రహదారి రవాణా, హైవేల మంత్రిత్వ శాఖ

జాతీయ రహదారి 334Bని త్వరగా పూర్తి చేయాలని లక్ష్యం

Posted On: 12 DEC 2021 1:16PM by PIB Hyderabad

 

ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ నాయకత్వంలో జాతీయ రహదారులు అపూర్వమైన వేగంతో అభివృద్ధి చెందుతున్నాయని కేంద్ర రోడ్డు రవాణా మరియు రహదారుల శాఖ మంత్రి శ్రీ నితిన్ గడ్కరీ అన్నారు. ప్రాజెక్ట్, జాతీయ ర‌హ‌దారి -334B దాదాపు 93 శాతం మేర పూర్తికావొచ్చింద‌ని,, మూడు నెల‌ల కాలంలో జనవరి 2022లోపు దీనిని పూర్తి చేయాలని లక్ష్యంగా పెట్టుకున్నట్లు ఆయన త‌న వరుస ట్వీట్లలో తెలిపారు. ఉత్త‌ర ప్ర‌దేశ్‌/హర్యానా సరిహద్దు (బాగ్‌పట్) వద్ద ప్రారంభమయ్యే జాతీయ ర‌హ‌దారి-334బీ రోహ్నా వద్ద ముగుస్తుంది, వినియోగదారులు ఢిల్లీ ట్రాఫిక్‌ను దాటవేయడాన్ని నిర్ధారిస్తూ యుపీ నుండి హర్యానా మీదుగా రాజస్థాన్ సరిహద్దు వరకు అతుకులు లేని కనెక్టివిటీని ఇది అందజేస్తుందని ఆయన అన్నారు. NH-334బీ కూడా NH-44ను దాటి చండీగఢ్ మరియు ఢిల్లీకి వెళ్లే ప్రయాణికులకు ప్రత్యక్ష ప్రవేశాన్ని కల్పిస్తుందని మంత్రి తెలియజేశారు.
#ప్రగతికా హైవే #గతిశక్తి

***



(Release ID: 1780743) Visitor Counter : 140