రైల్వే మంత్రిత్వ శాఖ

భార‌తీయ రైల్వేల ఆధునీక‌ర‌ణ‌


2021 న‌వంబ‌ర్ నాటికి 575 జంట రైళ్ల‌ను లింకె హాఫ్‌మాన్ బుష్ ( ఎల్ హెచ్ బి) కోచ్ ల‌తో మార్పిడి
అత్య‌ధునాత‌న వందేభార‌త్ కోచ్‌ల త‌యారీ

హ‌మ్‌స‌ఫ‌ర్‌, తేజ‌స్‌, అంత్యోద‌య‌, ఉత్కృష్ట్ డ‌బుల్ డెక‌ర్ ఎయిర్ కండిష‌న్డ్ యాత్రి ( ఉద‌య్‌, మ‌హామ‌న‌, దీన్ ద‌యాల్ , విస్తాడోమ్ వంటి మెరుగైన స‌దుపాయాలు క‌ల కోచ్‌ల‌ను ప్ర‌వేశ‌పెడుతున్న రైల్వే

Posted On: 10 DEC 2021 3:08PM by PIB Hyderabad

భార‌తీయ రైల్వే ఆధునీక‌ర‌ణ ప్ర‌య‌త్నాల‌లో భాగంగా సంప్ర‌దాయ ఇంటిగ్రిల్ కోచ్ ఫ్యాక్ట‌రీ (ఐసిఎఫ్‌) త‌ర‌హా కోచ్‌ల స్థానంలో లింకె హోఫిమాన్ బుష్ (ఎల్‌హెచ్‌బి) కోచ్‌ల‌ను న‌డ‌పనుంది. ఇవి సాంకేతికంగా అత్యంత అధునాత‌న‌మైన‌వి, భ‌ద్ర‌త‌, ప్ర‌యాణ స‌దుపాయాల విష‌యంలో మెరుగైన‌వి.
ఈ దిశ‌గా భార‌తీయ రైల్వే 2018 నుంచి లింకె హాఫ్ మాన్ బుష్ ( ఎల్ హెచ్ బి)  కోచ్ ల‌ను త‌యారు చేస్తున్న‌ది. 2021 నవంబ‌ర్ వ‌ర‌కు 575 జంట రైళ్ల‌ను లింకె హాఫ్ మాన్ బుష్ ( ఎల్ హెచ్ బి ) కోచ్ ల‌తో మార్పు చేయ‌నుంది.

ఇంటిగ్ర‌ల కోచ్ ఫ్యాక్ట‌రీ (ఐసిఎఫ్‌) కోచ్‌లు లింకె హాఫ్‌మాన్ బుష్ (ఎల్‌హెచ్‌బి) కోచ్‌లుగా మార్చే ప్ర‌క్రియ కోచ్ ల అందుబాటు, నిర్వ‌హ‌ణ వెసులుబాటు వంటి వాటిని దృష్టిలో పెట్టుకుని మార్చ‌డం జ‌రుగుతుంది. దీనికి తోడు,  అత్య‌ధునాత‌న వందే భార‌త్ కోచ్ ల‌ను త‌యారు చేయ‌డం జ‌రుగుతోంది.  వీటిని జంట రైళ్లుగా ప్ర‌వేశ పెట్ట‌డం జ‌రుగుతోంది.  హ‌మ్‌స‌ఫ‌ర్ ,తేజ‌స్‌, అత్యొంద‌య‌, ఉత్కృష్ట్ డ‌బుల్ డెక‌ర్ ఎయిర్ కండిష‌న్డ్ యాత్రి ( ఉద‌య్‌), మ‌హామ‌న‌, దీన్ ద‌యాళు , విస్తాడోమ్ వంటివి  భార‌తీయ రైల్వేల‌లో ప్ర‌వేశ‌పెట్ట‌నున్నారు. అయితే భార‌తీయ రైల్వే రైలు స‌ర్వీసుల‌ను లేదా కోచ్ ల మార్పును కానీ రాష్ట్రాల వారీ ప్రాతిప‌దిక‌న చేప‌ట్ట‌దు. ఈ స‌మాచారాన్ని కేంద్ర రైల్వే, క‌మ్యూనికేష‌న్లు, ఎల‌క్ట్రానిఇక్స్‌, ఇన్ఫ‌ర్మేష‌న్ టెక్నాల‌జీ శాఖ మంత్రి శ్రీ అశ్విని వైష్ణ‌వ్ రాజ్య‌స‌భ‌లో ఒక లిఖిత పూర్వ‌క స‌మాధానంలో తెలిపారు.

***



(Release ID: 1780506) Visitor Counter : 116