పర్యావరణం, అడవులు, మరియు వాతావరణ మార్పు మంత్రిత్వ శాఖ
ప్లాస్టిక్ ఉత్పత్తి పరిశ్రమల మూసివేత
Posted On:
20 DEC 2021 3:03PM by PIB Hyderabad
తక్కువ వినియోగం, చెత్త ఎక్కువగా పోగుచేసే అవకాశం ఎక్కువ ఉన్న ఒకసారి మాత్రమే ఉపయోగించే ప్లాస్టిక్ వస్తువులను 2022 నాటికి గుర్తించి నిషేధిస్తూ 12 ఆగస్టు 2021న ప్లాస్టిక్ వ్యర్ధాల నిర్వహణ సవరణ నియమాలను మంత్రిత్వ శాఖ జారీ చేసింది.
ప్లాస్టిక్ క్యారీ బ్యాకుల విషయానికి సంబంధించి, ప్లాస్టిక్ వ్యర్ధ నిర్వహణ సవరణ నియమాలు, 2021, వాటి ఉత్పత్తి, దిగుమతి, నిల్వలు, పంపిణీ, అమ్మకాలను, డెబ్భై ఐదు మైక్రాన్ల మందంకన్నా తక్కువ ఉన్న ప్లాస్టిక్ క్యారీ బ్యాగుల వినియోగాన్ని 30 సెప్టెంబర్, 2021 నుంచి నిషేధించింది, ఇక నూట ఇరవై ఐదు మైక్రాన్లకన్నా తక్కువ మందం ఉన్న వాటిని 31 డిసెంబర్, 2022 వరకూ మాత్రమే వినియోగించవచ్చని పేర్కొంది. అంతేకాకుండా, ప్లాస్టిక్ వ్యర్ధాల నిర్వహణ నియమాలు, 2016ను సవరణకు అనుగుణంగా, ప్లాస్టిక్ క్యారీ బ్యాగులను లేదా గుర్తించిన ఒకసారి మాత్రమే వినియోగించదగిన ప్లాస్టిక్ వస్తువులను పూర్తిగా లేదా పాక్షికంగా నిషేధించేందుకు నిబంధనలను ప్రవేశపెట్టేందుకు 34 రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాలు ఉత్తర్వులను, ప్రకటనలను జారీ చేశాయి.
కేంద్ర కాలుష్య నియంత్రణ బోర్డు తన నివేదిక, లక్నో చెత్తకుప్పలు వేసే ప్రాంతంలో మట్టి, జల నాణ్యతపై ప్లాస్టిక్ వ్యర్ధాల విసర్జన ప్రభావం లో, వివిధ వర్గాల ప్లాస్టిక్ ఉత్పత్తులలో ఉండే బ్లీచింగ్ సంకలితాలు, రంగులు, స్టెబిలైజర్లు (స్థిరీకరణలు), పూరకపదార్ధాల కారణంగా ప్లాస్టిక్ వ్యర్ధాలను కుప్పగా విసర్జించడం అన్నది మట్టి నాణ్యతను క్షీణింపచేయడమే కాక, భూగర్భ జల నాణ్యతను కూడా ప్రభావితం చేస్తుందని పేర్కొంది.
ఈ సమాచారాన్ని లోక్‌సభలో నేడు అడిగిన ఒక ప్రశ్నకు పర్యావరణ, అడవులు, పర్యావరణ మార్పుశాఖ మంత్రి అశ్విని కుమార్ చౌబే సమాధానమిస్తూ వెల్లడించారు.
***
(Release ID: 1783519)
Visitor Counter : 218