సాంఘిక న్యాయం, మరియు సాధికారత మంత్రిత్వ శాఖ
ఎస్సీ/ ఎస్టీ లపై అత్యాచారాలకు వ్యతిరేకంగా జాతీయ హెల్ప్‌లైన్ సోమవారం ప్రారంభం
షెడ్యూల్డు కులాలు, షెడ్యుల్డు తెగలు (అత్యాచార నిరోధక) చట్టం, 1989 సరైన అమలు లక్ష్యంతో సామాజిక న్యాయం, సాధికారత మంత్రిత్వ శాఖ ఈ హెల్ప్‌లైన్‌ను రూపొందించింది
టోల్ ఫ్రీ నెంబరు 14566పై ఇరవైనాలుగు గంటలు అందుబాటులో ఉండనున్న హెల్ప్ లైన్
హిందీ, ఇంగ్లీషు, రాష్ట్రాలు/ యుటిల ప్రాంతీయ భాషలలో అందుబాటులో ఉంటూ, ప్రతి ఫిర్యాదును ఎఫ్ఐఆర్‌గా నమోదు చేసేలా హామీ ఇస్తుంది.
Posted On:
12 DEC 2021 1:53PM by PIB Hyderabad
షెడ్యూల్డు కులాలు, షెడ్యూల్డు తెగల (అత్యాచార నిరోధక) చట్టం, 1989(పిఒఎ) సరైన అమలును నిర్ధారించే లక్ష్యంతో 13 డిసెంబర్ 2021న అత్యాచారాలకు వ్యతిరేకంగా జాతీయ హెల్ప్ లైన్‌ను (ఎన్‌హెచ్ఎఎ) సామాజిక న్యాయం, సాధికారత మంత్రిత్వ శాఖ ప్రారంభించనుంది. షెడ్యూల్డు కులాలు (ఎస్సీలు), షెడ్యూల్డు తెగల (ఎస్టీలు)పై అత్యాచారాలను నిరోధించాలన్న లక్ష్యాన్ని దృష్టిలో ఉంచుకుని దీనిని రూపొందించారు.
దేశవ్యాప్తంగా 14566 అన్న టోల్ ఫ్రీ నెంబర్ పై ఇరవై నాలుగు గంటలూ ఎన్‌హెచ్ఎఎ అందుబాటులో ఉంటుంది. దేశవ్యాప్తంగా ఉన్నఏ టెలికాం ఆపరేటర్‌కు చెందిన మొబైల్ లేదా ల్యాండ్ లైన్ నుంచి వాయిస్ కాల్/ వఇఒఐపి చేయడం ద్వారం వీరిని సంప్రదించవచ్చు. ఈ సేవ హిందీ, ఇంగ్లీషుతో పాటుగా రాష్ట్రాలు/ కేంద్రపాలిత ప్రాంతాలకు చెందిన ప్రాంతీయ భాషలలో అందుబాటులో ఉంటుంది. దీని మొబైల్ అప్లికేషన్ కూడా త్వరలో అందుబాటులోకి రానుంది.
వివక్షను అంతం చేసి, అందరికీ రక్షణ కల్పించే లక్ష్యంతో చేసిన చట్టంలోని అంశాల గురించి అవగాహనను కల్పించడం హెల్ప్ లైన్ ఉద్దేశ్యం. ప్రతి ఫిర్యాదును ఎఫ్ఐఆర్‌గా నమోదు చేసుకొని, ఉపశమనాన్ని కల్పించడం, నమోదు చేసుకున్న అన్ని ఫిర్యాదులను దర్యాప్తు చేసి, శిక్షల కోసం చార్జిషీట్లను ఫైల్ చేయడం సహా అన్ని పనులను చట్టంలో పేర్కొన్న నిర్ధిష్ట కాలపరిమితికి అనుగుణంగా జరిగేలా వ్యవస్థ చూస్తుంది.
సెల్ప్ సర్వీస్ పోర్టల్‌గా కూడా అందుబాటులో ఉన్న ఎన్‌హెచ్ఎఎ పౌర హక్కుల రక్షణ చట్టం (పిసిఆర్) చట్టం, 1955 గురించి కూడా అవగాహనను కల్పిస్తుంది.
పిఒఎ చట్టం, 1989ని, పిసిఆర్ చట్టం, 1955ను ఉల్లంఘించారంటూ బాధితులు/ ఫిర్యాదుదారు/ ఎన్జీల నుంచి అందుకున్న ఫిర్యాదులకు ఒక డాకెట్ నెంబర్‌ను ఇవ్వడం జరుగుతుంది. ఇచ్చిన ఫిర్యాదు స్థితిగతులను ఫిర్యాదుదారు/ ఎన్జీఓ ఆన్‌లైన్ లో ట్రాక్ చేయవచ్చు.
ఎటువంటి అనుమానికి అయినా ఐవిఆర్ లేదా ఆపరేటర్లు హిందీ, ఇంగ్లీషు, ప్రాంతీయ భాషలలో సమాధానం ఇచ్చి దానిని తీరుస్తారు.
ఈ హెల్ప్‌లైన్ ఒకచోట సంప్రదించడం అనే భావనను అనుసరించి, సరైన ఫీడ్ బ్యాక్ వ్యవస్థను కలిగి ఉంటుంది.
***
(Release ID: 1780655)
Visitor Counter : 259