ప్రధాన మంత్రి కార్యాలయం
ఇన్ ఫినిటీ- ఫోరమ్, 2021 ప్రారంభ కార్యక్రమం లో ప్రధాన మంత్రి ప్రసంగం పాఠం
Posted On:
03 DEC 2021 11:19AM by PIB Hyderabad
ఎక్స్ లన్సిజ్,
ప్రముఖ సహచరులారా,
సాంకేతిక జగతి కి చెందిన, ఆర్థిక జగతి కి చెందిన నా దేశవాసులు, 70 కి పైగా దేశాల నుంచి పాలుపంచుకొంటున్న వేల కొద్దీ వ్యక్తులారా,
నమస్కారం.
మిత్రులారా,
ఒకటో ‘ఇన్ ఫినిటీ-ఫోరమ్’ ను ప్రారంభిస్తున్నందుకు, ఇంకా మీ అందరికీ స్వాగతం పలుకుతున్నందుకు నేను సంతోషిస్తున్నాను. భారతదేశం లో ‘ఫిన్-టెక్’ కు ఉన్న అపారమైన అవకాశాల కు ‘ఇన్ ఫినిటీ- ఫోరమ్’ ప్రాతినిధ్యం వహిస్తోంది. యావత్తు ప్రపంచాని కి ప్రయోజనాల ను అందించడం లో భారతదేశ ‘ఫిన్-టెక్’ కు గల అపార సామర్ధ్యం కూడా దీని ద్వారా వ్యక్తం అవుతున్నది.
మిత్రులారా,
కరెన్సీ తాలూకు చరిత్ర ఈ రంగం లో ఎంతో గొప్పదైనటువంటి క్రమ వృద్ధి చోటుచేసుకొందని వెల్లడిస్తున్నది. మానవుని లో క్రమ వికాసం ఎలా అయితే చోటు చేసుకొందో, అదే విధం గా మన లావాదేవీ ల స్వరూపం సైతం వికసించింది. సరకుల ను ఇచ్చి పుచ్చుకోవడం
నుంచి లోహాల వరకు, మరి నాణేల నుంచి నోట్ స్ వరకు, ఇంకా చెక్కు ల నుంచి కార్డు ల వరకు ప్రయాణాన్ని సాగిస్తూ ప్రస్తుతం మనం ఇక్కడ కు చేరుకొన్నాం. ఇంతకు పూర్వం అభివృద్ధి ప్రపంచం అంతటికీ విస్తరించాలి అంటే అందుకు దశాబ్దులు పట్టేవి. కానీ, ప్రపంచీకరణ చోటు చేసుకొన్న ఈ యుగం లో ఈ విధం గా ఇక ఎంత మాత్రం జరుగదు. ఆర్థిక జగతి లో సాంకేతిక విజ్ఞానం ఒక పెద్ద మార్పు ను తీసుకు వస్తున్నది. కిందటి సంవత్సరం లో భారతదేశం లో మొబైల్ పేమెంట్స్ మొట్టమొదటి సారి గా ఎటిఎమ్ నుంచి నగదు ను తీసుకొనే వ్యవహారాల ను మించి పోయాయి. పూర్తి గా డిజిటలీకరణ జరిగిన బ్యాంకు లు ఎలాంటి శాఖ కార్యాలయ భవనాల తావు ఇవ్వకనే, ఇప్పుడు ఒక వాస్తవికత గా పరిణామించాయి మరి ఓ పదేళ్ళ కన్నా తక్కువ కాలం లో అవి సర్వసాధారణం గా కూడా మారేందుకు ఆస్కారం ఉన్నది.
మిత్రులారా,
సాంకేతిక విజ్ఞానాన్ని స్వీకరించడం లో గాని, లేదా సాంకేతిక విజ్ఞానం కేంద్రం గా చేసుకొని వివిధ నూతన ఆవిష్కరణల ను తీసుకొని రావడం లో గాని భారతదేశం ఎవ్వరికీ తీసుపోదు అని ప్రపంచాని కి రుజువు చేసింది. డిజిటల్ ఇండియా లో భాగం గా చేపట్టిన పరివర్తనాత్మకమైన కార్యక్రమాలు పాలన లో అమలు పరచడానికి గాను ఫిన్-టెక్ సంబంధి నూతన ఆవిష్కరణల కై కి తలుపుల ను తెరచివేశాయి. ఆర్థిక సేవ లు సమాజం లో అన్ని వర్గాల వారికి అందేటట్లు చూడటాన్ని సాంకేతిక విజ్ఞానం వేగవంతం చేసింది. 2014వ సంవత్సరం లో 50 శాతం కన్నా తక్కువ భారతీయుల వద్ద మాత్రమే బ్యాంకు ఖాతాలు ఉండగా, బ్యాంకు ఖాతాల ను ఇట్టే తెరచే విధం గా మార్పు తీసుకు రావడం ద్వారా మరి గడచిన ఏడు సంవత్సరాల లో 430 మిలియన్ జన్ ధన్ ఖాతాలు ఏర్పడ్డాయి. ఇంతవరకు 690 మిలియన్ రూపే కార్డుల ను వితరణ చేయడం జరిగింది. రూపే కార్డుల ద్వారా కిందటి ఏడాది లో 1.3 బిలియన్ లావాదేవీలు అయ్యాయి. యుపిఐ ఒక్క గత నెల లోనే రమారమి 4.2 బిలియన్ లావాదేవీల ను పూర్తి చేసింది.
