ప్రధాన మంత్రి కార్యాలయం
azadi ka amrit mahotsav

డిసెంబర్19 న గోవా ను సందర్శించనున్న ప్రధాన మంత్రి;  గోవా విమోచన దినం ఉత్సవాల లో పాల్గొంటారు


స్వాతంత్య్రయోధుల ను మరియు ‘ఆపరేషన్ విజయ్’ యొక్కయోధుల ను అభినందించనున్న ప్రధాన మంత్రి

గోవావిముక్తి తాలూకు స్వాతంత్య్ర యోధుల కు ఒక నివాళి లో భాగం గా పునరభివృద్ధి పరచిన అగువాడాఫోర్ట్ జైల్ మ్యూజియమ్ ను ప్రారంభించనున్న ప్రధాన మంత్రి

650 కోట్ల రూపాయల కు పైగా విలువైన అనేకఅభివృద్ధి పథకాల లో కొన్నిటి ని గోవా లో ప్రారంభించనున్న ప్రధాన మంత్రి; ఆ పథకాలలో మరికొన్నిటికి ఆయన శంకుస్థాపన చేస్తారు

దేశవ్యాప్తంగా అత్యాధునిక చికిత్స సంబంధి మౌలిక సదుపాయాల ను కల్పించాలన్న ప్రధాన మంత్రిదార్శనికత కు అనుగుణం గా గోవా మెడికల్ కాలేజీ లో సూపర్ స్పెశలిటి బ్లాకు తో పాటున్యూ సౌథ్ గోవా డిస్ట్రిక్ట్ హాస్పిటల్ ను ప్రారంభించడం జరుగుతుంది

Posted On: 17 DEC 2021 4:34PM by PIB Hyderabad

ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ డిసెంబర్ 19 న గోవా ను సందర్శించి, మధ్యాహ్నం పూట 3 గంటల వేళ కు గోవా లోని డాక్టర్ శ్యామ ప్రసాద్ ముఖర్జీ స్టేడియమ్ లో గోవా విమోచన దినోత్సవాల సంబంధిత కార్యక్రమాని కి హాజరు అవుతారు. ఆ కార్యక్రమం లో ప్రధాన మంత్రి స్వాతంత్య్ర యోధుల ను, ‘ఆపరేషన్ విజయ్లో పాల్గొన్న యోధుల ను సమ్మానించనున్నారు. పోర్చుగీసు పాలన నుంచి గోవా కు విముక్తి ని ఇచ్చేందుకు భారతదేశ సాయుధ దళాలు చేపట్టిన ఆపరేషన్ విజయ్సఫలత కు గుర్తు గా ప్రతి సంవత్సరం లో డిసెంబర్ 19వ తేదీ నాడు ఒక వేడుక గా గోవా విమోచన దినాన్ని నిర్వహించడం జరుగుతున్నది.

సరికొత్త మెరుగుల ను దిద్దిన అటువంటి ఫోర్ట్ అగువాడా జైల్ మ్యూజియమ్ గోవా మెడికల్ కాలేజీ లో నిర్మించిన సూపర్ స్పెశలిటి బ్లాక్, న్యూ సౌథ్ గోవా డిస్ట్రిక్ట్ హాస్పిటల్, మోపా విమానాశ్రయం లో నెలకొల్పిన ఏవియేశన్ స్కిల్ డెవలప్ మెంట్ సెంటర్, ఇంకా మడ్ గాఁవ్ లోని డావోర్ లిమ్-నావెలిమ్ లో ఏర్పాటు చేసినటువంటి గ్యాస్ ఇన్సులేటెడ్ సబ్ స్టేశన్ లతో సహా అనేక అభివృద్ధి పథకాల ను ప్రధాన మంత్రి ప్రారంభించనున్నారు. గోవా లో బార్ కౌన్సిల్ ఆఫ్ ఇండియా ట్రస్ట్ ఏర్పాటు చేసే ఇండియా ఇంటర్ నేశనల్ యూనివర్సిటి ఆఫ్ లీగల్ ఎడ్యుకేశన్ ఎండ్ రిసర్చ్ కు ఆయన శంకుస్థాపన చేస్తారు.

