వ్యవసాయ మంత్రిత్వ శాఖ
పిఎంఎఫ్‌బివైఏ కింద ప్రీమియం సబ్సిడీలో కేంద్ర వాటా
Posted On:
17 DEC 2021 3:14PM by PIB Hyderabad
ఇటీవలే ప్రభుత్వం ఖరీఫ్ 2020 నుంచి ప్రధానమంత్రి ఫసల్ బీమా యోజన (పిఎంఎఫ్‌బివై) అమలులోకి వచ్చేలా పునర్వ్యవస్థీకరించింది. ఇందులో భాగంగా కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల మధ్య ఉన్న 50ః50 ఉన్న ప్రీమియం సబ్సిడీ భాగస్వామ్య విధానాన్ని 90ః10గా సవిరించింది. ఈ ప్రీమియం భాగస్వామ్యం ఇతర రాష్ట్రాలు, కేంద్ర పాలిత ప్రాంతాలకు పథకంలోని ఇతర అంశాలకు లోబడి 50ః50 ఉండనుంది.
అంతేకాకుండా, కేంద్రం, సంబంధిత రాష్ట్ర ప్రభుత్వం సొంత బడ్జెట్‌లో మెరుగైన నిర్వహణ, బట్వాడా కోసం మౌలిక పదుపాయాలు, సాంకేతికతను బలోపేతం చేసేందుకు మొత్తం బడ్జెట్‌లో 3% పరిపాలనా ఖర్చుల కోసం కేటాయింపు కోసం పునర్వ్యవస్థీకరించిన పథకంలోని కార్యాచరణ మార్గదర్శకాలలో ఒక నిబంధనను రూపొందించారు.
అదనంగా, రాష్ట్రాలు జాతీయ పంట బీమా పోర్టల్ (ఎన్‌సిఐపి) పై జియో కోడింగ్, టైమ్ స్టాంప్డ్ డేటా సహా పంట కోత ప్రయోగాల (సిసిఇ)ని నమోదు చేయడం కోసం సిసిఇ ఆగ్రి ఆప్ ఉపయోగించేందుకు స్మార్ట్ ఫోన్ కొనుగోలు కోసం, ఇంటర్నెట్ చార్జీలలో 50% కేంద్ర ప్రభుత్వం అందించనుంది. గ్రామం/ గ్రామ పంచాయితీ స్థాయిలో ప్రధాన పంటల విషయంలో ఈ పథకాన్ని అమలు చేస్తున్న రాష్ట్రాలకు పంట కోత వ్యయంలో ప్రయోగాల (సిసిఇల) ఆవృత వ్యయంలో 50% పొందే అర్హతను కలిగి ఉంటారు. సంబంధిత మెరుగైన సాంకేతిక ఉపయోగించడంపై అయిన వ్యయానికి సంబంధించి రాష్ట్ర ప్రభుత్వాల నుంచి ప్రతిపాదనను అందుకున్న తర్వాత 50% ఇచ్చేందుకు నిబంధనను రూపొందించారు.
పబ్లిక్ ప్రైవేట్ పార్ట్నర్‌షిప్ (పిపిపి) మోడ్‌లో యాంత్రిక వాతావరణ కేంద్రాలు, యాంత్రిక వాన ప్రమాణీకరణ నెట్‌వర్క్ ఏర్పాటు కోసం యత్నాలు చేస్తున్న రాష్ట్రాలకు వయబిలిటీ గ్యాప్ ఫండింగ్ (పిపి పి ప్రాజెక్టుల అమలు కోసం కేంద్ర లేక రాష్ట్ర ప్రభుత్వాలు ఇచ్చే మూలధన గ్రాంటు లేదా సబ్సిడీ)లో 50% కేంద్ర ప్రభుత్వం అందిస్తోంది.
ఈ సమాచారాన్ని నేడు రాజ్యసభలో అడిగిన ఒక ప్రశ్నకు లిఖిత పూర్వకంగా ఇచ్చిన సమాధానంలో కేంద్ర వ్యవసాయ, రైతాంగ సంక్షేమ మంత్రి నరేంద్ర సింగ్ తోమర్ ఇచ్చారు.
***
(Release ID: 1782991)