ఎలక్ట్రానిక్స్ అండ్ ఇన్‌ ఫ‌ర్మేశన్‌ టెక్నాలజీ మంత్రిత్వ శాఖ

ఆజాదీ కా డిజిటల్ మహోత్సవ్


చిన్నవ్యాపారులు, చిన్న పరిశ్రమలు, ఎంఎస్ఎంఈ లకు ఋణాలిచ్చే వేదిక కల్పించాలని బాంకర్లకు ఐటీ మంత్రి అశ్విన్ వైష్ణవ్ పిలుపు

డిజిటల్ చెల్లింపుల ఉత్సవం నిర్వహణ

డిజి ధన్ లోగో ఆవిష్కరణ

అవగాహన పెంపుకోసం డిజిటల్ చెల్లింపుల సందేశ యాత్ర

డిజిటల్ చెల్లింపులు ప్రోత్సహించిన అత్యున్నత బాంకులు, ఫిన్ టెక్ కంపెనీలకు డిజిధన్ అవార్డులు

పిఎం స్వనిధి పథకం కింద వీధి వర్తకుల కోసం చెల్లింపుల సమన్వయకర్తల గుర్తింపు

Posted On: 05 DEC 2021 3:43PM by PIB Hyderabad

ఎలక్ట్రానిక్స్,  ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ మంత్రిత్వశాఖ ఈ రోజు ఒక విశిష్టమైన కార్యక్రమానికి శ్రీకారం చుట్టింది. వారం రోజులపాటు సాగే ఆజాదీ కా డిజిటల్ మహోత్సవ్ కార్యక్రమంలో భాగంగా డిజిటల్ చెల్లింపుల ఉత్సవం చేపట్టింది. డిజిటల్ చెల్లింపుల యాత్రలో దేశంలో పెరుగుతున్న డిజిటల్  చెల్లింపుల నేపథ్యంలో ప్రభుత్వం నుంచి, బాంకింగ్ రంగం నుంచి ఫిన్ టెక్ కంపెనీలు, స్టార్టప్స్ కూడా ఇందులో పాల్గొన్నాయి. ఇండియా హాబిటాట్ లో జరిగిన ఈ కార్యక్రమంలో డిజిధన్ లోగో కూడా ఆవిష్కరించారు. డిజిటల్ చెల్లింపులమీద అవగాహన పెంచటానికి చేపట్టిన డిజిటల్ చెల్లింపుల సందేశ యాత్రను, ఇందుకు సంబంధించిన గీతాన్ని కూడా ప్రారంభించారు. నగదు రహిత, స్పర్శ రహిత, కాగిత రహిత చెల్లింపులను ప్రోత్సహించే “చుట్  కీ బజా కే..”   అనే గీతాన్ని ఆవిష్కరించారు. డిజిటల్ చెల్లింపులు ప్రోత్సహించిన అత్యున్నత బాంకులు, ఫిన్ టెక్ కంపెనీలకు డిజిధన్ అవార్డులు అందజేశారు. ఈ కార్యక్రమం  సందర్భంగా పిఎం స్వనిధి పథకం కింద వీధి వర్తకుల కోసం చెల్లింపుల సమన్వయకర్తలైన నాలుగు సంస్థలను గుర్తించారు.

ఎలక్ట్రానిక్స్,  ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ శాఖామంత్రి శ్రీ అశ్విన్ వైష్ణవ్ విజేతలను అభినందించారు. సూక్ష్మ, చిన్న, మధ్య తరహా పరిశ్రమలకు, చిన్న వ్యాపారులకు సులభంగా, వేగంగా రుణాలు అందించాలని, అందుకోసం ఒక వేదిక రూపొందించాలని బాంకర్లకు. ఆర్థిక సాంకేతిక సంస్థలకు మంత్రి పిలుపునిచ్చారు. సమాజంలో అట్టాడుగుణ ఉన్నవారికి సాధ్యమైనంత ఎక్కువగా సహాయం అందవలసి ఉందన్నారు.  బాంకార్లకు ఇప్పుడు  ఆధార్, డిజి లాకర్, యూపీఐ లాంటి సౌకర్యాలు అందుబాటులో ఉన్నాయి గనుక ఈ సవాలు తీసుకోవటం సులభమవుతుందన్నారు. వచ్చే మూడు నెలల్లో ఈ కార్యక్రమం చేపట్టాలని కోరారు.

