ప్రధాన మంత్రి కార్యాలయం
డిసెంబర్ 13వ తేదీన వారణాసిని సందర్శించి శ్రీ కాశీ విశ్వనాథ్ ధామ్ ను ప్రారంభించనున్న ప్రధానమంత్రి
గంగానది గట్టు నుంచి శ్రీ కాశీ విశ్వనాథ్ ఆలయాన్ని తేలిగ్గా సంచరించగలిగే మార్గం ఏర్పాటు చేయాలన్న ప్రధానమంత్ర విజన్ ను సాకారం చేయనున్న ప్రాజెక్టు
ప్రాజెక్టు ప్రాంత విస్తృతి 5 లక్షల చదరపు అడుగులు, గతంలో ఉన్నది 3 వేల చదరపు అడుగులే
యాత్రికులు, భక్తులకు భిన్నత్వంతో కూడిన సదుపాయాలు అందించే 23 కొత్త భవనాల నిర్మాణం
మార్గం వెంబడి 300 పైగా ప్రాపర్టీలను సేకరించే కృషిలో ప్రతీ ఒక్కరినీ భాగస్వాములను చేస్తూ ప్రాజెక్టును లిటిగేషన్ రహితం చేయాలన్నది ప్రధానమంత్రి విజన్
40కి పైగా పురాతన ఆలయాల పునర్నిర్మాణం, పునరుజ్జీవం, కొత్త ముస్తాబు
Posted On:
12 DEC 2021 3:28PM by PIB Hyderabad
ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ డిసెంబర్ 13, 14 తేదీల్లో వారణాసి సందర్శించనున్నారు. 13వ తేదీ మధ్యాహ్నం ఒంటి గంట సమయంలో ప్రధానమంత్రి శ్రీ కాశీ విశ్వనాథ్ ఆలయాన్ని సందర్శించి ప్రార్థనలు చేసిన అనంతరం రూ.339 కోట్లతో నిర్మించిన శ్రీ కాశీ విశ్వనాథ్ ధామ్ తొలి దశను ప్రారంభిస్తారు.
పట్టణంలోని ఇరుకైన వీధులు, అపరిశుభ్రమైన పరిసరాల నడుమన నడుచుకుంటూ ప్రాచీన కాలం నాటి ఆచారానికి అనుగుణంగా పవిత్ర గంగానదిలో మునక వేసి ఆలయంలో సమర్పించుకునేందుకు గంగా జలాలు సేకరించుకునే బాబా విశ్వనాథ్ యాత్రికులు, భక్తులకు సౌకర్యవంతంగా ఉండే రీతిలో ఆ ప్రాంతాన్ని తీర్చి దిద్దాలన్నది ప్రధానమంత్రి విజన్. ఈ విజన్ సాకారం చేయడంలో భాగంగానే గంగానదీ తీరం నుంచి శ్రీ కాశీ విశ్వనాథ్ దేవాలయాన్ని అనుసంధానం చేసే మార్గాన్ని అభివృద్ధి చేసే ప్రాజెక్టు శ్రీకారం చుట్టుకుంది. ఈ పవిత్ర కార్యానికి నాందిగా 2019 మార్చి 8వ తేదీన ప్రధానమంత్రి ఈ ప్రాజెక్టుకు శంకుస్థాపన చేశారు.
ఈ ప్రాజెక్టుపై అన్ని దశల్లోనూ ప్రధానమంత్రి ఆసక్తిని ప్రదర్శిస్తూ క్రియాశీలంగా వ్యవహరిస్తున్నారు. ప్రధానమంత్రి ప్రాజెక్టు పురోగతిపై నిరంతరం సమావేశాలు, సమీక్షలు నిర్వహిస్తూ క్రమం తప్పకుండా పర్యవేక్షిస్తూ కాశీని యాత్రికులకు ప్రత్యేకించి అంగవైకల్యం గల వారికి మరింత సౌకర్యవంతంగా ఉండేలా తీర్చి దిద్దడానికి సలహాలు, సూచనలు ఇచ్చారు. వికలాంగులు, వయోవృద్ధులకు మరింత సౌకర్యవంతంగా ఉండేలా ర్యాంపులు, ఎస్కలేటర్లు వంటి ఎన్నో ఆధునిక వసతులు నెలకొల్పారు.
ప్రాజెక్టు తొలి దశలో భాగంగా 23 భవనాలను ప్రారంభించనున్నారు. ఇందులో భాగంగా నిర్మించిన ఈ భవనాలు యాత్రీ సువిధ కేంద్రాలు, టూరిస్టు ఫెసిలిటేషన్ కేంద్రాలు, వేదిక్ కేంద్ర, ముముక్షు ఝవన్, భోగ్ శాల, సిటీ మ్యూజియం, అన్ని ప్రాంతాలు చక్కగా చూడగలిగే గ్యాలరీ, ఫుడ్ కోర్టు వంటి ఎన్నో సదుపాయాలు శ్రీ కాశీ విశ్వనాథుని ఆలయాన్ని సందర్శించుకునే యాత్రికులకు అందచేస్తాయి.