దేశం అంతటా చికిత్స సదుపాయాల ను సమకూర్చడం కోసం, చికిత్స సంబంధి మౌలిక సదుపాయాల ను మెరుగు పరచడం కోసం ప్రధాన మంత్రి నిరంతరం పాటుపడుతుండగా, ఈ దృష్టి కోణాని కి తగినట్లు గా గోవా లో గోవా మెడికల్ కాలేజీ ఎండ్ హాస్పిటల్ లో ఒక సూపర్ స్పెశలిటి బ్లాకు ను ప్రధాన మంత్రి స్వాస్థ్య సురక్ష యోజన లో భాగం గా 380 కోట్ల రూపాయల కు పైగా ఖర్చు తో నిర్మించడం జరిగింది. గోవా రాష్ట్రం అంతటి లో అత్యధునాతన సూపర్ స్పెశలిటి హాస్పిటల్ ఇది ఒక్కటే. ఈ ఆసుపత్రి ఏంజియో ప్లాస్టీ, బైపాస్ సర్జరీ, కాలేయం మార్పిడి, మూత్రపిండం మార్పిడి, డాయలిసిస్ తదితర విశిష్ట సేవల ను అందించనుంది. ఈ సూపర్ స్పెశలిటి బ్లాకు లో 1000 ఎల్ పిఎమ్ సామర్ధ్యం కలిగిన పిఎస్ఎ ప్లాంటు ను కూడా పిఎమ్-కేర్స్ లో భాగం గా స్థాపించడమైంది.

దాదాపు 220 కోట్ల రూపాయల వ్యయం తో నిర్మించిన న్యూ సౌథ్ గోవా డిస్ట్రిక్ట్ హాస్పిటల్ లో 33 స్పెశలిటి లలో ఒపిడి సేవల కు తోడు గా ఆధునిక రోగ నిర్ధారణ సదుపాయాలు, ఇంకా ప్రయోగశాల సదుపాయాలు, ఇంకా ఫిజియోథెరపి, ఆడియోమెట్రి ల వంటి సేవలు సహా నవీన చికిత్స సంబంధి మౌలిక సదుపాయాల హంగుల ను ఏర్పాటు చేయడమైంది. ఈ ఆసుపత్రి లో 500 ప్రాణవాయు సరఫరా సహిత పడక లు, 5500 లీటర్ సామర్ధ్యం కలిగిన ఎల్ఎమ్ఒ ట్యాంకు, ఇంకా 600 ఎల్ పిఎమ్ సామర్ధ్యం కలిగిన 2 పిఎస్ఎ ప్లాంటు లు ఉన్నాయి.

స్వదేశ్ దర్శన్ స్కీమ్ లో భాగం గా ఒక వారసత్వ పర్యటన సంబంధి గమ్య స్థానం గా అగువాడా ఫోర్ట్ జైల్ మ్యూజియమ్ ను 28 కోట్ల రూపాయల కు పైగా ఖర్చు తో తీర్చిదిద్దడం జరిగింది. గోవా విముక్తి కి పూర్వపు కాలం లో అగువాడా ఫోర్టు ను స్వాతంత్య్ర యోధుల ను ఖైదు చేయడం కోసం, వారి ని చిత్రహింస పెట్టడం కోసం ఉపయోగించారు. గోవా విమోచనం కోసం పోరాటం సలిపిన ప్రముఖ స్వాతంత్య్ర యోధులు అందించిన తోడ్పాటుల ను, వారు చేసిన త్యాగాల ను ప్రముఖం గా కళ్ళకు కట్టడం తో పాటు వారికి ఈ మ్యూజియమ్ ఒక సముచితమైన నివాళి కాగలదు.

త్వరలో నిర్మాణం పూర్తి కానున్న మోపా విమానాశ్రయం లో ఏవియేశన్ స్కిల్ డెవలప్ మెంట్ సెంటరు ను సుమారు 8.5 కోట్ల రూపాయల వ్యయం తో నిర్మించడం జరిగింది. 16 వేరు వేరు ఉద్యోగ విధుల కు సంబంధించిన శిక్షణ ను ఈ సెంటర్ లో ఇప్పించడం జరుగుతుంది. మోపా విమానాశ్రయం ప్రాజెక్టు పని చేయడం ప్రారంభం అయిన తరువాత శిక్షణార్థులు ఆ విమానాశ్రయం లోను, అలాగే భారతదేశం లోని, ఇంకా విదేశాల లోని ఇతర విమానాశ్రయాల లో సైతం ఉద్యోగ అవకాశాల ను చేజిక్కించుకోగలుతారు.

