రక్ష‌ణ మంత్రిత్వ శాఖ‌
azadi ka amrit mahotsav

1971 యుద్ధ‌ధీరుల గౌరవార్థం ‘ఆజాదీ కి విజయ్ శృంఖ‌లా’, ‘సంస్కృతియోం కా మహా సంగం’ల‌ను ప్రారంభించిన ఎన్‌సీసీ

Posted On: 04 DEC 2021 9:55AM by PIB Hyderabad

 

'ఆజాదీ కా అమృత్ మహోత్సవ్'‌లో భాగంగా 'నేషనల్ క్యాడెట్ కార్ప్స్' (ఎన్‌సీసీ) ‘ఆజాదీ కి విజయ్ శృంఖ‌లా’, ‘సంస్కృతియోం కా మహా సంగం’ కార్యక్రమాన్ని నిర్వహిస్తోంది. ఈ కార్య‌క్ర‌మంలో  మొదటి భాగం అంటే 'ఆజాదీ కి విజయ్ శృంఖ‌లా' నవంబర్ 28 నుండి డిసెంబర్ 10, 2021 వరకు నిర్వహిస్తున్నారు.  ఇందులో భాగంగా 1971 యుద్ధం యొక్క ధైర్యవంతులను దేశవ్యాప్తంగా 75 ప్రదేశాలలో సత్కరిస్తున్నారు. ఈ 75 స్థానాల్లో ఐదు గ్యాలంట్రీ అవార్డ్స్ పోర్టల్ (https://www.gallantryawards.gov.in/)లో ప్రత్యక్ష వెబ్‌కాస్ట్ కోసం కేటాయించబడ్డాయి. ఈ కార్య‌క్ర‌మం ద్వితీయ భాగమైన 'సంస్కృతియోన్ కా మహా సంగమ్స‌, దీని ప్ర‌కారం ఢిల్లీలో ఒక ప్రత్యేక జాతీయ ఏకీకరణ శిబిరం నిర్వహించబడుతుంది, ఇందులో దేశ‌ నలుమూలల నుండి అభ్యర్థులు త‌మ‌త‌మ విబిన్న‌మైన సాంస్కృతి  మార్పిడిలో పాల్గొంటారు. ఈ కార్య‌క్ర‌మం ముగింపు జాతీయ రాజధానిలోని ఎన్‌సీసీ వారి క్యాంప్ ఆడిటోరియంలో నిర్వహించబడుతుంది, ఇక్కడ సరిహద్దు మరియు తీర ప్రాంతాల క్యాడెట్‌లు తమ తమ రాష్ట్రాలలోని అందమైన స్థానిక నృత్యాలను మరియు 22 భాషలలో పాడబడే దేశ స‌మ‌గ్ర‌త‌కు సంబంధించిన‌ పాటల‌ను ప్రదర్శిస్తారు. ఈ మెగా ఈవెంట్ల‌ యొక్క లక్ష్యం 1971 యుద్ధంలోని  ధైర్యవంతుల కుటుంబ సభ్యులను 75 ప్రదేశాలలో సత్కరించడం మరియు మొత్తం దేశానికి వారి  ధీర‌త‌ను తెలియ‌ప‌ర‌చ‌డం.  ఈ కార్యక్రమం భారతదేశంలోని సాంస్కృతిక వైవిధ్యాన్ని ప్రదర్శిస్తారు, ముఖ్యంగా సరిహద్దు మరియు తీర ప్రాంతాల నుండి 'భిన్నత్వంలో ఏకత్వం'ని బలోపేతం చేయడానికి ఎన్‌సీసీ ఇటీవల ఈ కార్య‌క్ర‌మాన్ని చేప‌ట్టింది.

***


(Release ID: 1778070) Visitor Counter : 156