వ్యవసాయ మంత్రిత్వ శాఖ

ఈ నెల 16న ఆగ్రో అండ్ ఫుడ్ ప్రాసెసింగ్ పై జాతీయ శిఖరాగ్ర సదస్సులో ప్రసంగించనున్న ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ


సహజ వ్యవసాయం సవిస్తర రూపురేఖలను ఆవిష్కరించనున్న సదస్సు

రైతుల ఆదాయాన్ని పెంచడానికి ఆశాజనక సాధనంగా జీరో బడ్జెట్ సహజ వ్యవసాయం

Posted On: 13 DEC 2021 5:44PM by PIB Hyderabad

2021 డిసెంబరు 16వ తేదీ ఉదయం 11 గంటల నుండి ఆగ్రో అండ్ ఫుడ్ ప్రాసెసింగ్ పై జాతీయ శిఖరాగ్ర సమావేశం ముగింపు సమావేశంలో ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ ప్రసంగిస్తారు, దీనిలో ప్రకృతి వ్యవసాయం యొక్క వివరమైన రూపురేఖలను సమర్పించనున్నారు. 2021 డిసెంబర్ 14 నుంచి 16 వరకు గుజరాత్ లోని ఆనంద్ లో జరగనున్న ప్రీ ఈవెంట్ వైబ్రెంట్ గుజరాత్ సమ్మిట్ లో భాగంగా ఈ శిఖరాగ్ర సమావేశం జరుగుతోంది.

ఈ సదస్సుకు 5000 మంది రైతులు హాజరుకానున్నారు. ఇది కాకుండా ICAR యొక్క 80 కేంద్ర సంస్థలు, కృషి విజ్ఞాన కేంద్రాలు ,రాష్ట్రాలలోని ATMA నెట్‌వర్క్ కూడా కార్యక్రమాన్ని ప్రత్యక్షంగా చూసేందుకు, సహజ వ్యవసాయం అభ్యాసం ,ప్రయోజనాల గురించి తెలుసుకోవడానికి రైతులతో అనుసంధానం అవుతాయి. అదనంగా, దేశవ్యాప్తంగా ఉన్న రైతులు ,ప్రజలు దూరదర్శన్ లో ప్రత్యక్షంగా చూడటానికి https://pmindiawebcast.nic.inor లింక్ ద్వారా కాన్ఫరెన్స్ లో పాల్గొనవచ్చు.

గత ఆరేళ్లలో రైతుల ఆదాయాన్ని పెంచడానికి వ్యవసాయం లో మార్పులు తెచ్చేలా ప్రభుత్వం అనేక చొరవలకు శ్రీకారం చుట్టింది. వ్యవస్థ సుస్థిరత, ఖర్చు తగ్గింపు, మార్కెట్ ప్రాప్యత ,రైతులకు మెరుగైన అవగాహన కు దారితీసే చొరవలను ప్రోత్సహించడానికి ,మద్దతు ఇవ్వడానికి ప్రయత్నాలు జరుగుతున్నాయి

జీరో బడ్జెట్ సహజ వ్యవసాయం గురించి:

జీరో బడ్జెట్ సహజ వ్యవసాయం ఉపకరణాల కొనుగోలు పై రైతులు ఆధారపడటాన్ని తగ్గించడానికి, మెరుగైన భూసార ఆరోగ్యానికి దారితీసే సాంప్రదాయ క్షేత్ర స్థాయి ఆధారిత సాంకేతికతలపై ఆధారపడటం ద్వారా వ్యవసాయ వ్యయాన్ని తగ్గించడానికి ఒక ఆశాజనక సాధనంగా కూడా గుర్తించబడింది.

ఇది వ్యవసాయ పద్ధతులను మోనో-పంటల నుండి వైవిధ్యభరితమైన బహుళ పంటల వ్యవస్థకు మారవలసిన అవసరాన్ని నొక్కి చెబుతుంది. దేశీ ఆవు, దాని పేడ ,మూత్రం ఒక ముఖ్యమైన పాత్రను పోషిస్తాయి, దీని నుండి బీజామృత్, జీవామృత్ ,ఘన్జీవమృత్ వంటి వివిధ ఇన్ పుట్ లు పొలంలో తయారు అవుతాయి. మంచి వ్యవసాయ ఉత్పత్తి కోసం పోషకాలు , భూసారానికి జీవం, . బయోమాస్ తో మట్టిని మల్చింగ్ చేయడం లేదా మట్టిని సంవత్సరం పొడవునా ఆకుపచ్చ కవర్ తో కప్పడం వంటి ఇతర సంప్రదాయ విధానాలు, చాలా తక్కువ నీటి లభ్యత పరిస్థితుల్లో కూడా పాటించిన మొదటి సంవత్సరం నుంచే స్థిరమైన ఉత్పాదకతను నిర్ధారించే విధానాలు జోడించబడ్డాయి.

ఇటువంటి వ్యూహాలపై నొక్కి చెప్పడానికి, దేశంలోని సుదూర ప్రాంతాల్లోని రైతులకు సందేశాన్ని అందించడానికి గుజరాత్ ప్రభుత్వం ప్రకృతి వ్యవసాయంపై దృష్టి

సారించింది. గుజరాత్ లోని ఆనంద్ లో డిసెంబర్ 14 నుండి డిసెంబర్ 16 వరకు వ్యవసాయ మరియు ఆహార ప్రాసెసింగ్ పై జాతీయ శిఖరాగ్ర సమావేశాన్ని నిర్వహిస్తోంది.

ప్రకృతి వ్యవసాయం అనే అంశంపై తమ ఆలోచనలను పంచుకోవడానికి ప్రముఖ వక్తలను ఆహ్వానించారు. దేశం నలుమూలల నుండి ౩౦౦ మందికి పైగా ఎగ్జిబిటర్లతో కూడిన ప్రదర్శన అదనపు ఆకర్షణగా ఉంటుంది.

 

****



(Release ID: 1781117) Visitor Counter : 167