గనుల మంత్రిత్వ శాఖ
కాంపోజిట్ లైసెన్సు మంజూరు కోసం వేలం వేయడానికి మినరల్ బ్లాక్ ల గుర్తింపును సులభతరం చేయడానికి ఖనిజాల (ఖనిజ విషయాల గుర్తింపు) నియమాలు, 2015 మరియు మినరల్ (వేలం) నియమాలు, 2015 సవరణ
మరింత భాగస్వామ్యం, పోటీలపై సవరణ దృష్టి పెడుతుంది
వేలం కోసం ప్రతిపాదిత బ్లాక్ యొక్క ఖనిజ సంభావ్యతను అంచనా వేయడానికి రాష్ట్ర ప్రభుత్వం కమిటీని ఏర్పాటు చేసింది
प्रविष्टि तिथि:
16 DEC 2021 11:44AM by PIB Hyderabad
మినరల్స్ (ఖనిజ విషయాల గుర్తింపు) నియమాలు, 2015 [ఎం.ఈ.ఎం.సి. నియమాలు] మరియు ఖనిజ (వేలం) నియమాలు, 2015 [వేలం నియమాలు] సవరణ కోసం, వరుసగా, మినరల్స్ (ఖనిజ విషయాల గుర్తింపు) రెండవ సవరణ నియమాలు, 2021 మరియు మరియు ఖనిజ (వేలం) నాల్గవ సవరణ నియమాలు, 2021 లను గనుల మంత్రిత్వ శాఖ ప్రకటించింది.
రాష్ట్ర ప్రభుత్వాలు, పరిశ్రమల సంఘాలు, గనుల యజమానులు, ఇతర భాగస్వాములతో పాటు, సాధారణ ప్రజలతో కూడా విస్తృత సంప్రదింపుల అనంతరం, ఈ సవరణ నియమాలను రూపొందించడం జరిగింది.
ఎవరు వేలం లో పాల్గొనాలని అనుకుంటున్నారో, వారికి అందుబాటులో ఉన్న జియోసైన్స్ డేటా ఆధారంగా బ్లాక్ ల ఖనిజ సంభావ్యతను గుర్తించిన కాంపోజిట్ లైసెన్స్ వేలం కోసం తగిన బ్లాక్‌లను ప్రతిపాదించడానికి, ఎం.ఈ.ఎం.సి. నిబంధనల్లోని ఈ సవరణ, ఏ వ్యక్తి నైనా అనుమతిస్తుంది. బ్లాక్‌ల ఖనిజ సామర్థ్యాన్ని, రాష్ట్ర ప్రభుత్వం ఏర్పాటు చేసిన కమిటీ, అంచనా వేయాలి. అందువల్లే, ఆ కమిటీ, వేలం కోసం బ్లాక్ ను ప్రతిపాదించి సిఫార్సు చేసింది. అదేవిధంగా, వేలం నియమాలలో సవరణ ప్రకారం ఎవరైనా ప్రతిపాదించిన బ్లాక్‌లను వేలం కోసం నోటిఫై చేసినట్లయితే, ఆ వ్యక్తి, తాను ప్రతిపాదించిన బ్లాక్ ల వేలంలో బిడ్ సెక్యూరిటీ మొత్తం లో కేవలం సగం మాత్రమే డిపాజిట్ చేసే విధంగా, ఆ వ్యక్తి కి ప్రోత్సాహకం అందించడం జరుగుతుంది.
ఈ సవరణలు, వేలంలో మరింత భాగస్వామ్యాన్ని, పోటీని ప్రోత్సహిస్తాయి. కాంపోజిట్ లైసెన్స్‌ల వేలం కోసం మరిన్ని బ్లాక్ లను గుర్తించే రాష్ట్ర ప్రభుత్వ ప్రక్రియలను, ఇవి సులభతరం చేస్తుంది.
నేపధ్యం :
ఖనిజాలు (ఖనిజ విషయాల గుర్తింపు) నియమాలు, 2015 ని ఇటీవల జూన్, 2021లో సవరించడం జరిగింది. ఇతర విషయాలలో, కనీసం నిఘా సర్వే (జి-4) స్థాయిని పూర్తి చేసిన ప్రాంతాలకు సంబంధించి మిశ్రమ లైసెన్స్ మంజూరు చేయడానికి వేలం కోసం అందించడానికి, లేదా అందుబాటులో ఉన్న జియో సైన్స్ సమాచారం ఆధారంగా బ్లాక్ కు చెందిన ఖనిజ సంభావ్యతను గుర్తించినప్పటికీ, వనరులు ఇంకా సమకూర్చడం జరగలేదు.
అదే సమయంలో, మిశ్రమ లైసెన్స్ కోసం అటువంటి బ్లాక్ లను వేలం వేయడానికి బిడ్ భద్రత, పనితీరు భద్రత, ఇతర అర్హత షరతులను సూచించడానికి మినరల్ (వేలం) నియమాలు, 2015 ను సవరించడం జరిగింది. రాబోయే బిడ్డర్లు, ఇతర భాగస్వాముల సహాయం కోసం, ఓ.సి.బి.ఐ.ఎస్. పోర్టల్ లో భౌగోళిక సంభావ్య ప్రాంతాల బేస్ లైన్ జియోసైన్స్ సమాచారానికి సంబంధించిన డేటాబేస్ ను, జియోలాజికల్ సర్వే ఆఫ్ ఇండియా (జి.ఎస్.ఐ) ఉచితంగా అందుబాటులో ఉంచింది.
ఖనిజ రంగంలో ఇటీవల తీసుకున్న విధాన సంస్కరణలకు అనుబంధంగా నిబంధనలలో ప్రస్తుత సవరణ ఉంటుంది. మరిన్ని బ్లాక్ లను వేలం వేయడానికి వీలు కల్పిస్తుంది. తద్వారా దేశంలో ఉత్పత్తి, ఖనిజ సరఫరా పెరుగుతుంది.
*****
(रिलीज़ आईडी: 1782584)
आगंतुक पटल : 207