యువజన వ్యవహారాలు, క్రీడల మంత్రిత్వ శాఖ
ఖేలో ఇండియా 21 ఏళ్ళ లోపు మహిళల హాకీ లీగ్ మొదటి ఎడిషన్ ను రేపు ప్రారంభించనున్న - కేంద్ర క్రీడా శాఖ మంత్రి శ్రీ అనురాగ్ సింగ్ ఠాకూర్
ఖేలో ఇండియా లీగ్ ద్వారా అదనపు పోటీని ప్రదర్శించనున్న - భారతదేశ 21 ఏళ్ళ లోపు హాకీ జట్టు ప్రతిభ
प्रविष्टि तिथि:
14 DEC 2021 4:30PM by PIB Hyderabad
కీలక ముఖ్యాంశాలు :
* అభివృద్ధి చెందుతున్న పోటీ ప్రతిభను ప్రదర్శించడానికి అదనపు అవకాశాన్ని కల్పించాలనే ఉద్దేశంతో, కేంద్ర యువజన వ్యవహారాలు, క్రీడల మంత్రిత్వ శాఖ ఈ పోటీలను రూపొందించింది.
* ఖేలో ఇండియా 21 ఏళ్ళ లోపు మహిళల హాకీ లీగ్ మొదటి ఎడిషన్ 2021 డిసెంబర్ 15వ తేదీ నుండి 21వ తేదీ వరకు జరుగుతుంది.
ఖేలో ఇండియా 21 ఏళ్ళ లోపు మహిళల హాకీ లీగ్, మొదటి ఎడిషన్ ను, కేంద్ర యువజన వ్యవహారాలు మరియు క్రీడల మంత్రి శ్రీ అనురాగ్ సింగ్ ఠాకూర్ బుధవారం (డిసెంబర్ 15, 2021) రోజు న్యూఢిల్లీలోని ఐకానిక్ మేజర్ ధ్యాన్ చంద్ నేషనల్ స్టేడియంలో ప్రారంభించనున్నారు. ఈ పోటీలు 2021 డిసెంబర్ 15వ తేదీ నుండి డిసెంబర్ 21వ తేదీ వరకు జరుగుతాయి. అభివృద్ధి చెందుతున్న పోటీ ప్రతిభను ప్రదర్శించడానికి అదనపు అవకాశాన్ని కల్పించాలనే ఉద్దేశంతో, కేంద్ర యువజన వ్యవహారాలు, క్రీడల మంత్రిత్వ శాఖ ఈ పోటీలను రూపొందించింది.
హాకీ ఇండియా సహకారంతో స్పోర్ట్స్ అథారిటీ ఆఫ్ ఇండియా ఈ పోటీలను నిర్వహిస్తోంది. 14 జట్లు పాల్గొంటున్న ఈ పోటీల్లో భాగంగా ప్రారంభ మ్యాచ్, భువనేశ్వర్ కు చెందిన ఒడిశా నావల్ టాటా హాకీ హై పెర్ఫార్మెన్స్ సెంటర్ జట్టు మరియు కర్నాల్ కు చెందిన రాజా కరణ్ హాకీ అకాడమీ జట్ల మధ్య జరుగుతుంది.
ఎఫ్.ఐ.హెచ్. మహిళల జూనియర్ హాకీ ప్రపంచ కప్ కోసం సిద్ధమవుతున్న భారత జూనియర్ జట్టు, అదనపు ఆకర్షణగా ఈ పోటీల్లో పాల్గొంటోంది. కాగా, స్పోర్ట్స్ అథారిటీ ఆఫ్ ఇండియా కు చెందిన రెండు జట్లు చెరో వైపు పాల్గొని ఈ పోటీల్లో విజయం సాధించాలని ఎదురుచూస్తున్నాయి. మొత్తం 14 జట్లు ఇక్కడ ఏడు రోజుల పాటు తమ క్రీడా ప్రతిభను ప్రదర్శించడానికి పోటీపడనున్నాయి.
