ఆర్థిక మంత్రిత్వ శాఖ

మొత్తం పెట్టుబడి వాతావరణం గురించి చర్చించడానికి, రాష్ట్రాల ముఖ్యమంత్రులు, ఆర్థిక మంత్రులు, కేంద్ర పాలిత ప్రాంతాల లెఫ్టినెంట్ గవర్నర్లతో సమావేశమైన - కేంద్ర ఆర్థిక మంత్రి శ్రీమతి నిర్మలా సీతారామన్

Posted On: 06 DEC 2021 5:36PM by PIB Hyderabad

కోవిడ్ మహమ్మారి తర్వాత దేశంలో పెట్టుబడి వాతావరణాన్ని పెంపొందించే ఉద్దేశ్యంతో, కేంద్ర ఆర్థిక, కార్పొరేట్ వ్యవహారాల శాఖ మంత్రి శ్రీమతి నిర్మలా సీతారామన్,  రాష్ట్రాల ముఖ్యమంత్రులు, ఆర్థిక మంత్రులు, కేంద్ర పాలిత ప్రాంతాల లెఫ్టినెంట్ గవర్నర్లతో 2021 నవంబర్, 15వ తేదీన సమావేశమయ్యారు. 

కేంద్ర ఆర్థిక శాఖ సహాయ మంత్రి శ్రీ పంకజ్ చౌదరి ఈ రోజు లోక్‌సభలో ఒక ప్రశ్నకు లిఖితపూర్వకంగా సమర్పించిన సమాధానంలో ఈ సమాచారాన్ని పొందుపరిచారు. 

మూలధన వ్యయాన్ని పెంచి, మౌలిక సదుపాయాలతో పాటు, పెట్టుబడి ఆధారిత వృద్ధిని పెంపొందించడం కోసం, భారత ప్రభుత్వం, ఖచ్చితమైన చర్యలు తీసుకుందని మంత్రి పేర్కొన్నారు.  ఇది ఉపాధి అవకాశాలు, మార్కెట్, మెటీరియల్‌ కు ప్రాప్యత, మెరుగైన జీవన నాణ్యత, బలహీన వర్గాల సాధికారత కు దారి తీస్తుందని ఆయన చెప్పారు.  రాష్ట్రాల్లో డబ్బులు ఆర్జించదగిన ఆస్తి ఆధారం ఉందన్న విషయం పై కూడా, ఈ సమావేశంలో చర్చించారు.   నూతన మౌలిక సదుపాయాల కల్పన తో పాటు ఇతర సామాజిక రంగ ప్రాధాన్యతల కోసం అందుబాటులో ఉన్న మూలధనాన్ని మెరుగుపరచడానికి వీలుగా పరపతిని పొందడానికి ఇది దోహదపడుతుందని, మంత్రి తెలియజేశారు. 

మరిన్ని వివరాలను తెలియజేస్తూ, పర్యావరణం / అటవీ అనుమతుల పై స్టాండర్డ్ ఆపరేటింగ్ ప్రొసీజర్ అవసరం; రాష్ట్రాలకు పెంపొందించిన అధికారాలు; ఒకే రకమైన తీర ప్రాంత నిబంధనల వ్యవస్థ;   పి.పి.పి. పర్యావరణ వ్యవస్థను బలోపేతం చేయడానికి వీలుగా వివాద పరిష్కార యంత్రాంగాన్ని బలోపేతం చేయడం;  రాష్ట్రాల్లో బ్యాంకింగ్ వ్యవస్థ వ్యాప్తి మరియు క్రెడిట్-డిపాజిట్ నిష్పత్తి లో నెలకొన్న అంతరాలను పరిష్కరించడానికి బ్యాంకింగ్ మౌలిక సదుపాయాలను బలోపేతం చేయడం;  భారతదేశంలోని ఈశాన్య ప్రాంతాల్లోని రాష్ట్రాలకు నిర్దిష్ట వాణిజ్య విధానం అవసరం;   దేశవ్యాప్తంగా వ్యవసాయ-నిర్దిష్ట మౌలిక సదుపాయాల అభివృద్ధి  వంటి మరికొన్ని అంశాలను కూడా రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాలు లేవనెత్తాయని మంత్రి పేర్కొన్నారు. 

వివిధ పరిశ్రమలు, బ్యాంకులు, ఆర్థిక సంస్థల భాగస్వామ్యంతో 2021 నవంబర్, 17 మరియు 18 తేదీల్లో ‘అవరోధాలు లేని రుణ సదుపాయం మరియు ఆర్థికాభివృద్ధి కోసం సమిష్టి వ్యవస్థను ఏర్పాటు చేయడం"  అనే అంశంపై రెండు రోజుల సదస్సు ను నిర్వహించినట్లు కూడా మంత్రి తెలిపారు.  వివిధ రంగాలకు భారీగా రుణ సహాయాన్ని అందించడంతో పాటు, ఆర్థిక వ్యవస్థకు చెందిన ఉత్పాదక రంగాల్లో రుణాలు అందించవలసిన అవసరం గురించి కూడా ఈ సమావేశం చర్చించింది.

 

 

 

*****



(Release ID: 1778762) Visitor Counter : 106