ఆర్ధిక వ్యవహారాల మంత్రివర్గ సంఘం

కొబ్బరికి 2022 సీజన్ కు గాను కనీస మద్దతు ధర (ఎమ్ఎస్ పి) కై ఆమోదం తెలిపిన మంత్రి మండలి


ఎమ్ఎస్పి అనేది కనీసం 50 శాతం లాభావకాశాని కి హామీ ని ఇస్తుంది

Posted On: 22 DEC 2021 5:19PM by PIB Hyderabad

కొబ్బరి పంట కు 2022 సీజను క గాను కనీస మద్దతు ధర (ఎమ్ఎస్ పి) ల విషయం లో ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ అధ్యక్షత న జరిగిన ఆర్థిక వ్యవహారాల మంత్రివర్గ సంఘం సమావేశం తన ఆమోదాన్ని తెలియజేసింది.

ఫెయిర్ ఏవరేజ్ క్వాలిటీ (ఎఫ్ఎక్యు) రకం మిలింగ్ కోప్రా కు 2021 లో ప్రతి క్వింటాలు కు 10,335 రూపాయలు గా ఉన్న ఎమ్ఎస్ పి ని పెంచి, 2022 సీజను లో ఒక్కొక్క క్వింటాలు కు 10,590 రూపాయలు గా చేయడం జరిగింది. బాల్ కోప్రా (గుండు కొబ్బరి) కి ఎమ్ఎస్ పి ని 2021 లో ప్రతి ఒక్క క్వింటాలు కు 10,600 రూపాయలు గా ఉన్నది కాస్తా పెంచివేసి, 2022 సీజను కు గాను ప్రతి ఒక్క క్వింటాలు కు 11,000 రూపాయలు గా చేయడమైంది. ఇది ఉత్పాదన యొక్క ఆల్ ఇండియా వెయిటెడ్ యావరేజ్ కాస్ట్ ఆఫ్ ప్రొడక్షన్ కంటే మిలింగ్ రకం కొబ్బరి విషయం లో అయితే 51.85 శాతం మరియు గుండు కొబ్బరి విషయం లో అయితే 57.73 శాతం లాభాని కి పూచీ పడుతుంది. 2022 సీజను కు కొబ్బరి కి ఎమ్ఎస్ పి లో వృద్ధి అనేది ప్రభుత్వం 2018-19 బడ్జెటు లో ప్రకటించిన మేరకు ఆల్ ఇండియా వెయిటెడ్ యావరేజ్ కాస్ట్ ఆఫ్ ప్రొడక్షన్ కు కనీసం ఒకటిన్నర రెట్ల స్థాయి లో ఎమ్ఎస్ పి ని ఖరారు చేసే సూత్రాని కి అనుగుణం గా ఉంది.

వ్యవసాయ వ్యయాలు మరియు ధరల సంఘం (సిఎసిపి) సిఫారసుల పై ఆధారపడి ఈ నిర్ణయం ఉంది.

ఇది 2022 వ సంవత్సరానికల్లా రైతుల ఆదాయాల ను రెండింతలు చేసే దిశ లో ఒక మహత్వపూర్ణమైనటువంటి మరియు ప్రగతిశీలమైనటువంటి చర్యల లో ఒక చర్య గా ఉంది. కనీసం 50 శాతం లాభావకాశాని కి ఈ నిర్ణయం ఒక భరోసా ను ఇస్తుంది.

కొబ్బరి ని సాగు చేస్తున్న రాష్ట్రాల లో ఎమ్ఎస్ పి పరం గా ధరల మద్దతు ను అందించే కార్యకలాపాల ను నిర్వహించడం కోసం కేంద్రీయ నోడల్ ఏజెన్సీలు గా నేశనల్ ఎగ్రికల్చరల్ కోఆపరేటివ్ మార్కెటింగ్ ఫెడరేశన్ ఆఫ్ ఇండియా లిమిటెడ్ మరియు నేశనల్ కోఆపరేటివ్ కన్ స్యూ మర్ ఫెడరేశన్ ఆఫ్ ఇండియా లిమిటెడ్ లు వాటి భూమిక ను నిర్వహించడాన్ని కొనసాగిస్తాయి.

***

 



(Release ID: 1784307) Visitor Counter : 170