నూతన మరియు పునరుత్పాదక శక్తి మంత్రిత్వ శాఖ
పునరుత్పాదక ఇంధన ప్రోత్సాహానికి ప్రభుత్వ చర్యలు
Posted On:
21 DEC 2021 1:28PM by PIB Hyderabad
జల విద్యుత్ తో సహా పునరుత్పాదక విద్యుత్ ఉత్పత్తి సంస్థాపిత సామర్థ్యం 2014 మార్చిలో 76.37 గిగా వాట్లు ఉండగా 2021 నవంబర్ నాటికి 150.54 గిగావాట్లకు చేరింది. అంటే 97% పెరుగుదల నమోదు చేసుకుంది.
దేశంలో పునరుత్పాదక విద్యుత్ ను ప్రోత్సహించటానికి ప్రభుత్వం అనేక చర్యలు తీసుకుంది. వాటిలో ఇవి కొన్ని :
• ఆటోమేటిక్ రూట్ గుండా విదేశీప్రత్యక్ష పెట్టుబడుల రాకను 100 శాతం వరకు అనుమతించటం
• 2025 జూన్ వరకు ప్రారంభమయ్యే సౌర విద్యుత్, పవన విద్యుత్ ప్రాజెక్టుల అంతర్రాష్ట్ర అమ్మకాలకు వసూలు చేసే అంతర్రాష్ట్ర సరఫరా వ్యవస్థ (ఐ ఎస్ టి ఎస్) చార్జీలను రద్దు చేయటం
• కొత్త సరఫరా లైన్లు వేయటం, పునరుత్పాదక విద్యుత్ కోసం కొత్త సబ్ స్టేషన్ సామర్థ్యాన్ని పెంచటం
• 2022 వరకు రెన్యూవబుల్ పర్చేజ్ ఆబ్లిగేషన్ కోసం మైలురాళ్ళతో ప్రణాళిక ప్రకటన
• పునరుత్పాదక విద్యుత్ తయారీదారులకు సకల సౌకర్యాలతో పునరుత్పాదక విద్యుత్ పార్కుల ఏర్పాటు
• ప్రధానమంత్రి కిసాన్ ఊర్జా సురక్ష ఉత్థాన్ మహాభియాన్, ఇళ్ళమీద సౌర విద్యుత్ రెండో దశ, 12000 మెగావాట్ల సీపీఎస్ యు రెండో పథకం తదితర పథకాలు
• సోలార్ ఫోటోవోల్టాయిక్ సిస్టమ్/పరికరాలు ఏర్పాటు చేయటం కోసం ప్రమాణాలు ప్రకటించటం
• పెట్టుబడులను ఆకర్షించి తగిన సౌకర్యాలు కల్పించటానికి ప్రాజెక్ట్ డెవలప్ మెంట్ సెల్ ఏర్పాటు
• గ్రిడ్ తో అనుసంధానమైన పవన, సౌర విద్యుత్ ప్రాజెక్టులనుంచి విద్యుత్ కొనుగోలుకు టారిఫ్ ఆధారిత వేలం కోసం ప్రామాణిక వేలం మార్గదర్శకాలు రూపొందించటం
• పంపిణీ లైసెన్స్ పొందినవారి నుంచి పునరుత్పాదక ఇంధన తయారీదారులకు సకాలంలో లెటర్ ఆఫ్ క్రెడిట్ మీద లేదా అడ్వాన్స్ చెల్లింపుల పద్ధతిలో విద్యుత్ ఇచ్చేలా ప్రభుత్వం ఆదేశాలు జారీ చేసింది.
• విద్యుత్ పరస్పర మార్పిడి ద్వారా కొనుగోలు చేసే వెసులుబాటు కల్పిస్తూ గ్రీన్ టర్మ్ ఎహెడ్ మార్కెట్ (జీటీఎఎం) ప్రారంభమైంది.
కేంద్ర విద్యుత్, పునరుత్పాదక విద్యుత్ శాఖామంత్రి శ్రీ ఆర్. కె. సింగ్ eఎరోజు లోక్ సభలో ఒక ప్రశ్నకు లిఖిత పూర్వకంగా ఇచ్చిన సమాధానం ఇది.
***
(Release ID: 1783835)
Visitor Counter : 182