ఆర్థిక మంత్రిత్వ శాఖ
పశ్చిమ బెంగాల్ లో సోదాలు నిర్వహించిన ఆదాయం పన్ను శాఖ
Posted On:
06 DEC 2021 11:34AM by PIB Hyderabad
టిఎంటి బార్ల ఉత్పత్తి, నిర్మాణ సామాగ్రి తయారీ తదితర రంగాల్లో కార్యకలాపాలు నిర్వహిస్తున్న కోల్‌కతాకు చెందిన ఒక ప్రముఖ గ్రూప్‌పై ఆదాయం పన్ను శాఖ అధికారులు దాడులు చేసి సోదాలు నిర్వహిస్తోంది. డిసెంబర్ ఒకటవ తేదీన ఆదాయం పన్ను శాఖ అధికారులు ఏకకాలంలో పశ్చిమ బెంగాల్ , ఒడిశా లోని దాదాపు 20 ప్రాంతాల్లో దాడులు చేసి సోదాలు నిర్వహించారు.
వివిధ పద్దతులను అనుసరించి సంస్థ పన్ను ఎగవేత కార్యక్రమాలకు పాల్పడిందని అధికారులు గుర్తించారు. లెక్కల్లో చూపకుండా భారీ మొత్తంలో జరిగిన నగదు చెల్లింపులు, లెక్కల్లో చూపని భారీ అమ్మకాలు, కొనుగోళ్లు, ఉత్పత్తిని తక్కువ చేసి చూపడం లాంటి చట్ట వ్యతిరేక కార్యకపాలకు సంస్థ పాల్పడిందని అధికారులు గుర్తించారు. వీటికి సంబంధించి పత్రాలు, డిజిటల్ సమాచారాన్ని అధికారులు గుర్తించి స్వాధీనం చేసుకున్నారు. సంస్థ అనేక షెల్ కంపెనీలను, కాగితాలకు పరిమితమైన మరికొన్ని కంపెనీలను సృష్టించి వాటి ద్వారా అక్రమ పద్ధతుల్లో కార్యకలాపాలను సాగించిందని స్వాధీనం చేసుకున్న పత్రాలను విశ్లేషించిన అధికారులు ప్రాథమిక నిర్ధారణకు వచ్చారు. . ఈ షెల్ సంస్థలు మూలధనం/హామీ లేని రుణాల ముసుగులో లెక్కల్లో చూపని నగదును సంస్థ ఖాతా పుస్తకాల్లోకి మళ్లించినట్లు గుర్తించారు. అక్రమ విధానాలను అనుసరించినట్టు సంస్థలో కీలక బాధ్యతలు నిర్వహిస్తున్న ఒక వ్యక్తి అధికారుల ఎదుట అంగీకరించారు.
ఆదాయం పన్ను శాఖ అధికారులు లెక్కల్లో చూపని 75 లక్షల రూపాయల నగదు, 2.26 కోట్ల రూపాయల విలువ చేసే ఆభరణాలను అధికారులు స్వాధీనం చేసుకున్నారు. కొన్ని బ్యాంకు లాకర్లను కూడా అధికారులు గుర్తించారు. ఈ లాకర్లను అధికారులు స్వాధీనం చేసుకున్నారు. అధికారులు నిర్వహించి దాడులు, సోదాల్లో లెక్కల్లో చూపని దాదాపు 100 కోట్ల రూపాయల ఆదాయం వెలుగులోకి వచ్చింది.
కేసులో అధికారులు విచారణ కొనసాగిస్తున్నారు.
(Release ID: 1778414)
Visitor Counter : 143