ఆరోగ్య, కుటుంబ సంక్షేమ‌ మంత్రిత్వ శాఖ

18 ఏళ్ల లోపు వయసు పిల్లలకు వాక్సినేషన్ కార్యక్రమం

Posted On: 07 DEC 2021 3:51PM by PIB Hyderabad

కోవిడ్ వ్యాక్సిన్ పై నేషనల్ ఎక్స్‌పర్ట్ గ్రూప్ (ఎన్ఈజివిఏసి), నేషనల్ టెక్నికల్ అడ్వైజరీ గ్రూప్ ఆన్ ఇమ్యునైజేషన్ (ఎన్టిఏజిఐ) 18 సంవత్సరాల కంటే తక్కువ వయస్సు ఉన్న లబ్ధిదారులకు టీకాలు వేయడానికి సంబంధించిన శాస్త్రీయ ఆధారాలను పరిశీలిస్తున్నాయి.  ఎన్ఈజివిఏసి సిఫార్సు చేసే ప్రాధాన్యత కలిగిన లబ్ధిదారులకు వాక్సిన్ వేయడం కోసం రాష్ట్రాలు/యుటి లకు అయ్యే ఖర్చు కేంద్ర ప్రభుత్వం కోవిడ్-19 వ్యాక్సిన్‌లను ఉచితంగా సరఫరా చేస్తోంది. 

కాడిలా హెల్త్‌కేర్ తయారు చేసిన జికోవ్-డి వ్యాక్సిన్ కి ఆమోదం లభించింది.  ఇందు కోసం దేశంలో రెండు, మూడు దశల లో క్లినికల్ ట్రయల్ నిర్వహించారు. ఈ తాత్కాలిక డేటా ఆధారంగా 12 ఏళ్లు, అంతకంటే ఎక్కువ వయస్సు ఉన్నవారికి నేషనల్ రెగ్యులేటర్ అంటే డ్రగ్ కంట్రోలర్ జనరల్ ఆఫ్ ఇండియా (డిసిజిఐ) ద్వారా అత్యవసర సెట్టింగ్‌లో పరిమితం వినియోగం కోసం ఆమోదం పొందింది.

కింది పేర్కొన్న కోవిడ్-19 వ్యాక్సిన్‌లు దేశంలో 18 సంవత్సరాల కంటే తక్కువ వయస్సు గల వారికి క్లినికల్ ట్రయల్స్‌లో ఉన్నాయి:

i.      భారత్ బయోటిక్ తన కొవాక్సిన్ ను రెండు, మూడు దశల్లో 2 నుండి 18 ఏళ్ల వయసు గల ఆరోగ్యవంతంగా ఉన్న వాలంటీర్ల పై క్లినికల్ ట్రయల్ చేసింది. దీనికి సంబంధించిన భద్రత, రోగనిరోధక శక్తి డాటాను జాతీయ నియంత్రణ సంస్థకు సమర్పించింది. 

ii.   సీరం ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ ఇండియా నానోపార్టికల్ వ్యాక్సిన్ (లిక్విడ్) (కోవోవాక్స్) II/III క్లినికల్ ట్రయల్‌ని 2 నుండి 17 సంవత్సరాల వయస్సు గల వారికి 920 సబ్జెక్టులలో నిర్వహిస్తోంది.

iii.    బయోలాజికల్ ఈ లిమిటెడ్  5 నుండి 18 సంవత్సరాల వయస్సు గల 624 మంది వ్యక్తులలో సార్స్ కోవ్-2 జన్యువు ఆర్బిడి దశ II/III క్లినికల్ ట్రయల్‌ని నిర్వహిస్తోంది.

iv.    జాన్సన్ & జాన్సన్ ప్రై. లిమిటెడ్, 12-17 సంవత్సరాల వయస్సు వారికీ  Ad.26COV.2S వ్యాక్సిన్ II/III దశలకు క్లినికల్ ట్రయల్‌ను నిర్వహిస్తోంది (క్లినికల్ ట్రయల్ సైట్‌లలో భారతదేశం ఒకటిగా ఉన్న గ్లోబల్ క్లినికల్ ట్రయల్)

పైన పేర్కొన్న కోవిడ్-19 వ్యాక్సిన్‌ల ఆమోదం క్లినికల్ ట్రయల్స్‌ను విజయవంతంగా పూర్తి చేయడం మరియు డ్రగ్స్ అండ్ కాస్మెటిక్స్  చట్టం, 1940 కింద కొత్త డ్రగ్స్ అండ్ క్లినికల్ ట్రయల్స్ రూల్స్, 2019 అవసరాల ప్రకారం నేషనల్ రెగ్యులేటర్ అంటే డ్రగ్ కంట్రోలర్ జనరల్ ఆఫ్ ఇండియాకు అవసరమైన డేటాను సమర్పించడంపై ఆధారపడి ఉంటుంది. 
 

కేంద్ర ఆరోగ్య, కుటుంబ సంక్షేమ శాఖ సహాయ మంత్రి డాక్టర్ భారతి ప్రవీణ్ పవార్ ఈరోజు రాజ్యసభలో లిఖితపూర్వక సమాధానంలో ఈ విషయాన్ని తెలిపారు.

 

****(Release ID: 1779145) Visitor Counter : 167