ప్రధాన మంత్రి కార్యాలయం

ప్రయాగ్ రాజ్ ను డిసెంబర్ 21 వ తేదీ న సందర్శించనున్న ప్రధాన మంత్రి; ఒక ప్రత్యేక కార్యక్రమం లో ఆయనపాలుపంచుకోనున్నారు;  ఈ కార్యక్రమాని కి 2 లక్షల మంది కి పైగా మహిళలు హాజరుకానున్నారు


మహిళల సాధికారిత కు సంబంధించిన, ప్రత్యేకించి క్షేత్ర స్థాయి లో మహిళలసశక్తీకరణ కు సంబంధించిన ప్రధాన మంత్రి దార్శనికత కు అనుగుణం గా ఈ కార్యక్రమాన్నినిర్వహించడం జరుగుతోంది

ఎస్ హెచ్ జి లకు 1000 కోట్ల రూపాయల ను బదిలీ చేయనున్న ప్రధాన మంత్రి; దీని ద్వారా సుమారు 16 లక్షల మంది మహిళా సభ్యుల కు లబ్ధికలుగుతుంది

బిజినెస్ కరస్పాండెంట్-సఖి లకు ఒకటో నెల స్టైపెండ్ ను ప్రధాన మంత్రి బదిలీచేస్తారు;  అలాగే ‘ముఖ్యమంత్రి కన్య సుమంగళ స్కీము’ కు చెందిన ఒక లక్ష కు పైగా లబ్ధిదారులకు కూడా డబ్బు ను బదిలీ చేయనున్నారు

200 కు పైగా అదనపు పోషణ సంబంధి తయారీ విభాగాల కు ప్రధానమంత్రి శంకుస్థాపన చేయనున్నారు

Posted On: 20 DEC 2021 9:04AM by PIB Hyderabad

ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ 2021 వ సంవత్సరం డిసెంబర్ 21 వ తేదీ న ప్రయాగ్ రాజ్ ను సందర్శించనున్నారు. మధ్యాహ్నం పూట ఒంటి గంట వేళ కు జరిగే ఒక ప్రత్యేకమైన కార్యక్రమం లో 2 లక్షల కు పైగా మహిళలు హాజరు కానుండగా, ప్రధాన మంత్రి ఆ కార్యక్రమం లో పాలుపంచుకోనున్నారు.

ఈ కార్యక్రమాన్ని మహిళల కు, ప్రత్యేకించి క్షేత్ర స్థాయి లో మహిళల కు, అవసరమైన నైపుణ్యాల ను, ప్రోత్సాహకాల ను మరియు వనరుల ను సమకూర్చడం ద్వారా వారి సశక్తీకరణ కు తోడ్పడాలన్న ప్రధాన మంత్రి దృష్టి కోణాని కి అనుగుణం గా ఈ కార్యక్రమాన్ని నిర్వహించడం జరుగుతున్నది. మహిళల కు మద్దతివ్వాలన్న ఈ ప్రయాస లో భాగం గా ప్రధాన మంత్రి 1000 కోట్ల రూపాయల సొమ్ము ను స్వయం సహాయ సమూహాల (ఎస్ హెచ్ జి స్) బ్యాంకు ఖాతాల లోకి బదిలీ చేయనున్నారు. దీని ద్వారా దాదాపు గా 16 లక్షల మంది ఎస్ హెచ్ జి స్ కు చెందిన మహిళా సభ్యులు ప్రయోజనాన్ని అందుకోనున్నారు. దీన్ దయాళ్ అంత్యోదయ యోజన్- నేశనల్ రూరల్ లైవ్లీ హుడ్ మిశ‌న్‌ (డిఎవై-ఎన్ఆర్ఎల్ఎమ్) లో భాగం గా ఈ బదిలీ జరుగుతుంది. 80,000 ఎస్ హెచ్ జి లు ఒక్కొక్క ఎస్ హెచ్ జి 1.10 లక్షల రూపాయల విలువైన కమ్యూనిటీ ఇన్వెస్ట్ మెంట్ ఫండ్ (సిఐఎఫ్) ను, అదే విధం గా 60,000 ఎస్ హెచ్ జి లు ఒక్కొక్క ఎస్ హెచ్ జి 15,000 రూపాయల విలువైన రివాల్వింగ్ ఫండ్ ను అందుకొంటాయి.

