రక్షణ మంత్రిత్వ శాఖ
విజయవంతమైన పినాక ఎక్స్‌టెండెడ్ రేంజ్ సిస్టమ్, ఏరియా డినియల్ మ్యూనిషన్స్ , స్వదేశీంగా అభివృద్ధి చేసిన ప్రాక్సిమిటీ ఫ్యూజ్‌ల పరీక్షలు
Posted On:
11 DEC 2021 11:17AM by PIB Hyderabad
వివిధ పరీక్షా కేంద్రాలలో పినాకా ఎక్స్‌టెండెడ్ రేంజ్ (పినాకా-ఈఆర్), ఏరియా డినియల్ మ్యూనిషన్స్ (ఏడీఎం) మరియు స్వదేశంలో అభివృద్ధి చేసిన ప్రాక్సిమిటీ ఫ్యూజ్‌ల పని తీరుపై నిర్వహించిన పరీక్షలు విజయవంతమయ్యాయి. పోఖరన్ రేంజ్ లో పినాకా-ఈఆర్ మల్టీ బ్యారెల్ రాకెట్ లాంచర్ సిస్టమ్‌ను విజయవంతంగా పరీక్షించారు. ఈ వ్యవస్థను పూణే కేంద్రంగా పనిచేస్తున్న ఆర్మమెంట్ రీసెర్చ్అండ్ డెవలప్‌మెంట్ ఎస్టాబ్లిష్‌మెంట్, హై ఎనర్జీ మెటీరియల్స్ రీసెర్చ్ లాబొరేటరీ , రక్షణ పరిశోధన అభివృద్ధి సంస్థ (డిఆర్‌డిఒ) సంయుక్తంగా అభివృద్ధి చేశాయి.
అభివృద్ధి చేసిన పినాకా సామర్ధ్యాన్ని విజయవంతంగా పరీక్షించిన డిఆర్‌డిఒ దీని సాంకేతికతను పరిశ్రమకు బదిలీ చేసింది. ఉత్పత్తి, నాణ్యతా ప్రమాణాల సమయంలో డిఆర్‌డిఒ సహకారంతో పరిశ్రమ పినాక ఎంకే -2 రాకెట్‌ల సామర్ధ్యాన్ని మరింత అభివృద్ధి చేసింది. సాంకేతిక బదిలీ సమయంలో కుదిరిన ఒప్పందం ప్రకారం పరిశ్రమ అభివృద్ధి చేసిన రాకెట్‌ల పనితీరును పరీక్షించి, వాటి నాణ్యతను నిర్ధారించడం జరిగింది. పెద్ద సంఖ్యలో రాకెట్‌లను ఉత్పత్తి చేయడానికి, నాణ్యతను పరీక్షించివాటిని ప్రయోగించడానికి అవసరమైన సహాయ సహకారాలను డిఆర్‌డిఒ, వ్యవస్థ కోసం ఏర్పాటైన నాణ్యతా నిర్ధారణ సంస్థలు అందజేశాయి.
అనుమతి పొందిన పరిశ్రమలు ఉత్పత్తి చేసిన రాకెట్‌ల సామర్ధ్యం, పనితీరును గత మూడు రోజులుగా పదాతి దళం సహకారంతో డిఆర్‌డిఒ ఫీల్డ్ ఫైరింగ్ కేంద్రాల్లో నిర్వహించింది. దూరంలోని లక్ష్యాలను ఛేదించడం . ఆయుధాలను మోసుకుని వెళ్లడం లాంటి అంశాలలో అభివృద్ధి చేసిన పినాక రాకెట్‌లను డిఆర్‌డిఒ పరీక్షించింది. ఖచ్చితత్వం మరియు స్థిరత్వం లక్ష్యాలను ఏమేరకు సాధించగలవన్న అంశాన్ని పరీక్షించడానికి డిఆర్‌డిఒ 24 రాకెట్‌లను పరీక్షించింది. ఈ పరీక్షతో భాగస్వామ్య పరిశ్రమ వర్గాలకు పినాకా- ఈఆర్ సాంకేతిక బదిలీ ప్రాథమిక దశ పూర్తి అయ్యింది. సాంకేతిక బదిలీ పొందిన పరిశ్రమ ఈ శ్రేణి రాకెట్ వ్యవస్థ ఉత్పత్తి ప్రారంభించగలుగుతుంది.