ఈ ప్రాజెక్టు కోసం శ్రీ కాశీ విశ్వనాథుని ఆలయం చుట్టుపక్కల ఉన్న 300 పైగా ప్రాపర్టీలను కొనుగోలు చేసి స్వాధీనం చేసుకోవాల్సివచ్చింది. భూముల స్వాధీనంలో పరస్పర సంప్రదింపుల ఆధారిత సిద్ధాంతం అనుసరిస్తూ ప్రతీ ఒక్కరినీ వెంట నడిపించుకోవాలన్నది ప్రధానమంత్రి విజన్. ఇందులో భాగంగా 1400 మంది దుకాణదారులు, కిరాయిదారులు, ఇంటి యజమానులతో సామరస్య పూర్వకంగా సంప్రదించి పునరావాసం ఏర్పాటు చేశారు. దేశంలోని ఏ కోర్టులోనూ ఏ అంశం లిటిగేషన్ లో లేకపోవడం ఈ ప్రాజెక్టు ప్రత్యేకత.
అంతే కాదు ఈ అభివృద్ధి ప్రాజెక్టులో భాగంగా చారిత్రక ప్రాధాన్యం గల నిర్మాణాలన్నింటినీ కాపాడాలన్నది ప్రధానమంత్రి మరో విజన్. ఈ ముందుచూపు వల్లనే ప్రాజెక్టు ప్రాంతంలో పాత భవనాల కూల్చివేతల సందర్భంగా 40కి పైగా ప్రాచీన దేవాలయాలను పునరుద్ధరించారు. వీటి వాస్తవ నిర్మాణం చెక్కు చెదరని రీతిలో చక్కగా ముస్తాబు చేసి ఆకర్షణీయంగా తీర్చి దిద్దారు.
గతంలో ఈ పరిసరాల పరిధి 3000 చదరపు అడుగులకే పరిమితం కాగా ఇప్పుడు ప్రాజెక్టు అభివృద్ధిలో భాగంగా ఆ విస్తారాన్ని 5 లక్షల చదరపు అడుగులకు పెంచడమే ప్రాజెక్టు పరిధికి నిదర్శనం. కోవిడ్ మహమ్మారికి సంబంధించిన ఆంక్షలు అమలులో ఉన్నప్పటికీ ఈ ప్రాజెక్టును నిర్ణీత సమయంలోనే పూర్తి చేశారు.
వారణాసి పర్యటనలో భాగంగా ప్రధానమంత్రి 13వ తేదీ మధ్యాహ్నం 12 గంటల సమయంలో కాలభైరవ ఆలయాన్ని సందర్శిస్తారు. సాయంత్రం ఆరు గంటలకు రో-రో నావపై నుంచి గంగా హారతిని దర్శిస్తారు. 14వ తేదీ మధ్యాహ్నం 3.30 నిముషాలకు ప్రధానమంత్రి వారణాసిలోని స్వర్వేద్ మహామందిర్ లో సద్గురు సదఫల్ దేవ్ విహంగం యోగ సంస్థాన్ 98వ వార్షికోత్సవ వేడుకల్లో పాల్గొంటారు. ఈ రెండు రోజుల పర్యటనలో భాగంగా బిహార్, నాగాలాండ్ ఉపముఖ్యమంత్రులతో పాటు అస్సాం, అరుణాచల్ ప్రదేశ్, గోవా, హర్యానా, గుజరాత్, హిమాచల్ ప్రదేశ్, కర్ణాటక, మధ్యప్రదేశ్, మణిపూర్, త్రిపుర, ఉత్తరప్రదేశ్, ఉత్తరాఖండ్ ముఖ్యమంత్రుల సమావేశంలో ప్రధానమంత్రి పాల్గొంటారు. టీమ్ ఇండియా స్ఫూర్తిని మరింతగా విస్తరించాలన్న ప్రధానమంత్రి ఆలోచనకు దీటుగా అత్యుత్తమ పాలనా ప్రమాణాల పై అభిప్రాయాలు పంచుకునే అవకాశం ఈ సమావేశం కల్పిస్తుంది.
(Release ID: 1780822)
Visitor Counter : 169
Read this release in:
English
,
Urdu
,
Marathi
,
Hindi
,
Manipuri
,
Bengali
,
Assamese
,
Punjabi
,
Gujarati
,
Odia
,
Tamil
,
Kannada
,
Malayalam