మహిళల హాకీ సమాజంలో స్పష్టమైన ఉత్సాహం కనబడుతోంది. అది భారత మాజీ కెప్టెన్ ప్రీతమ్ రాణి శివాచ్ ద్వారా మరింత ఎక్కువగా ప్రతిబింబిస్తోంది. 1998లో అర్జున అవార్డును, గత నెలలో ద్రోణాచార్య అవార్డును అందుకున్న ప్రీతమ్ శివాచ్, ఈ సందర్భంగా మాట్లాడుతూ, "దేశంలోని అత్యుత్తమ జట్లపై తమ ప్రతిభను ప్రదర్శించేందుకు దేశవ్యాప్తంగా ఉన్న క్రీడాకారులకు ఇది ఒక గొప్ప అవకాశం", అని, పేర్కొన్నారు.
“ఇండియా జూనియర్ జట్టుతో పాటు స్పోర్ట్స్ అథారిటీ ఆఫ్ ఇండియా కు చెందిన రెండు జట్లు గట్టి ఇస్తాయని తెలిసినప్పటికీ, అన్ని జట్లు తమ అత్యుత్తమ పోటీని ప్రదర్శించడానికి ముందడుగు వేస్తాయని నేను ఖచ్చితంగా భావిస్తున్నాను. ప్రతి మ్యాచ్ నాణ్యమైన హాకీ స్ఫూర్తిని రేకెత్తించి, పోటీలో అత్యుత్తమ జట్లతో పోరాడే అవకాశాన్ని లీగ్ ఆటగాళ్లకు అందిస్తుంది." అని ఆమె ఆశాభావం వ్యక్తం చేశారు.
భువనేశ్వర్ లోని కళింగ స్టేడియంలో తుది పోరుకు జట్లు సిద్ధమవడానికి ముందు, ఈ పోటీల రెండో దశ లక్నోలోని ఎస్.ఏ.ఐ. సెంటర్‌లో జరుగుతుంది. ఈ ఏడాది ప్రారంభంలో టోక్యోలో జరిగిన ఒలింపిక్ క్రీడల్లో భారత జట్టు నాల్గవ స్థానం సాధించడంతో మహిళల హాకీపై కలిగిన ఆసక్తి ని ఈ పోటీలు మరింతగా పెంపొందిస్తాయి.
జట్లను ఈ క్రింది విధంగా రెండు గ్రూపులుగా విభజించారు:
గ్రూప్ - 'ఏ' :
ఇండియా జూనియర్స్;
స్పోర్ట్స్ అథారిటీ ఆఫ్ ఇండియా-బి, న్యూఢిల్లీ;
ఒడిశా నావల్ టాటా హాకీ హై పెర్ఫార్మెన్స్ సెంటర్, భువనేశ్వర్;
ఖల్సా హాకీ అకాడమీ, అమృత్‌సర్;
ముంబై స్కూల్స్ స్పోర్ట్స్ అసోసియేషన్;
రాజా కరణ్ హాకీ అకాడమీ;
హిమ్ అకాడమీ, వికాస్ నగర్ (హిమాచల్ ప్రదేశ్).
గ్రూప్ - 'బి' :
స్పోర్ట్స్ అథారిటీ ఆఫ్ ఇండియా-ఏ, న్యూఢిల్లీ;
మధ్యప్రదేశ్ హాకీ అకాడమీ, భోపాల్;
హర్ హాకీ అకాడమీ, సోనిపట్;
జై భారత్ హాకీ అకాడమీ, ఢిల్లీ;
ప్రీతమ్ శివాచ్ హాకీ అకాడమీ, సోనిపట్;
స్పోర్ట్స్ హాస్టల్, భువనేశ్వర్;
ఢిల్లీ హాకీ.
*****
(रिलीज़ आईडी: 1781781)
आगंतुक पटल : 160