నీతి ఆయోగ్
azadi ka amrit mahotsav

భారత దేశంలోని ద్వితీయ, తృతీయ స్థాయి కేంద్రాలు, జిల్లా ఆసుపత్రులలో అత్యవసర, గాయం సంరక్షణ యొక్క దేశ-స్థాయి ప‌రిస్థితుల‌పై నీతి ఆయోగ్ నివేదిక విడుద‌ల‌

Posted On: 10 DEC 2021 1:42PM by PIB Hyderabad

నీతి ఆయోగ్ ఈరోజు రెండు సమగ్ర నివేదికను విడుదల చేసింది. భారత దేశంలోని  ద్వితీయ,  తృతీయ స్థాయి మరియు జిల్లా స్థాయిలో అత్యవసర చికిత్స సంర‌క్ష‌ణ, మరియు గాయం సంరక్షణపై ప్రస్తుత స్థితుల‌పై ఈ నివేదికల‌ను విడుద‌ల చేసింది.  ఈ నివేదికలు అత్యవసర కేసుల స్పెక్ట్రమ్‌ను, లోడ్‌ను వెలుగులోకి తెచ్చింది. దాని ప్రాధాన్య‌త‌ను వెలుగులోకి తెచ్చింది. దేశంలో అంబులెన్స్ సేవలు, ఆరోగ్య మౌలిక సదుపాయాలు, మానవ వనరులు, సరైన సంరక్షణను అందించడంలో పరికరాలు త‌దిత‌రాల విష‌యంలో ఉన్న ప్ర‌భ‌ల‌మైన ఖాళీల‌ను ఇది వెలుగులోకి తెచ్చింది. నీతి ఆయోగ్ గౌరవ సభ్యుడు (ఆరోగ్యం) డాక్టర్ వి.కె. పాల్, అడిషనల్ సెక్రటరీ డాక్టర్ రాకేశ్ సర్వాల్, ఇతర ప్రముఖుల సమక్షంలో ఈ నివేదికల‌ను ఆవిష్క‌రించారు. ఈ అధ్యయనాలను ఎమర్జెన్సీ మెడిసిన్ విభాగం, జేపీఎన్ఏటీసీ, న్యూఢిల్లీ ఎయిమ్స్‌లు నీతి ఆయోగ్ వారి స‌హ‌కారంతో నిర్వ‌హించింది. నీతి ఆయోగ్‌
సభ్యుడు డాక్టర్ వీకే పాల్ నివేదిక ముందుమాటను అందించారు. ప్రపంచ స్థాయి, సమర్థవంతమైన, వృత్తిపరమైన,  సమగ్ర అత్యవసర-సంరక్షణ వ్యవస్థను రూపొందించే దిశగా భారతదేశం ప్రారంభించాల్సిన అసాధారణ ప్రాముఖ్యతను నివేదిక హైలైట్ చేసింది అని అన్నారు. దేశంలోని ఏ ప్రాంతంలోనైనా ప్రమాదం, అత్యవసర లేదా గాయం సంభవించిన బాధితుల సంరక్షణ కోసం
ఇది త‌గిన సాంకేతికత ద్వారా ప్రారంభించబడింది. దేశ వ్య‌ప్తంగా నిర్వ‌హించిన ఈ అధ్యయనంలో మూల్యాంకనం ఈ చర్చలకు కీలకమైన ప్రారంభ బిందువుగా నిలుస్తుంద‌ని  సూచించారు. కరోనరీ సిండ్రోమ్, స్ట్రోక్, శ్వాసకోశ వ్యాధులు, ప్రసూతి,పీడియాట్రిక్ ఎమర్జెన్సీలు, గాయాలతో బాధపడుతున్న రోగులకు కావాల్సిన‌ వ్యవస్థలను రూపొందించాల్సిన ఆవశ్యకతను న్యూఢిల్లీలోని ఎయిమ్స్  డైరెక్టర్ డాక్టర్ రణదీప్ గులేరియా నివేదిక‌లో నొక్కిచెప్పారు. ఇవి భారతదేశంలో మరణాలు మరియు వైకల్యాలకు ప్రధాన కారణాలను సూచిస్తాయ‌న్నారు. ఈ అధ్యయనాన్ని 34 జిల్లా ఆసుపత్రులతో పాటు భారతదేశంలోని 28 రాష్ట్రాలు మరియు 2 కేంద్ర పాలిత ప్రాంతాలలో ప్రభుత్వ, ప్రైవేట్ హాస్పిటల్ సెట్టింగ్‌లలో 100 అత్యవసర మరియు గాయం సంరక్షణ కేంద్రాల ప్రస్తుత స్థితిని ప‌రిగ‌ణ‌న‌లోకి తీసుకొంటూ అంచనాలు వేయ‌డ‌మైంది. అంబులెన్స్ సేవలు, మౌలిక సదుపాయాలు, మానవ వనరులు, పరికరాల స్థితి, అవసరమైన మందులు, క‌చ్చితమైన సంరక్షణ మరియు వివిధ వ్యాధుల భారం వంటి అత్యవసర సంరక్షణ యొక్క అన్ని డొమైన్‌లలో ఇప్పటికే ఉన్న ఖాళీలను, ఈ వివరణాత్మకమైన  విశ్లేషణ నివేదికలో సమర్పించబడింది. దీనికి తోడు అక్రిడిటేషన్, కొనసాగుతున్న అకడమిక్ ప్రోగ్రామ్ ఉనికి మరియు సంస్థ రకానికి సంబంధించి సంరక్షణ, గ్రాన్యులర్ అసెస్‌మెంట్ యొక్క ప్రత్యక్ష పరిశీలనలను ఈ నివేదికలో చేర్చ‌బడ్డాయి. ఈ నివేదిక దేశవ్యాప్తంగా చికిత్సా విధానం, సంరక్షణ కోసం ప్రామాణికమైన ప్రోటోకాల్‌లు, ప్రభావవంతమైన పారామెడిక్స్, బ్లడ్ బ్యాంక్‌ల విస్తరణతో స‌హా ప్రపంచ స్థాయి అంబులెన్స్ సేవలను పెంచాల్సిన అవసరాన్ని హైలైట్ చేస్తుంది. అధ్యయనం చేసిన కేంద్రాలలో, గుర్తింపు పొందినవి మరియు కొనసాగుతున్న విద్యా కార్యక్రమాలను కలిగి ఉన్నవి మెరుగైన పనితీరును కనబరిచాయి, ఈ చర్యలు అమలులో ఉండవలసిన అవసరాన్ని నొక్కిచెప్పాయి. అత్యవసర సంరక్షణ యొక్క ప్రకృతి దృశ్యం తీవ్రమైన అనారోగ్యం, గాయపడిన రోగులకు సకాలంలో యాక్సెస్, అక్యూట్ కేర్ డెలివరీని కలిగి ఉంటుంది. అకాల మరణం, వైకల్యం అడ్జస్టెడ్ లైఫ్ ఇయర్స్ (డీఏఎల్‌వైఎస్‌) నిశ్చయాత్మక సంరక్షణతో బలమైన ఇంటిగ్రేటెడ్ ఎమర్జెన్సీ కేర్ సిస్టమ్‌ను ఏర్పాటు చేయడం ద్వారా నిరోధించవచ్చ‌ని ఈ నివేదిక తెలిపింది. ఈ అధ్యయనం యొక్క ఫలితాలు భారతదేశంలోని ఆరోగ్య సంరక్షణ సౌకర్యాల యొక్క అన్ని స్థాయిలలో అత్యవసర సంరక్షణ సేవలను మెరుగుపరచడానికి, బలోపేతం చేయడానికి పాలసీ ఇన్‌పుట్‌లను అందిస్తాయి.
పూర్తి నివేదికలను ఈ కింది లింక్‌ల ద్వారా యాక్సెస్ చేయవచ్చు -

https://www.niti.gov.in/sites/default/files/2021-12/AIIMS_STUDY_1.pdf

https://www.niti.gov.in/sites/default/files/2021-12/AIIMS_STUDY_2_0.pdf

***


(Release ID: 1780515) Visitor Counter : 209