ప్రతి నెలా సుమారు గా 300 మిలియన్ ఇన్ వాయిస్ లను జిఎస్ టి పోర్టల్ లో అప్ లోడ్ చేయడం అవుతోంది. 12 బిలియన్ యుఎస్ డాలర్ లకు మించిన విలువ కలిగిన చెల్లింపులు నెల నెలా ఒక్క జిఎస్ టి పోర్టల్ ద్వారానే జరుగుతూ ఉన్నాయి. మహమ్మారి ఉన్నా కూడా, దాదాపుగా 1.5 మిలియన్ రైల్ వే టికెట్ స్ ను నిత్యం ఆన్ లైన్ మాధ్యమం ద్వారా తీసుకోవడం జరుగుతున్నది. గత ఏడాది లో ఫాస్ట్ ట్యాగ్ (FASTag) ద్వారా 1.3 బిలియన్ స్థాయిలో లావాదేవీల ను సాఫీ గా నిర్వహించడమైంది. పిఎమ్ స్వనిధి ద్వారా దేశం అంతటా చిన్న విక్రేతల కోసం రుణాల ను పొందేందుకు మార్గాన్ని సుగమం చేయడం జరిగింది. ప్రత్యేకించిన సేవల ను ఎటువంటి దారి మళ్ళింపుల కు తావు ఇవ్వకుండా లక్షిత వర్గాల కు అందజేసేందుకు ఇ-రుపీ (e-RUPI) తోడ్పడింది. ఇటువంటి వాటిని గురించి నేను ఎన్నింటి అయినా సరే చెప్తూ ఉండగలను, అయితే ఇవి భారతదేశం లో ‘ఫిన్-టెక్’ కు ఉన్నటువంటి అవధి ని, పరిధి ని సూచించే కొన్ని ఉదాహరణలే అవుతాయి సుమా.
మిత్రులారా,
ఆర్థిక సేవల ను సమాజం లో అన్ని వర్గాల వారికీ అందజేయడం అనే దాని ద్వారా ఫిన్-టెక్ రెవలూశన్ జోరు అందుకోగలుగుతున్నది. నాలుగు స్తంభాల మీద ‘ఫిన్-టెక్’ ఆధారపడి ఉన్నది. ఆ నాలుగు స్తంభాలు ఏవేవి అంటే- ఆదాయం, పెట్టుబడులు, బీమా, ఇంకా సంస్థాగత రుణాలు. ఆదాయం పెరుగుతూ ఉంటే గనక పెట్టుబడి పెట్టడం అనేది సాధ్యపడుతుంది. బీమా రక్షణ లభించడం వల్ల మరింత ఎక్కువ నష్ట భయాన్ని స్వీకరించే సామర్థ్యం, పెట్టుబడుల ను పెట్టే సామర్థ్యం పెరుగుతుంది. సంస్థాగత రుణాల తో విస్తరణ జోరు అందుకోగలదు. మరి మేము ఈ స్తంభాల లో ప్రతి ఒక్క స్తంభాన్ని గురించి కష్టపడ్డాం. ఈ అంశాలు అన్నీ కలగలసినప్పుడు, అది జరిగిందా అంటే అప్పుడు ఆర్థిక రంగం లో పాలుపంచుకొనే వారిని చాలా మంది ని మీరు ఉన్నట్టుండి గమనించడం మొదలుపెడతారు. విస్తృతమైన పునాది అనేది ఫిన్-టెక్ సంబంధి నూతన ఆవిష్కరణ ల కు రెక్కల ను తొడుక్కొనేందుకు ఒక సర్వోత్తమమైనటువంటి ఆధారం అవుతుంది. భారతదేశం లో ఫిన్-టెక్ పరిశ్రమ నూతన ఆవిష్కరణల లో తలమునకలు గా ఉంది. దీని ద్వారా ద్రవ్యం నుంచి మొదలుపెట్టి ఔపచారిక రుణ ప్రణా
ళిక వరకు దేశం లో ప్రతి ఒక్క వ్యక్తి కి అందుబాటు లోకి తీసుకు పోవడం కుదురుతుంది. ఈ ఫిన్-టెక్ సంబంధి కార్యక్రమాల ను ఒక ఫిన్-టెక్ క్రాంతి గా మార్చడానికి అనువైన కాలం ఇప్పుడు వచ్చేసింది. అది ఎటువంటి విప్లవం అంటే అది దేశం లో ప్రతి ఒక్క వ్యక్తి ఆర్థిక సాధికారిత ను ప్రాప్తింప చేసుకోడం లో సాయపడేటటువంటిది అన్న మాట.