ఇదే కార్యక్రమం లో బిజినెస్ కరస్పాండెంట్-సఖీస్ ను (బి.సి.-సఖీస్) ను ప్రోత్సహించడం కోసం ప్రధాన మంత్రి 20,000 బి.సి.-సఖీస్ కు ఒకటో నెల స్టైపెండ్ రూపం లో 4000 రూపాయల ను బదిలీ చేయనున్నారు. క్షేత్ర స్థాయి లో ఇంటి ముంగిటకే ఆర్థిక సేవల ను అందించే బి.సి.-సఖులు వారి విధుల ను ఆరంభించడం తోనే వారికి 4000 రూపాయల స్టైపెండ్ ను ఆరు నెలల పాటు చెల్లించడం జరుగుతుంది. ఇలా చేయడం వల్ల, వారు వారి విధుల ను స్థిరపరచుకొని, ఆ తరువాత లావాదేవీల తాలూకు కమిశన్ ను సంపాదించుకోవడం మొదలు పెడతారు.

ప్రధాన మంత్రి ఈ కార్యక్రమం లో భాగం గా ముఖ్యమంత్రి కన్య సుమంగళ స్కీముతాలూకు ఒక లక్ష మంది కి పైగా లబ్ధిదారుల కు 20 కోట్ల రూపాయల పై చిలుకు ధన రాశి ని సైతం ప్రధాన బదిలీ చేయనున్నారు. ఈ పథకం ద్వారా ఒక ఆడ శిశువు కు ఆమె జీవనం తాలూకు వేరు వేరు దశల లో షరతు తో కూడిన నగదు బదిలీ అమలు అవుతుంది. ప్రతి ఒక్క లబ్ధిదారు కు మొత్తం 15,000 రూపాయల డబ్బు ను బదిలీ చేయడం జరుగుతుంది. ఆ సొమ్ము ను ఆడ శిశువు పుట్టినప్పుడు (2000 రూపాయలు), ఆ శిశువు టీకామందు తీసుకొని ఒక సంవత్సర కాలం పూర్తి అయినప్పుడు (1000 రూపాయలు), ఒకటో తరగతి లో చేరినప్పుడు (2,000 రూపాయలు), ఆరో తరగతి లో చేరినప్పుడు (2000 రూపాయలు), తొమ్మిదో తరగతి లో చేరినప్పుడు (3000 రూపాయలు), పదో తరగతి లేదా పన్నెండో తరగతి పరీక్ష లో ఉత్తీర్ణత సాధించిన అనంతరం ఏదైనా డిగ్రీ లో గాని, లేదా డిప్లొమా కోర్సు లో గాని చేరినప్పుడు (5000 రూపాయలు వంతు న) ఇలాగ వివిధ దశల లో బదిలీ అవుతుంది.

ప్రధాన మంత్రి 202 సప్లిమెంటరీ న్యూట్రిశన్ మేన్యుఫాక్చరింగ్ యూనిట్స్ కు శంకుస్థాపన చేస్తారు. ఈ యూనిట్ లకు స్వయం సహాయ సమూహాలు నిధుల ను అందిస్తాయి. ఒక్కొక్క యూనిట్ ను సుమారు గా ఒక కోటి రూపాయల ఖర్చు తో నిర్మించడం జరుగుతుంది. ఈ యూనిట్ లు రాష్ట్రం లోని 600 బ్లాకుల లో ఇంటిగ్రేటెడ్ చైల్డ్ డెవలప్ మెంట్ స్కీము (ఐసిడిఎస్) లో భాగం గా అదనపు పోషణ ను సమకూర్చుతాయి.

 

 

 

***



(Release ID: 1783402) Visitor Counter : 147