రక్ష‌ణ మంత్రిత్వ శాఖ‌
azadi ka amrit mahotsav

ఎంవీ కవరట్టిని సురక్షితంగా కొచ్చికి తీసుకువచ్చిన ఐఎన్ఎస్‌ శార్దూల్

Posted On: 19 DEC 2021 11:01AM by PIB Hyderabad

30 నవంబర్ 21వ తేదీన ఎంవీ కవరట్టినిలోని (లక్షద్వీప్ డెవలప్‌మెంట్ కార్పొరేషన్ లిమిటెడ్ రన్ షిప్) స్టార్‌బోర్డ్ ఇంజిన్ రూమ్‌లో మంటలు చెలరేగాయి, ఆ తర్వాత సిబ్బంది దానిని ఆర్పివేశారు. ఈ అగ్ని ప్రమాదం కారణంగా ఈ ఓడలోని ఇంజిన్‌లు స్టార్ట్ కాలేదు. దీంతో 30 నవంబర్ 21న ఈ ఓడ ఆండ్రోత్ ద్వీపంలో లంగరు వేసింది. ఓక మరమ్మతుల చేసేందుకు వీలుగా టోయింగ్ సహాయం కోసం ఈ ఓడ అక్క‌డే వేచి ఉంది. మరమ్మత్తుల కోసం ఓడను ఆండ్రోత్ నుండి కొచ్చికి తీసుకురావాల‌ని లక్షద్వీప్ పరిపాలన విభాగం భారత నావికాదళాన్ని కోరింది. ఈ అభ్యర్థన ఆధారంగా భారత నౌకాదళం త్వరితగతిన ఐఎన్ఎస్‌ శార్దూల్‌ను డిసెంబరు 16న స‌ముద్రంలో నిలిచిపోయిన నౌకకు సహాయం అందించడం కోసం ఆండ్రోత్‌కు పంపింది. ఐఎన్ఎస్ శార్దూల్  17 డిసెంబర్ 21 ఉద‌యం ఆ ప్రాంతానికి చేరుకుంది. ఆఫీసర్-ఇన్-చార్జ్ నేవల్ డిటాచ్‌మెంట్ ఆండ్రోత్ లెటనెంట్ కమాండర్ బిష్ణు సి పాండాతో ఐఎన్ఎస్‌ శార్దూల్‌లోని అధికారులు మరియు నావికుల నిపుణుల బృందం  డిసెంబర్ 17న ఎంవీ కవరట్టికి 17 డిసెంబర్ 21న బయలుదేరి వెళ్లారు. ఈ బృందం క‌లిగిన నష్టాన్ని సమగ్రంగా అంచనా వేసింది. ఈ  సమయంలోనే నౌకాశ్రయం యొక్క పోర్ట్ ఇంజిన్‌ను ప్రారంభించడంలో ఎంవీ కవరట్టి సిబ్బందికి నౌకాదళ సిబ్బంది సహాయం చేశారు. ఐఎన్ఎస్ శార్దూల్ ద్వారా టోయింగ్ గేర్లు ఎంవీ కవరట్టికి పంపబడ్డాయి.  ఎంవీ కవరట్టితో టోయింగ్ ట్రయల్స్ కూడా నిర్వహించబడ్డాయి. ట్రయల్స్ పోర్ట్ ప్రధాన ఇంజిన్ విఫలమైతే టోయింగ్ ఆపరేషన్ల పట్ల ఎంవీ కవరట్టి  సిబ్బందికి చాలా అవసరమైన విశ్వాసం మరియు భరోసాను అందించ‌బ‌డ్డాయి. వివిధ అత్యవసర పరిస్థితులను రిహార్సల్ చేసిన తర్వాత ఐఎన్ఎస్‌ శార్దూల్, ఎంవీ కవరట్టిని 18 డిసెంబర్ 21వ తేదీ సాయంత్రం కొచ్చికి సురక్షితంగా తీసుకువ‌చ్చింది. ఈ రవాణా సమయంలో ఐఎన్ఎస్‌ శార్దూల్ మరియు నేవల్ డిటాచ్‌మెంట్ ఆండ్రోత్ నుండి సిబ్బంది ఏదైనా యంత్రాలు పాడైపోయినప్పుడు ఎంవీకి సహాయం అందించడానికి బయలుదేరారు. ఈ విధంగా భార‌త నౌకాద‌ళం ఎంవీ కవరట్టిని సుర‌క్షితంగా కొచ్చికి  తీసుకువచ్చే విష‌యమై విజ‌యం సాదించింది. 

 

***


(Release ID: 1783406) Visitor Counter : 173