సూక్ష్మ‌, లఘు, మధ్య త‌ర‌హా సంస్థల మంత్రిత్వ శాఖష్

ఖాదీ మళ్ళీ విశ్వ మార్కెట్ లోకి; యుఎస్ ఫ్యాషన్ బ్రాండ్ "పటగోనియా" దాని దుస్తులు కోసం ఖాదీ డెనిమ్‌ను ఎంచుకుంది

Posted On: 13 DEC 2021 11:55AM by PIB Hyderabad

ఖాదీ, సుస్థిరతకు స్వచ్ఛతకు చిహ్నం, ప్రపంచ ఫ్యాషన్ రంగంలో పెద్ద పురోగతిని సాధించింది. యుఎస్-ఆధారిత ప్రపంచంలోని ప్రముఖ ఫ్యాషన్ బ్రాండ్, పటగోనియా, ఇప్పుడు డెనిమ్ దుస్తులను తయారు చేయడానికి చేతితో తయారు చేసిన ఖాదీ డెనిమ్ ఫాబ్రిక్‌ను ఉపయోగిస్తోంది. టెక్స్‌టైల్ దిగ్గజం అరవింద్ మిల్స్ ద్వారా పటగోనియా, గుజరాత్ నుంచి రూ.1.08 కోట్ల విలువైన దాదాపు 30,000 మీటర్ల ఖాదీ డెనిమ్ ఫ్యాబ్రిక్‌ను కొనుగోలు చేసింది.

 

                

జూలై 2017లో, ఖాదీ, గ్రామీణ పరిశ్రమల కమిషన్ (కేవిఐసి) ప్రపంచవ్యాప్తంగా ఖాదీ డెనిమ్ ఉత్పత్తులను వ్యాపారం చేయడానికి అహ్మదాబాద్‌లోని అరవింద్ మిల్స్ లిమిటెడ్‌తో ఒప్పందంపై సంతకం చేసింది. అప్పటి నుండి, అరవింద్ మిల్స్ గుజరాత్‌లోని కేవిఐసి- ధృవీకరించిన ఖాదీ సంస్థల నుండి ప్రతి సంవత్సరం పెద్ద మొత్తంలో ఖాదీ డెనిమ్ ఫాబ్రిక్‌ను కొనుగోలు చేస్తోంది.

             

 

కేవిఐసి ఈ కొత్త చొరవ గుజరాత్‌లోని ఖాదీ కళాకారుల కోసం అదనపు పనిగంటలను సృష్టించడమే కాకుండా "లోకల్ టు గ్లోబల్" అనే ప్రధానమంత్రి కలను కూడా నెరవేరుస్తోంది. పటగోనియా ఖాదీ డెనిమ్‌ను కొనుగోలు చేయడం వల్ల ఖాదీ కళాకారులకు అదనంగా 1.80 లక్షల పని గంటలు, అంటే 27,720 పనిదినాలు సృష్టించబడ్డాయి. అక్టోబర్ 2020లో ఆర్డర్ చేయగా షెడ్యూల్ ప్రకారం 12 నెలల వ్యవధిలో, అంటే అక్టోబర్ 2021లో ఇది అమలు చేసారు.

కేవిఐసి చైర్మన్ శ్రీ వినయ్ కుమార్ సక్సేనా మాట్లాడుతూ, ఖాదీ ప్రపంచంలోనే అత్యంత స్థిరమైన మరియు పర్యావరణ అనుకూలమైన ఫాబ్రిక్‌గా దాని అసలు విలువలను నిలుపుకున్నప్పటికీ, ఖాదీ అత్యంత ఫ్యాషనబుల్ మరియు ట్రెండ్‌సెట్టింగ్ ధరించగలిగేదిగా పరిణామం చెందిందని అన్నారు. "ఖాదీ డెనిమ్ ప్రపంచంలోనే చేతితో తయారు చేసిన డెనిమ్ ఫాబ్రిక్, ఇది దేశ విదేశాలలో విస్తృత ప్రజాదరణ పొందింది. ఖాదీ డెనిమ్ ఫాబ్రిక్  అత్యుత్తమ నాణ్యత, సౌలభ్యం, సేంద్రీయ మరియు పర్యావరణ అనుకూల లక్షణాల కారణంగా ప్రముఖ ఫ్యాషన్ బ్రాండ్‌లచే ఎక్కువగా ఉపయుయోగిస్తున్నారు. ఖాదీ డెనిమ్ ప్రధానమంత్రి ఊహించిన విధంగా ‘లోకల్ టు గ్లోబల్’కి సముచిత ఉదాహరణ” అని సక్సేనా అన్నారు.

గత సంవత్సరం, పటగోనియా నుండి ఒక బృందం ఖాదీ డెనిమ్ తయారీ ప్రక్రియను చూడటానికి రాజ్‌కోట్ (గుజరాత్)లోని గోండాల్‌లో ఉన్న ఉద్యోగ్ భారతి అనే ఖాదీ సంస్థను సందర్శించింది. హ్యాండ్‌క్రాఫ్ట్ చేసిన ఖాదీ డెనిమ్ ఫాబ్రిక్ తయారీ ప్రక్రియ మరియు నాణ్యతతో ఆకట్టుకున్న పటగోనియా, అరవింద్ మిల్స్ ద్వారా వివిధ పరిమాణాల ఖాదీ డెనిమ్ ఫాబ్రిక్ కోసం కొనుగోలు ఆర్డర్‌లను చేసింది.

కొనుగోళ్లను ఖరారు చేయడానికి ముందు, పటగోనియా గోండాల్‌లో డెనిమ్ ఉత్పత్తి పూర్తి ప్రక్రియను అంచనా వేయడానికి యుఎస్ -ఆధారిత గ్లోబల్ థర్డ్-పార్టీ మదింపుదారు అయిన నెస్ట్ ని నియమించింది, అనగా స్పిన్నింగ్, నేయడం, కార్డింగ్, డైయింగ్, వేతన చెల్లింపులు, కార్మికుల వయస్సు-ధృవీకరణ మొదలైనవి. నెస్ట్, ఉద్యోగ్ భారతిలో అన్ని పారామితులను క్షుణ్ణంగా అంచనా వేసిన తర్వాత, "స్పిన్నింగ్ మరియు హ్యాండ్లూమ్ నేయడం కార్యకలాపాలు ఇప్పుడు నెస్ట్ సీల్ ఆఫ్ ఎథికల్ హ్యాండ్‌క్రాఫ్ట్‌కు అర్హత పొందాయి" అని సర్టిఫికేట్‌లో పేర్కొంది. దేశంలోని ఒక ఖాదీ సంస్థ తన కార్యకలాపాలలో నైతిక ప్రమాణాలను పాటించినందుకు అంతర్జాతీయ స్వతంత్ర మదింపుదారుచే అంచనా వేయబడి, ధృవీకరించబడటం ఇదే మొదటిసారి. ఈ ఆర్డర్ నాలుగు రకాల డెనిమ్ ఫాబ్రిక్‌తో తయారు తాయారు అయింది. దీని వెడల్పు 28-అంగుళాల నుండి 34-అంగుళాల వరకు ఉంటుంది. 100 శాతం కాటన్‌తో తయారు అయింది. 

****



(Release ID: 1781123) Visitor Counter : 125