రహదారి రవాణా, హైవేల మంత్రిత్వ శాఖ
ఎలక్ట్రిక్ వాహనాల వినియోగం
Posted On:
08 DEC 2021 3:02PM by PIB Hyderabad
దేశంలో ఎలక్ట్రిక్/హైబ్రిడ్ వాహనాల (ఎక్స్ఈవి) వాడకాన్ని ప్రోత్సహించడానికి, శిలాజేంధనంపై ఆధారపడటాన్ని తగ్గించే లక్ష్యంతో 2015లో ఫాస్టర్ అడాప్షన్ అండ్ మ్యానుఫ్యాక్చరింగ్ ఆఫ్ ఇండియా (ఫేమ్ ఇండియా) అనే పథకాన్ని భారీ పరిశ్రమల మంత్రిత్వ శాఖ రూపొందించింది.ప్రస్తుతం, ఫేమ్ ఇండియా స్కీమ్ యొక్క రెండో దశ 01 ఏప్రిల్, 2019 నుండి 5 సంవత్సరాల పాటు మొత్తం ఇందుకు రూ. 10,000 కోట్ల బడ్జెట్ కేటాయించారు.
ఎలక్ట్రిక్ వాహనాలపై జిఎస్టి 12% నుండి 5%కి తగ్గించారు ; ఎలక్ట్రిక్ వాహనాల ఛార్జర్లు/ఛార్జింగ్ స్టేషన్లపై జీఎస్టీని 18% నుంచి 5%కి తగ్గించారు.
ప్రభుత్వం, అక్టోబర్ 18, 2018 నాటి 5333(ఈ) ఉత్తర్వుల్లో బ్యాటరీ ఆధారిత రవాణా వాహనాలు, ఇథనాల్, మిథనాల్ ఇంధనాలతో నడిచే ట్రాన్స్‌పోర్ట్ వెహికల్స్‌కు పర్మిట్ అవసరాల నుండి మినహాయింపును మంజూరు చేసింది. 2 ఆగస్టు, 2021 నాటి జిఎస్ఆర్ 525(ఈ) ఉత్తర్వులు ప్రకారం ప్రభుత్వం రిజిస్ట్రేషన్ సర్టిఫికేట్ జారీ లేదా పునరుద్ధరణ, కొత్త రిజిస్ట్రేషన్ గుర్తును కేటాయించడం కోసం బ్యాటరీతో నడిచే వాహనాలకు రుసుము చెల్లింపు నుండి మినహాయింపు ఇచ్చింది.
రోడ్డు రవాణా, రహదారుల మంత్రిత్వ శాఖ 2019లో సవరించిన విధంగా మోటారు వాహనాల చట్టం, 1988లోని సెక్షన్ 93 కింద మోటార్ వెహికల్ అగ్రిగేటర్ మార్గదర్శకాలు 2020ని జారీ చేసింది. మార్గదర్శకాల ప్రకారం, రాష్ట్ర ప్రభుత్వాలు ఎలక్ట్రిక్/ప్రత్యామ్నాయ ఇంధన ఆధారిత వాహనాల నిర్వహణను సులభతరం చేయాలి.
రాష్ట్రాల వారీగా ఎలక్ట్రిక్ వాహనాల వివారాలు ఇక్కడ పొందుపరచడం జరిగింది.
రాష్ట్రం
|
మొత్తం
|
అండమాన్ నికోబర్ దీవులు
|
158
|
అరుణాచల్ ప్రదేశ్
|
20
|
అస్సాం
|
43,057
|
బీహార్
|
58,014
|
చండీగఢ్
|
1,768
|
ఛత్తీస్గఢ్
|
11,881
|
ఢిల్లీ
|
125,347
|
గోవా
|
1,312
|
గుజరాత్
|
13,063
|
హర్యానా
|
24,206
|
హిమాచల్ ప్రదేశ్
|
615
|
జమ్మూ-కాశ్మీర్
|
1,321
|
ఝార్ఖండ్
|
10,954
|
కర్ణాటక
|
72,544
|
కేరళ
|
11,959
|
లడఖ్
|
6
|
మహారాష్ట్ర
|
52,506
|
మణిపూర్
|
519
|
మేఘాలయ
|
33
|
మిజోరాం
|
19
|
నాగాలాండ్
|
53
|
ఒడిశా
|
9,887
|
పుదుచ్చేరి
|
1,386
|
పంజాబ్
|
8,069
|
రాజస్థాన్
|
46,862
|
సిక్కిం
|
23
|
తమిళ నాడు
|
44,817
|
త్రిపుర
|
7,103
|
దాద్రా నగర్ హవేలీ, డయ్యు దమన్ కేంద్రపాలిత ప్రాంతాలు
|
127
|
ఉత్తరాఖండ్
|
23,428
|
ఉత్తర్ ప్రదేశ్
|
255,700
|
పశ్చిమ బెంగాల్
|
43,384
|
మొత్తం
|
870,141
|
|
గమనిక: కేంద్రీయ వాహన్ 4 కింద ఉన్న డిజిటల్ రికార్డుల ఆధారంగా వివరాలు ఇవి.
|
కేంద్రీయ వాహన్ 4 వ్యవస్థలో లేని ఆంధ్రప్రదేశ్, మధ్యప్రదేశ్, తెలంగాణ, లక్షద్వీప్ వివరాలు ఇక్కడ పొందుపరచలేదు
ఈ సమాచారాన్ని కేంద్ర రోడ్డు రవాణా మరియు రహదారుల శాఖ మంత్రి శ్రీ నితిన్ గడ్కరీ రాజ్యసభలో లిఖితపూర్వక సమాధానంలో తెలిపారు.
****
(Release ID: 1779675)