ఆరోగ్య, కుటుంబ సంక్షేమ‌ మంత్రిత్వ శాఖ
azadi ka amrit mahotsav

కొవిడ్‌-19 తాజా సమాచారం

Posted On: 14 DEC 2021 9:32AM by PIB Hyderabad

దేశవ్యాప్త కొవిడ్‌-19 టీకా కార్యక్రమంలో భాగంగా, ఇప్పటివరకు 133.88 కోట్ల డోసులను అందించారు.

దేశవ్యాప్త క్రియాశీల కేసుల సంఖ్య 88,993; ఇది 563 రోజుల కనిష్ట స్థాయి.

మొత్తం కేసుల్లో క్రియాశీల కేసులు 1% కంటే తక్కువగా, 0.26% వద్ద ఉన్నాయి. 2020 మార్చి నుంచి ఇది కనిష్ట స్థాయి.

రికవరీ రేటు 98.37% కు చేరింది. 2020 మార్చి నుంచి ఇది గరిష్ట స్థాయి.

గత 24 గంటల్లో 7,995 మంది కోలుకున్నారు. దీంతో, కోలుకున్నవారి మొత్తం సంఖ్య 3,41,38,763 కు పెరిగింది.

గత 24 గంటల్లో 5,784 కొత్త కేసులు నమోదయ్యాయి.

రోజువారీ పాజిటివిటీ రేటు (0.58%) గత 71 రోజులుగా 2% కన్నా తక్కువగా ఉంది.

వారపు పాజిటివిటీ రేటు (0.68%) గత 30 రోజులుగా 1% కన్నా తక్కువగా ఉంది.

ఇప్పటివరకు 65.76 కోట్ల కొవిడ్‌ పరీక్షలు చేశారు.

****




(Release ID: 1781308) Visitor Counter : 142