సూక్ష్మ, లఘు, మధ్య తరహా సంస్థల మంత్రిత్వ శాఖష్
ఎంఎస్ఎంఇ లలో ఉద్యోగావకాశాలు
Posted On:
06 DEC 2021 1:26PM by PIB Hyderabad
గణాంకాల మంత్రిత్వశాఖ జరిపిన 73 వ రౌండ్ ఎన్ ఎస్ ఎస్ సర్వే నివేదిక (జులై 2015- జూన్ 2016) ప్రకారం ఎంఎస్ఎంఇ లలో పనిచేసేవారు దాదాపు 11.10 కోట్ల మందిగా అంచనావేశారు. ప్రధానమంత్రి ఉపాధి కల్పన కార్యక్రమం (పీఎంఈజీపీ) కింద సూక్ష్మ వ్యాపారసంస్థలలో 2016-17, 2017-18, 2018-19, 2019-20, 2020-21, 2021-22 (నవంబర్ 15 వరకు) ఉపాధి పొందినవారు 4.08 లక్షలు, 3.87 లక్షలు, 5.87 లక్షలు 5.33 లక్షలు, 5.95 లక్షలు, 2.90 లక్షలు ఉన్నారు.
సూక్ష్మ, చిన్న, మధ్య తరహా పరిశ్రమల మంత్రిత్వశాఖ వివిధ పథకాల అమలు ద్వారా ఉపాధి అవకాశాలు పెంచటానికి కృషి చేస్తుంది. ఇందులో పీఎంఇజీపీ, ఎంఎస్ఇ-క్లస్టర్ అభివృద్ధి పథకం, సంప్రదాయ పరిశ్రమల పునరుద్ధరణ పథక నిధి ఋణ హామీ పథకం, సీజీటీ ఎంఎస్ఇ, నవకల్పనలను ప్రోత్సహించటం, గ్రామీణ వ్యాపార ఔత్సాహికులను ప్రోత్సహించటం ఇందులో ఉంటాయి.
దేశంలో ఎం ఎస్ ఎం ఇ రంగాన్ని ఆదుకునేందుకు, మరీ ముఖ్యంగా కోవిడ్ సంక్షోభ సమయంలో ఆత్మ నిర్భర భారత్ అభియాన్ కింద ప్రభుత్వం అనేక చొరవలు తీసుకుంది. అందులో కొన్ని:
i. ఎంఎస్ఎంఇ ల అప్పుకు మద్దతుగా రూ. 20,000 కోట్లు
ii. ఎంఎస్ఎంఇ లు సహా వ్యాపారానికి హామీ రహిత ఋణాలకోసం రూ. 3 లక్షల కోట్ల ఆటోమేటిక్ రుణాలు
iii. ఎంఎస్ఎంఇ ఫండ్స్ ద్వారా రూ. 50 వేల కోట్ల మేరకు సంస్థలలో వాటా కొనుగోళ్ళ ద్వారా పెట్టుబడి
iv. ఎంఎస్ఎంఇ ల వర్గీకరణకు కొత్త ప్రాతిపదిక
v. వ్యాపారాన్ని సులభతరం చేయటానికి ఉద్యమ్ రిజిస్ట్రేషన్ ద్వారా ఎంఎస్ఎంఇ ల కొత్త రిజిస్ట్రేషన్
vi. ఎంఎస్ఎంఇ లకు సహాయపడేలా 200 కోట్లు లోపు కొనుగోళ్ళకు గ్లోబల్ టెండర్లు పిలవకపోవటం
ఎంఎస్ఎంఇ ల పరపతి హామీ ట్రస్ట్ ఇచ్చిన 2021 నావంబర్ 16 నాటి నివేదిక ప్రకారం రూ. 81.47 కోట్ల మేరకు ఋణ హామీలు ఆమోదం పొందాయి. ఆత్మ నిర్భర్ భారత్ అభియాన్ ప్రకారం అత్యవసర ఋణ హామీ పథకంలో భాగంగా రూ, 2021 నావంబర్ 12 నాటికి రూ. 2.82 లక్షలకోట్లు మంజూరైంది.
కేంద్ర ఎం ఎస్ ఎం ఇ శాఖామంత్రి శ్రీ నారాయణ రాణే ఈ మేరకు ఈ రోజు రాజ్యసభలో ఒక ప్రశ్నకు లిఖిత పూర్వకంగా తెలియజేశారు.
***
(Release ID: 1778472)