మడ్ గాఁవ్ లోని దావోర్ లిమ్-నావెలిమ్ లో గ్యాస్ ఇన్సులేటెడ్ సబ్ స్టేశన్ నిర్మాణాని కి దాదాపు గా 16 కోట్ల రూపాయల ను వెచ్చించడం జరిగింది. భారత ప్రభుత్వ విద్యుత్తు మంత్రిత్వ శాఖ ఆధ్వర్యం లోని ఇంటిగ్రేటెడ్ పవర్ డెవెలప్ మెంట్ స్కీమ్ లో భాగం గా ఈ సబ్ స్టేశన్ నిర్మాణం జరిగింది. ఇది డావోర్ లిమ్, నెసాయి, నావెలిమ్, క్వెమ్-బాయిక్సో, ఇంకా తేలౌలిమ్ గ్రామాల కు విద్యుత్తు సరఫరా ను సమకూర్చనుంది.

గోవా ను ఉన్నత విద్య కేంద్రంగాను, సాంకేతిక విద్య కేంద్రం గాను పరివర్తన చెందించాలన్న ప్రభుత్వ శ్రద్ధ కు అనుగుణం గా బార్ కౌన్సిల్ ఆఫ్ ఇండియా ట్రస్టు కు చెందిన ఇండియా ఇంటర్ నేశనల్ యూనివర్సిటి ఆఫ్ లీగల్ ఎడ్యుకేశన్ ఎండ్ రిసర్చ్ ను ఏర్పాటు చేయడం జరుగుతోంది.

పోర్చుగీసు పాలన నుంచి గోవా ను విముక్తం చేయడం లో భారతదేశ సాయుధ దళాలు పోషించిన పాత్ర ను స్మరించుకోవడాని కి గుర్తు గా రూపొందించిన ఒక స్పెశల్ కవర్, ఇంకా స్పెశల్ కాన్సిలేశన్ ను కూడా ప్రధాన మంత్రి ఆవిష్కరించనున్నారు. ఈ చారిత్రిక విశిష్ట ఘట్టాన్ని స్పెశల్ కవర్ పైన ముద్రించడం జరిగింది. మరో పక్క, స్పెశల్ కాన్సిలేశన్ అనేది భారతదేశ నౌకా దళాని కి చెందిన గోమాంతక్ అనే ఓడ లో యుద్ధ స్మారకాన్ని ప్రదర్శిస్తుంది. దీనిని ‘‘ఆపరేశన్ విజయ్’’ లో ప్రాణ సమర్పణం చేసిన ఏడుగురు యువ సాహసిక నావికులు, తదితర సిబ్బంది స్మారకార్థం నిర్మించడమైంది. ప్రధాన మంత్రి పత్రాదేవి లోని హుతాత్మ స్మారక్ ను కళ్ళకు కట్టే మై స్టాంప్ను కూడా విడుదల చేస్తారు. ఇది గోవా విమోచన ఉద్యమం లోని అమరవీరుల విశిష్ట త్యాగాల కు నమస్సులు అర్పిస్తుంది. గోవా విమోచన పోరాట కాలం లో వివిధ ఘట్టాల ను అభివర్ణించే ఒక దృశ్య మాలిక తో కూడిన మేఘ్ దూత్ పోస్ట్ కార్డును ఈ సందర్భం లో ప్రధాన మంత్రి కి కానుక గా ఇవ్వడం జరుగుతుంది.

ఉత్తమ పంచాయతీ/ఉత్తమ పురపాలక సంఘం, స్వయంపూర్ణ మిత్ర లు మరియు స్వయంపూర్ణ గోవా కార్యక్రమం లబ్ధిదారుల కు పురస్కారాల ను కూడా ప్రధాన మంత్రి ప్రదానం చేయనున్నారు.

ప్రధాన మంత్రి తన సందర్శన లో భాగం గా, మధ్యాహ్నం పూట 2గంటల 15 నిమిషాల కు పణజీ లోని ఆజాద్ మైదానం లో అమరవీరుల స్మారకం వద్ద పుష్పాంజలి ని కూడా సమర్పించనున్నారు. ఆయన 2గంటల 30 నిమిషాల వేళ కు పణజీ లోని మీరామార్ లో జరిగే సేల్ పరేడ్ ఎండ్ ఫ్లయ్ పాస్ట్ కు హాజరు అవుతారు.

***


(Release ID: 1782762) Visitor Counter : 147