సూక్ష్మ, లఘు, మధ్య తరహా సంస్థల మంత్రిత్వ శాఖష్
ఎంఎస్ఎంఇ- ఎన్ఎస్ఐసి రుణంతో కర్మాగార కార్మికుడి నుంచి విజయవంతమైన వ్యాపరవేత్తగా పరివర్తన చెందిన సుమిత్ కుమార్
Posted On:
14 DEC 2021 12:46PM by PIB Hyderabad

తన కలల వ్యాపారమైన శుభ్రత కోసం వినియోగించే ప్లాస్టిక్ బ్రష్‌లను ఉత్పత్తి చేసే సంస్థను సుమిత్ ఎంటర్‌ప్రైజెస్ పేరిట 2018లో ఆగ్రాకు చెందిన సుమిత్ కుమార్ ప్రారంభించాడు. అత్యంత సాధారణ నేపథ్యం నుంచి వచ్చిన సుమిత్, ఒక కర్మాగారంకూలీ స్థాయి నుంచి వ్యాపారవేత్తగా పరివర్తన చెంది గొప్ప విజయాలను సాధించాడు. తన వ్యాపార ప్రయాణాన్ని గురించి మాట్లాడుతూ, నేను రూ. 2 వలక్షల తో నా వ్యాపారాన్ని ప్రారంభించాను. మార్కెట్‌లో నా ఉత్పత్తులకు డిమాండ్ పెరుగుతున్నప్పటికీ నిధుల కొరత వల్ల నేను ఆర్డర్లను తీసుకోలేకపోయేవాడిని. నాకు రుణం అవసరమైంది కానీ దురదృష్టవశాత్తు బ్యాంకు నా విజ్ఞప్తిని తోసిపుచ్చింది. ఆ తర్వాత నేను ఎంఎస్ఎంఇ శాఖకు వెళ్ళి, వారి మద్దతుతో రూ. 411000 రుణాన్ని పొందగలిగాను. నేడు నా అర్థ సంవత్సర టర్నోవర్ రూ. 30 లక్షలుగా ఉంది. నేను ఎన్ఎస్ఐసి ఎంఎస్ఎంఇ రుణం కారణంగా కూలీ స్థాయి నుంచి వ్యాపార యజమానిగా పరివర్తన చెందగలిగాను, అని సుమిత్ వివరించాడు. ఎంఎస్ఎంఇ మంత్రిత్వ శాఖ అతడు స్వావలంబన సాధించేందుకు అతడిని సాధికారం చేసింది.
****
(Release ID: 1781320)