ఎలక్ట్రానిక్స్, ఇన్ఫర్మేషన్  టెక్నాలజీ, నైపుణ్యాభివృద్ధి, వ్యాపార నైపుణ్యాభివృద్ధి శాఖల సహాయ మంత్రి  శ్రీ రాజీవ్ చంద్రశేఖర్ ప్రత్యేకోపన్యాసం చేశారు. ఆత్మ నిర్భర భారత్ ను సాకారం చేయటంలో ఆర్థిక సాంకేతిక సంస్థల కృషిని ఆయన అభినందించారు.  ప్రధాని నరేంద్ర మోదీ చొరవ, కృషి వల్లనే కరోనా సంక్షోభ సమయంలోనూ పౌరులకు నేరుగా వారి ఖాతాలకే లబ్ధి ఫలాలు అందాయని గుర్తు చేశారు. ఎక్కడా అవినీతికి ఆస్కారం లేకుండా అత్యంత బాధ్యతాయుతంగా ఏ ప్రజాస్వామ్య ప్రభుత్వమూ చేయనంతగా భారత్ ఈ కార్యక్రమాన్ని నెరవేర్చిందన్నారు. ప్రపంచవ్యాప్తంగా భారత డిజిటల్ చెల్లింపులకు గుర్తింపు వచ్చిందని, టెక్నాలజీ పరంగా ముందున్న దేశాలు సైతం ఆశ్చర్యపోయేలా భారత్ వ్యవహరించిందని అన్నారు.

ఎలక్ట్రానిక్స్, ఇన్ఫర్మేషన్  టెక్నాలజీ శాఖ కార్యదర్శి శ్రీ అజయ్ సహానీ కీలకోపన్యాసం చేస్తూ, భారత్ ను నగదు రహిత సమాజంగా మార్చటంలోనూ, అత్యంత సురక్షితమైన లావాదేవీలకు  వెసులుబాటు కల్పించటంలోనూ జరగాల్సిన కృషిని ఈ సందర్భంగా ఆయన గుర్తు చేశారు. ఆధార్ ను ఆధారంగా చేసుకొని యూపీఐ ఒక అద్భుత వేదికను రూపుదిద్దందని. దీనివలన ఒక సజీవమైన డిజిటల్ గుర్తింపుగా ఆధార్ ను మార్చిందని అన్నారు. జేబులో కనీసం ఒక కార్డు పెట్టుకోవాల్సిన అవసరం కూడా లేకుండా అలాంటి గుర్తింపు లభించిందన్నారు. యూపీఐ అనేది కేవలం ఒక డేటాబేస్ ప్రాజెక్ట్ మాత్రమే కాదని ఇది దేశవ్యాప్తంగా అందరూ చేరటానికి అనువైనదని అన్నారు.  యూపీఐ మరింత వేగంగా, అనూహ్యమైన రీతిలో అభివృద్ధి చెందుతుందని, అయితే ఇంకెంతో పురోగతి సాధించాల్సి ఉందని కూడా అభిప్రాయపడ్డారు.

 

ఎలక్ట్రానిక్స్, ఇన్ఫర్మేషన్  టెక్నాలజీ శాఖ ఆర్థిక సలహాదారు సిమ్మీ చౌధురి మాట్లాడుతూ, ఈ అనూహ్యమైన కోవిడ్  సంక్షోభ  కాలంలో డిజిటల్ చెల్లింపుల ప్రాధాన్యాన్ని నొక్కి చెప్పారు. డిజిటల్ చెల్లింపులకు అందరూ అతి తక్కువ సమయంలో అలవాటు పడటం గొప్ప విషయమన్నారు. మొత్తం లావాదేవీలు 2018 లో 2,071 కోట్లు ఉండగా 2021 నాటికి అవి రూ.  5,551 కోట్లకు చేరాయన్నారు.

ఈ కార్యక్రమం సందర్భంగా వినూత్నమైన కొన్ని ఆవిష్కరణలు జరిగాయి: ఎక్కడ ఉన్నా క్షణాల్లో చెల్లింపులు జరిపే వెసులుబాటు కల్పిస్తూ సిటీ యూనియన్ బాంక్, బాంక్ ఆఫ్ బరోడా రూపే ను ప్రారంభించటం, రూపే నెట్ వర్క్ మీద కొన్ని బాంకులు కాంటాక్ట్ లెస్ క్రెడిట్ కార్డులు ప్రారంభించటం, చిన్నవర్తకులను  సాధికారం చేస్తూ దాదాపు రూ. 1.5 కోట్ల చిల్లర వర్తకులకు రుణాల అందుబాటుకు కూడా చర్యలు తీసుకోవటం ఇందులో భాగాలు.

ఈ సందర్భంగా అనేక సాంస్కృతిక కార్యక్రమాలు నిర్వహించారు.

 

*****



(Release ID: 1778346) Visitor Counter : 189