గ్రూప్‌ల ఏర్పాటు మరియు 14 హనీ ఎఫ్‌పిఓల నమోదులో కీలకంగా ఉంటాయి. ఇది 7 రాష్ట్రాల్లోని 5,000 మంది గిరిజనులకు లాభదాయకమైన ఉపాధిని అందిస్తుంది. అలాగే ఇతరులు అనుసరించడానికి ఒక ఉదాహరణగా నిలుస్తుంది.


 

****(Release ID: 1784400) Visitor Counter : 85