గత పది సంవత్సరాలుగా భారత సైన్యం వినియోగిస్తున్న పినాకా వ్యవస్థను అభివృద్ధి చేసి పినాకా-ఈఆర్ వ్యవస్థకు రూపకల్పన చేయడం జరిగింది. మారుతున్న అవసరాలకు అనుగుణంగా అధునాతన సాంకేతికతతో పినాకా-ఈఆర్ వ్యవస్థ సిద్దమయ్యింది.
పినాకా కోసం ఏరియా డినియల్ మ్యూనిషన్ మందుగుండు సామాగ్రి రూపాంతరాలను పూణే కు చెందిన ఆర్మమెంట్ రీసెర్చ్అండ్ డెవలప్‌మెంట్ ఎస్టాబ్లిష్‌మెంట్ అభివృద్ధి చేసింది. సాంకేతిక బదిలీ పై జరిగిన ఒప్పందంలో భాగంగా వీటిని పరిశ్రమ ఉత్పత్తి చేసింది. దీనిని పోఖ్రాన్ ఫీల్డ్ ఫైరింగ్ రేంజ్‌లో పరీక్షించారు. సాంకేతిక బదిలీ కింద జరిగిన ఉత్పత్తుల సామర్థ్యాన్ని పరీక్షించడానికి ఈ పరీక్షలను నిర్వహించారు.
స్వదేశంలో అభివృద్ధి చేసిన ప్రాక్సిమిటీ ఫ్యూజ్‌ల సామర్ధ్య పరీక్షలను కూడా నిర్వహించారు. పినాక రాకెట్ వ్యవస్థలో ఉపయోగించే వివిధ ఫ్యూజులను పూణే కు చెందిన ఆర్మమెంట్ రీసెర్చ్అండ్ డెవలప్‌మెంట్ ఎస్టాబ్లిష్‌మెంట్ అభివృద్ధి చేసింది. తొలుత వీటి రూపకల్పన పరీక్షలను నిర్వహించడం జరిగింది. వీటి సామర్థ్యం పరీక్షలు విమానంలో జరిగాయి. విమానం ద్వారా నిర్వహించిన సామర్ధ్య పరీక్షలు విజయవంతం అయ్యాయి.
దేశంలోనే తొలిసారిగా ప్రత్యేకంగా చేపట్టిన పరిశోధన, అభివృద్ధి కార్యక్రమాల ద్వారా ఈ వ్యవస్థలను అభివృద్ధి చేశారు. దేశీయంగా అభివృద్ధి చేయబడిన ఫ్యూజ్‌లు దిగుమతి చేసుకున్న ఫ్యూజ్‌ల స్థానంలో ఉపయోగిస్తారు. దీనివల్ల విలువైన విదేశీ మారకద్రవ్యం ఆదా అవుతుంది. ఏడీఎం ల కోసం ఆర్మమెంట్ రీసెర్చ్అండ్ డెవలప్‌మెంట్ ఎస్టాబ్లిష్‌మెంట్ సూక్ష్మీకరించిన ఫ్యూజ్‌లను రూపొందించింది. డ్యూయల్-పర్పస్ డైరెక్ట్-యాక్షన్ సెల్ఫ్ డిస్ట్రక్షన్ , యాంటీ-ట్యాంక్ మ్యూనిషన్ ఫ్యూజ్‌ల పనితీరు ప్రస్తుత పరీక్షల్లో విశ్లేషించారు. అన్ని పరీక్షలు విజయవంతం అయ్యాయి.
***
(Release ID: 1780573)
Visitor Counter : 215