ఆరోగ్య, కుటుంబ సంక్షేమ‌ మంత్రిత్వ శాఖ
azadi ka amrit mahotsav

ఎబి-పిఎంజెఎవై కింద ఆరోగ్య సేవ‌ల‌ను మెరుగ్గా అందుబాటులోకి తెచ్చేందుకు కృషి

నాడు పోస్టు చేయడమైనది: 14 DEC 2021 2:16PM by PIB Hyderabad

ఆయుష్మాన్ భార‌త్ - ప్ర‌ధాన‌మంత్రి జ‌న్ ఆరోగ్య యోజ‌న (ఎబి-పిఎంజెఎవై) అన్న‌ది అర్హ‌త ఆధారిత ప‌థ‌కం. ఈ ప‌థ‌కం కింద లబ్ధిని పొందేందుకు ల‌బ్ధిదారు ఎటువంటి న‌మోదు చేసుకోన‌వ‌స‌రం లేదు. న‌గ‌దుర‌హిత చికిత్స ల‌బ్ధిని పొందేందుకు ల‌బ్ధిదారు నేరుగా జాబితాలో చేర్చిన ఆసుప‌త్రుల‌కు (ప్ర‌భుత్వ లేదా ప్రైవేటు) వెళ్ళ‌వ‌చ్చు. ఈ ప‌థ‌కం కింద త‌న అర్హ‌త‌ను ప‌రిశీలించేందుకు ల‌బ్ధిదారు దిగువ‌న ఇచ్చిన మార్గాల‌ను ఉప‌యోగించుకోవ‌చ్చుః 
* ఎన్‌హెచ్ఎకు 14555 అన్న నెంబ‌రుపై  24x7 ప‌ని చేసే కాల్‌సెంట‌ర్ ఉంది. దీని గురించి విస్త్ర‌త ప్ర‌చారం జ‌రిగింది.
* ల‌బ్ధిదారులు ఏదైనా ప్ర‌భుత్వ ఆసుప‌త్రి ( సిహెచ్‌సి, ఆ పైన ఉన్న‌)కి ల‌బ్దిదారు ధృవీక‌ర‌ణ వెళ్ళ‌వ‌చ్చు.  ప్ర‌భుత్వ ఆసుప‌త్రిలో ధృవీక‌ర‌ణ త‌ర్వాత‌, ల‌బ్ధిదారుల‌కు త‌గిన చికిత్స‌ను అందించ‌డం లేదా ద‌గ్గ‌ర‌లో ఉన్న ప్ర‌భుత్వ లేక జాబితాలో చేర్చిన ప్రైవేటు ఆసుప‌త్రికి నిర్దేశించ‌వ‌చ్చు. 
* ల‌బ్ధిదారు అత‌డి/ ఆమె అర్హ‌త‌ను, ద‌గ్గ‌ర‌లో ఉన్న జాబితాలో చేర్చిన ఆసుప‌త్రిని పిఎంజెఎవై మొబైల్ ఆప్ ద్వారా వెతుక్కోవ‌చ్చు. 
* ఎబి-పిఎంజెఎవై కింద అత‌డి/ ఆమె అర్హ‌త‌ను నిర్ధారించుకునేందుకు ల‌బ్ధిదారులు mera.PMJAY.gov.in అన్న లింక్‌ను క్లిక్ చేయ‌డం ద్వారా తెలుసుకోవ‌చ్చు.
* ల‌బ్ధిదారులు ఈ ప‌థ‌కంలోని అన్ని లాభాల‌ను పొందేందుకు తీసుకోవ‌ల‌సిన అవ‌స‌ర‌మైన చ‌ర్య‌ల‌ను సుల‌భ‌త‌రం చేర్చేందుకు జాబితాలో చేర్చిన అన్ని ఆసుప‌త్రులలో (ప్ర‌భుత్వ లేక ప్రైవేటు) ప్ర‌ధాన‌మంత్రి ఆరోగ్య మిత్ర సౌక‌ర్యం ఉంటుంది. 
ఎబి-పిఎంజెఎవై అమ‌లు ఏజెన్సీ అయిన జాతీయ ఆరోగ్య అథారిటీ మోసాల నిరోధానికి స‌మ‌గ్ర మార్గ‌ద‌ర్శ‌కాల‌ను జారీ చేసింది. రాష్ట్రాల‌కు, కేంద్ర పాలిత ప్రాంతాల‌కు మోసాల నిరోధాల‌కు సంబంధించి నిత్యం మోసాల నిరోధానికి స‌ల‌హాల‌ను జారీ చేస్తుంది.  రాష్ట్ర స్థాయిలో రాష్ట్ర  మోసాల నిరోధ యూనిట్ల (ఎస్ఎఎఫ్‌యులు)తోడ్పాటుతో మోసాల‌ నిరోధ‌క చ‌ట్రం అమ‌లును స‌మ‌గ్రంగా ప‌ర్య‌వేక్షించేందుకు జాతీయ ఆరోగ్య అథారిటీలో జాతీయ మోసాల నిరోధ‌క యూనిట్ (ఎన్ ఎఎఫ్‌యు)ను సృష్టించింది. ఆమోదానికి, చెల్లింపుకు ముందు, చికిత్స పొందుతున్న వ్య‌క్తి ఫోటో స‌హా త‌గిన అన్ని స‌హాయ‌క ప‌త్రాల‌ను న‌మోదు చేయ‌వ‌ల‌సి ఉంటుంది. అన్ని ప్రైవేటు ఆసుప‌త్రుల‌లోనూ ఆసుప‌త్రిలో చేర్చుకునే స‌మ‌యంలోనూ , డిశ్చార్జ్ చేసే స‌మ‌యంలో ల‌బ్ధిదారును ఆధార్ ఆధారిత బ‌యోమెట్రిక్ ధృవీక‌ర‌ణ చేసే అంశాన్ని ప్ర‌వేశ‌పెట్టారు. మోసాల‌ను క్రియాశీల‌కంగా గుర్తించేందుకు స‌మ‌గ్ర విశ్లేష‌ణాత్మ‌క ప‌రిష్కారాల కోసం ఆర్టిఫిషియ‌ల్ ఇంటెలిజెన్స్‌ను, మెషీన్ లెర్నింగ్ ను త‌యారు చేయ‌డ‌మే కాక‌, అనుమానిత లావాదేవీల‌ను, సంస్థ‌ల‌ను గుర్తించేందుకు, ఆసుప‌త్రుల రిస్క్ స్కోరింగ్‌ను, క్లెయిముల‌ను నిరంత‌రం గుర్తించ‌డానికి భారీ స్థాయిలో డేటాను ఉప‌యోగించే ఆల్గోరిథ‌మ్‌ల‌ను అభివృద్ధి చేయ‌డం జ‌రిగింది. 
ఈ రోజు రాజ్య‌స‌భ‌లో అడిగిన ఒక ప్ర‌శ్న‌కు లిఖిత‌పూర్వ‌కంగా ఇచ్చిన స‌మాధానంలో కేంద్ర ఆరోగ్య‌, కుటుంబ సంక్ష‌మ శాఖ స‌హాయ మంత్రి డాక్ట‌ర్ భార‌తి ప్ర‌వీణ్ ప‌వార్ వెల్ల‌డించారు. 

 

***
 


(రిలీజ్ ఐడి: 1781501) సందర్శకుల సూచీ సంఖ్య : : 152
ఈ ప్రకటనను ఇందులో చదవగలరు: English , Urdu , Bengali , Tamil , Malayalam