రక్షణ మంత్రిత్వ శాఖ
నవతరం బాలిస్టిక్ క్షిపణి ‘అగ్ని పి’ని విజయవంతంగా పరీక్షించిన డీఆర్‌డీఓ
Posted On:
18 DEC 2021 12:33PM by PIB Hyderabad
'డిఫెన్స్ రీసెర్చ్ అండ్ డెవలప్‌మెంట్ ఆర్గనైజేషన్' (డీఆర్‌డీఓ) అణు సామర్థ్యంతో కూడిన కొత్తతరం బాలిస్టిక్ క్షిపణి ‘అగ్ని-పి’ని
విజయవంతంగా పరీక్షించింది. ఒడిశా తీరంలోని డాక్టర్ ఏపీజే అబ్దుల్ కలాం ద్వీపం నుండి గురువారం (డిసెంబర్ 18, 2021) 1106 గంటలకు దీనిని పరీక్షించారు. తూర్పు తీరం వెంబడి ఉన్న వివిధ టెలిమెట్రీ, రాడార్, ఎలక్ట్రో-ఆప్టికల్ స్టేషన్లు, డౌన్ రేంజ్ నౌకలు క్షిపణి పథం, పారామితులను ట్రాక్ చేసి పర్యవేక్షించాయి. క్షిపణి అధిక స్థాయి ఖచ్చితత్వంతో అన్ని మిషన్ లక్ష్యాలను చేరుకునే టెక్స్ట్ బుక్ పథాన్ని అనుసరించింది. ‘అగ్ని-పి’ అనేది ద్వంద్వ రిడెండెంట్ నావిగేషన్ మరియు గైడెన్స్ సిస్టమ్‌తో కూడిన రెండు-దశల డబ్బీ సాలిడ్ ప్రొపెల్లెంట్ బాలిస్టిక్ క్షిపణి. రెండో ఫ్లైట్-టెస్ట్ సిస్టమ్‌లో విలీనం చేయబడిన అన్ని అధునాతనమైన సాంకేతికతల యొక్క విశ్వసనీయ పని తీరును ఇది నిరూపించింది. కేంద్ర రక్షణ శాఖ మంత్రి శ్రీ రాజ్‌నాథ్ సింగ్ ఈ విజయం సాధించినందుకు డీఆర్‌డీఓను అభినందించారు. సిస్టమ్ యొక్క అద్భుతమైన పని తీరుపై తన సంతోషాన్ని వ్యక్తం చేశారు. అనేక అదనపు లక్షణాలతో రెండో డెవలప్‌మెంట్ ఫ్లైట్ ట్రయల్‌ను నిర్వహించినందుకు గాను రక్షణ శాఖ ఆర్ అండ్‌డీ విభాగం కార్యదర్శి, డీఆర్‌డీఓ చైర్మెన్ డాక్టర్ జి సతీష్ రెడ్డి.. డీఆర్‌డీఓ బృందం చేసిన ప్రయత్నాను అభినందించారు. దీనికి తోడు అదే క్యాలెండర్ సంవత్సరంలో వరుస విజయం సాధించినందుకు ఆయన బృందానికి అభినందనలు తెలిపారు.
***
(Release ID: 1783009)
Visitor Counter : 344