ఆర్థిక మంత్రిత్వ శాఖ
azadi ka amrit mahotsav

ఆదాయపు పన్ను శాఖ నూతన ఈ-ఫైలింగ్ పోర్టల్ ద్వారా మూడు కోట్లకు మించి ఆదాయం పన్ను రిటర్న్‌లు దాఖలు


2021-22 ఆర్థిక సంవత్సరానికి ఇంతవరకు రిటర్న్‌లు దాఖలు చేయనివారు వాటిని త్వరగా దాఖలు చేయాలని కోరిన ఆదాయం పన్ను శాఖ

Posted On: 05 DEC 2021 2:03PM by PIB Hyderabad

ఆదాయపు పన్ను శాఖ నూతన ఈ-ఫైలింగ్ పోర్టల్ ద్వారా మూడు కోట్లకు మించి ఆదాయం పన్ను రిటర్న్‌లు 2021 డిసెంబర్ 3వ తేదీ నాటికి దాఖలు అయ్యాయి. 2021 డిసెంబర్ 31వ తేదీ నాటికి రిటర్న్‌లు దాఖలు చేయాల్సి ఉంటుంది. గడువు తేదీ సమీపించడంతో రిటర్న్‌లు దాఖలు చేస్తున్న వారి సంఖ్య పెరుగుతోంది. ప్రస్తుతం రోజుకి దాదాపు నాలుగు లక్షల మంది తమ రిటర్న్‌లు దాఖలు చేస్తున్నారు. వీరి సంఖ్య రోజురోజుకూ పెరుగుతోంది. 

టీడీఎస్చెల్లించిన పన్ను మొత్తం సరిగ్గా ఉండేలా చూడడానికి పన్ను చెల్లింపుదారులు తమ ఫారం 26 ఏఎస్వార్షిక సమాచార నివేదిక ( ఎఐఎస్) లను ఈ-ఫైలింగ్ పోర్టల్ ద్వారా సరి చూసుకోవాలని ఆదాయం పన్ను శాఖ సూచించింది. సరి చూసుకున్న తరువాత ఆదాయం పన్ను రిటర్న్‌లను పూరించాలని శాఖ సూచించింది. ఎఐఎస్ వివరాలను చెల్లింపుదారులు తమ బ్యాంకు పాస్ బుక్వడ్డీ సర్టిఫికేట్ ఫారం 16 ల తోను, ఈక్విటీ/మ్యూచువల్ ఫండ్స్ మొదలైన వాటి కొనుగోలు మరియు అమ్మకం విషయంలో బ్రోకరేజీలను సరి చూసుకోవాలని ఆదాయం పన్ను శాఖ పేర్కొంది. 

2021-22 ఆర్థిక సంవత్సరానికి సంబంధించి 3.03 కోట్ల ఆదాయం పన్ను రిటర్న్‌లు దాఖలు అయ్యాయి. వీటిలో ఆదాయం పన్ను రిటర్న్‌1లు 58.98% ( 1.78 కోట్లు) 8% వరకు ఆదాయం పన్ను రిటర్న్‌2లు (24.42 లక్షలు), 8.7% ఆదాయం పన్ను రిటర్న్‌3లు(26.58 లక్షలు), 23.12%ఆదాయం పన్ను రిటర్న్‌4లు(70.07 లక్షలు), ఆదాయం పన్ను రిటర్న్‌5లు(2.14 లక్షలు), ఆదాయం పన్ను రిటర్న్‌6లు(0.91లక్షలు) ఆదాయం పన్ను రిటర్న్‌7లు(0.15 లక్షలు) ఉన్నాయి. పోర్టల్ లో అందుబాటులో ఉన్న ఫారం ను ఉపయోగించి 52% ఆదాయం  పన్ను రిటర్న్‌లు దాఖలు అయ్యాయి. మిగిలిన పన్ను రిటర్న్‌లు ఆఫ్ లైన్ సాఫ్ట్‌వేర్ సౌకర్యాల ద్వారా దాఖలు అయ్యాయి. 

