వాణిజ్యం, పరిశ్రమల మంత్రిత్వ శాఖ

పీఎం గతిశక్తి అమలు ఊపందుకుంది: ఎంపవర్డ్ గ్రూప్ ఆఫ్ సెక్రటరీస్ (ఈజీఓఎస్) తన మొదటి సమావేశాన్ని నిర్వహించింది


బిసాగ్–ఎన్ జీఐఎస్ ఆధారిత జాతీయ మాస్టర్ ప్లాన్‌పై 300 లేయర్ల డేటా మ్యాపింగ్‌ను పూర్తి చేసింది

అన్ని కేంద్ర మంత్రిత్వ శాఖలు, చాలా రాష్ట్ర ప్రభుత్వాలు తమకు అవసరమైన లేయర్లను నవీకరించడం ప్రారంభిస్తాయి

ఏడు కేంద్ర మంత్రిత్వ శాఖల ప్రతినిధులతో కూడిన నెట్‌వర్క్ ప్లానింగ్ గ్రూప్ను (ఎన్పీజీ) ఇప్పటికే ఏర్పాటు చేయడం జరిగింది

ఎన్పీజీకి మద్దతివ్వడానికి హై పవర్డ్ ఎక్స్‌పర్ట్ గ్రూప్ ఆఫ్ ప్రొఫెషనల్స్ ఏర్పాటువుతున్నది.

Posted On: 18 DEC 2021 1:33PM by PIB Hyderabad

పీఎం గతిశక్తి అమలును పర్యవేక్షించేందుకు ప్రభుత్వం క్యాబినెట్ సెక్రటరీ నేతృత్వంలో 20 ఇన్‌ఫ్రాస్ట్రక్చర్,  ఎకనామిక్ వినియోగ మంత్రిత్వ శాఖల కార్యదర్శులతో ఎంపవర్డ్  గ్రూప్ ఆఫ్ సెక్రటరీలను (ఈజీఓఎస్) సభ్యులుగా నియమించింది. ఈజీఓఎస్ తొలి సమావేశం నిన్న కేబినెట్ సెక్రటరీ అధ్యక్షతన జరిగింది. ఈజీఓఎస్ మొదటి సమావేశానికి  నీతి ఆయోగ్ సీఈఓ ప్రత్యేక ఆహ్వానితుడుగా హాజరయ్యారు. ఈజీఓఎస్ ఇప్పటివరకు సాధించిన పురోగతిని సమీక్షించారు. దేశంలోని వివిధ ఆర్థిక మండలాలకు మల్టీమోడల్ కనెక్టివిటీని అందించడం కోసం ప్రధాన మంత్రి గతిశక్తి జాతీయ మాస్టర్ ప్లాన్‌ను ప్రధాన మంత్రి  నరేంద్ర మోదీ ప్రారంభించారు. పీఎం గతిశక్తి ..రవాణా ధరను తగ్గించడం లక్ష్యంగా పెట్టుకుంది. ప్రస్తుతం, భారతదేశంలో రవాణా ఖర్చు జీడీపీలో దాదాపు 13శాతం అయితే ఇతర అభివృద్ధి చెందిన దేశాలలో ఇది 8శాతం వరకు ఉంది. మన తయారీ రంగంలో  పోటీతత్వాన్ని పెంచడానికి, రైతులకు మంచి ధరలు వచ్చేలా చేయడానికి వినియోగదారులకు చౌక ధరలకు వస్తువులు అందేలా చూడటానికి రవాణా ధరను తగ్గించడానికి ప్రభుత్వం కట్టుబడి ఉంది.

 

నేషనల్ మాస్టర్ ప్లాన్‌ను అభివృద్ధి చేసిన భాస్కరాచార్య ఇన్‌స్టిట్యూట్ ఫర్ స్పేస్ అప్లికేషన్స్ అండ్ జియోఇన్ఫర్మేటిక్స్ (బిసాగ్-ఎన్), జీఐఎస్ ఆధారిత జాతీయ మాస్టర్ ప్లాన్‌లో 300 లేయర్ల డేటాను మ్యాప్ చేసినట్టు ఈజీఓఎస్కి తెలియజేసింది. అన్ని కేంద్ర మంత్రిత్వ శాఖలు,  చాలా రాష్ట్ర ప్రభుత్వాలు తమకు అవసరమైన లేయర్ల నవీకరణను ప్రారంభించాయని తెలియజేసింది.కేంద్ర..పరిశ్రమల ప్రోత్సాహం,  అంతర్గత వాణిజ్య విభాగం (డీపీఐఐటీ), పీఎం గతిశక్తి అమలుకు  నోడల్ ఏజెన్సీగా పనిచేస్తుంది. పీఎం గతిశక్తి పర్యవేక్షణ,  సమన్వయం కోసం చేసిన పరిపాలనా ఏర్పాట్ల గురించి ఇది తెలియజేసింది. ఏడు కేంద్ర మంత్రిత్వ శాఖల ప్రతినిధులతో కూడిన నెట్‌వర్క్ ప్లానింగ్ గ్రూప్ (ఎన్‌పిజి) ఇప్పటికే ఏర్పాటైంది. ఎన్పీజీకి మద్దతివ్వడానికి హై పవర్డ్ ఎక్స్‌పర్ట్ గ్రూప్ ఆఫ్ ప్రొఫెషనల్స్ ఏర్పాటు అవుతున్నది.

ఈ సమావేశంలో ఈజీఓఎస్ పలు కీలక నిర్ణయాలు తీసుకుంది. వివిధ ఆర్థిక మంత్రిత్వ శాఖలు భావించిన విధంగా మౌలిక సదుపాయాల అంతరాలను తొలగించాలని నిర్ణయించారు. తదుపరి ఆర్థిక సంవత్సరం వార్షిక కార్యాచరణ ప్రణాళికలో చేర్చడానికి తగిన పరిశీలన కోసం దీనిని సంబంధిత మౌలిక సదుపాయాల మంత్రిత్వ శాఖకు పంపుతారు. దేశంలోని అన్ని ఆర్థిక మండలాలకు (సెజ్లు) మల్టీమోడల్ కనెక్టివిటీని అందించడానికి ప్రాధాన్యత ఇవ్వడంపై అధ్యయనం చేయాలని నిర్ణయం తీసుకున్నారు. తద్వారా ఖాళీలను పూర్తించవచ్చు. లాజిస్టిక్స్ వ్యయాన్ని పెంచడానికి కారణమయ్యే  వ్యవస్థ లేదా ప్రక్రియను గుర్తించడం,  చర్చించడం,  ఖర్చును తగ్గించడానికి అవసరమైన పరిపాలనా నిర్ణయాలతో సహా చర్యలు తీసుకోవాలని నిర్ణయించారు.ఈజీఓఎస్ డిజిటలైజేషన్ అవసరం గురించి వివరించింది. వినియోగాన్ని సులభతరం చేయడానికి వివిధ నిర్వహణ సమాచార వ్యవస్థలన్నింటినీ ఏకీకృతం చేయడం అవసరమని అధికారులు భావించారు. ప్రధానమంత్రి గతిశక్తి లక్ష్యాన్ని సాధించేందుకు అన్ని మంత్రిత్వ శాఖలు తమ ప్లానింగ్, రవాణా ఖర్చుల తగ్గింపుపై దృష్టి పెట్టాలని ఈజీఓఎస్ స్పష్టం చేసింది.

 

***



(Release ID: 1783192) Visitor Counter : 163