ఆరోగ్య, కుటుంబ సంక్షేమ‌ మంత్రిత్వ శాఖ
azadi ka amrit mahotsav

కొవిడ్‌-19 తాజా సమాచారం

Posted On: 04 DEC 2021 10:12AM by PIB Hyderabad

దేశవ్యాప్త కొవిడ్‌-19 టీకా కార్యక్రమంలో భాగంగా, ఇప్పటివరకు 126.53 కోట్ల డోసులను అందించారు.

దేశవ్యాప్త క్రియాశీల కేసుల సంఖ్య 99,974.

మొత్తం కేసుల్లో క్రియాశీల కేసులు 1% కంటే తక్కువగా, 0.29% వద్ద ఉన్నాయి. 2020 మార్చి నుంచి ఇది కనిష్ట స్థాయి.

రికవరీ రేటు 98.35% కు చేరింది.

గత 24 గంటల్లో 8,190 మంది కోలుకున్నారు. దీంతో, కోలుకున్నవారి మొత్తం సంఖ్య 3,40,53,856 కు పెరిగింది.

గత 24 గంటల్లో 8,603 కొత్త కేసులు నమోదయ్యాయి.

రోజువారీ పాజిటివిటీ రేటు (0.69%) గత 61 రోజులుగా 2% కన్నా తక్కువగా ఉంది.

వారపు పాజిటివిటీ రేటు (0.81%) గత 20 రోజులుగా 1% కన్నా తక్కువగా ఉంది.

ఇప్పటివరకు 64.60 కోట్ల కొవిడ్‌ పరీక్షలు చేశారు.

 

****


(Release ID: 1777999) Visitor Counter : 151