దాఖలైన పన్ను రిటర్న్‌లను పరిశీలించడానికి ఆధార్ ఓటీపీ ఇతర పద్ధతుల ద్వారా శాఖ మరోసారి ఈ-వెరిఫికేషన్ చేసి అవసరమైన కేసులలో రిఫండ్ పత్రాలను జారీ చేస్తుంది. ఇంతవరకు ఆదాయం పన్ను శాఖ 2.69 కోట్ల  పన్ను రిటర్న్‌లను ఈ-వెరిఫికేషన్ చేసింది. వీటిలో 2.28 కోట్లకు పైగా పన్ను రిటర్న్‌లు ఆధార్ ఆధారిత ఓటీపీ ద్వారా తనిఖీ చేయడం జరిగింది. 

నవంబర్ నెలలో దాఖలైన పన్ను రిటర్న్‌లలో 48%  1,2,4 పన్ను రిటర్న్‌లను అవి దాఖలైన రోజున తనిఖీ చేయడం పూర్తయింది. పరిశీలించిన 2.11 పన్ను రిటర్న్‌లలో 2021-22 ఆర్థిక సంవత్సరానికి సంబంధించి 82.80 లక్షల రిఫండ్లు జారీ అయ్యాయి. రిఫండ్ మొత్తాన్ని పొందడానికి వీలుగా తాము సమర్పించిన బ్యాంకు ఖాతా పాన్ నెంబర్ తో అనుసంధానం కలిగి ఉందని పన్ను చెల్లింపుదారులు చూసుకోవాలని ఆదాయం పన్ను శాఖ సూచించింది. దీనివల్ల రిఫండ్ సక్రమంగా జరుగుతుంది. 

మొత్తం 8.33 లక్షల డీఎస్సీలు నమోదయ్యాయి.  సరళీకృత ప్రక్రియలో ఎవరైనా తన  డీఎస్సీ ని ఒక్కసారి మాత్రమే నమోదు చేసుకోవచ్చు. దీనిని నమోదు చేసుకున్న వ్యక్తి భాగస్వామి, డైరెక్టర్ గా ఉన్న సంస్థలు వినియోగించుకోవచ్చు.  ప్రతి హోదాకి విడిగా డీఎస్సీ నమోదు చేయించుకోవాల్సిన అవసరం ఉండదు. 

2021 డిసెంబర్ 3 నాటికి 34.01 లక్షలకు పైగా చట్టబద్ధమైన ఫారంలు ఆదాయం పన్ను శాఖకి అందాయి. వీటిలో   15.11 లక్షల టీడీఎస్  స్టేట్‌మెంట్‌లు,ట్రస్టులు/సంస్థల రిజిస్ట్రేషన్ కోసం 1.56 లక్షల ఫారం 10 ఎ జీతాల బకాయి  కోసం 3.29 లక్షల ఫారం 10  లుఅప్పీల్ కు సంబంధించి  49,295 ఫారమ్ 35 , డీటీవి ఎస్ వి ఫారం 4లో 35,342 ఉన్నాయి.  7.81 లక్షలకు పైగా 15 సీఏ 1.82 లక్షలకు పైగా 15 సీబీ ఫారంలు అందాయి.  29.54 లక్షలకు పైగా ఈ-పాన్‌లు ఆన్‌లైన్‌లో ఉచితంగా కేటాయించబడ్డాయి.  రిజిస్ట్రేషన్ మరియు సమ్మతి కోసం లీగల్ హెయిర్ ఫంక్షనాలిటీ ప్రారంభించబడింది. 

 పన్ను చెల్లింపుదారులకు ఆదాయం పన్ను శాఖ  ఈ మెయిల్‌ఎస్ఎంఎస్, మీడియా ప్రచారాల ద్వారా అప్రమత్తం చేస్తోంది.  పన్ను చెల్లింపుదారులు తమ ఆదాయపు పన్ను రిటర్న్‌లను మరింత ఆలస్యం చేయకుండా దాఖలు చేయాలని శాఖ కోరింది. 

2021-22 ఆర్థిక సంవత్సరానికి సంబంధించి ఇంతవరకు  ఆదాయపు పన్ను రిటర్న్‌లను ఫైల్ చేయని పన్ను చెల్లింపుదారులందరూ చివరి నిమిషంలో రద్దీని నివారించడానికి వీలైనంత త్వరగా తమ రిటర్న్‌లను దాఖలు చేయాలని ఆదాయం పన్ను శాఖ కోరింది. 

 


(Release ID: 1778345) Visitor Counter : 231