మిత్రులారా,
‘ఫిన్-టెక్’ యొక్క పరిధి విశాలం అవుతూ ఉండటాన్ని మనం గమనిస్తున్నాం, ఈ కారణం గా కొన్ని విషయాల పైన శ్రద్ధ వహించవలసిన అవసరం ఏర్పడుతుంది. ఫిన్-టెక్ పరిశ్రమ భారీ స్థాయి ని సంతరించుకొంది. మరి భారీ స్థాయి అంటే అర్థం ఏమిటి అంటే జీవనం లోని ప్రతి రంగం లోని వ్యక్తి దీని వినియోగదారుల రూపాన్ని పొందడం అన్నమాట. సామాన్య ప్రజానీకం లో ఈ ఫిన్-టెక్ కు లభించిన ఒప్పుకోలు ఒక విశిష్టమైన లక్షణాన్ని కలిగి ఉంది. ఆ లక్షణం ఏమిటి అంటే భరోసా. భారతదేశం లో సామాన్యులు డిజిటల్ పేమెంట్స్ ను, అలాగే ఈ తరహా సాంసకేతికతల ను అక్కున చేర్చుకోవడం ద్వారా మా ఫిన్-టెక్ ఇకోసిస్టమ్ పట్ల చాలా భరోసా ను వ్యక్తం చేశారు. ఈ విశ్వాసం అనేది ఒక బాధ్యత గా కూడా ఉంది. భరోసా కు ఉన్న అర్థం ఏమిటి అంటే ప్రజల హితాలు సురక్షితం గా ఉన్నాయని మీరు పూచీ పడవలసిన అగత్యం అన్న మాట. నూతన ఆవిష్కరణల కు ఆస్కారం లేకపోతే ఫిన్-టెక్ సంబంధి భద్రత అసంర్తి గా ఉంటుంది.
మిత్రులారా,
ప్రపంచం తో కలసి అనుభవాల ను, ప్రావీణ్యాన్ని పంచుకోవడం తో పాటు ప్రపంచం నుంచి నేర్చుకోవడం పట్ల భారతదేశం సదా మొగ్గు చూపుతూ వచ్చింది. మా డిజిటల్ పబ్లిక్ ఇన్ ఫ్రాస్ట్రక్చర్ తాలూకు పరిష్కార మార్గాలు ప్రపంచ వ్యాప్తం గా ప్రజల జీవనాన్ని మెరుగు పరచ గలుగుతాయి. యుపిఐ, ఇంకా రూపే ల వంటి ఉపకరణాలు ప్రతి దేశాని కి సాటి లేనటువంటి అవకాశాన్ని అందిస్తాయి. అది ఎటువంటి అవకాశం అంటే తక్కువ ఖర్చు అయ్యేటటువంటిది, భరోసా తో కూడినటువంటిదీ అయిన ‘వాస్తవిక సమయం లో చెల్లింపు వ్యవస్థ’ (రియల్ టైమ్ పేమెంట్ సిస్టమ్) ను ప్రసాదించడం, అలాగే ‘డమెస్టిక్ కార్డ్ స్కీమ్’ ను, ‘ఫండ్ రిమిటన్స్ సిస్టమ్’ ను ప్రదానం చేసేదీనూ.
మిత్రులారా,
జిఐఎఫ్ టి సిటీ (గిఫ్ ట్ సిటీ) అనేది కేవలం ఒక ప్రాంగణం కాదు, అంతకంటే అది భారతదేశానికి ప్రాతినిధ్యం వహించేటటువంటిది. అది భారతదేశం లోని ప్రజాస్వామిక విలువల కు, డిమాండు కు, విభిన్న జన సముదాయాల కు, వివిధత్వానికి కూడా ప్రాతినిధ్యం వహిస్తూ ఉన్నది. అది ఆలోచన ల పట్ల, నూతన ఆవిష్కరణ ల పట్ల మరియు పెట్టుబడి పట్ల భారతదేశాని కి ఉన్నటువంటి బాహాటత్వానికి ప్రాతినిధ్యాన్ని వహిస్తూ ఉన్నది. గ్లోబల్ పిన్-టెక్ ప్రపంచాని కి ఒక ప్రవేశ ద్వారం గా గిఫ్ట్- సిటీ ఉంది. ద్రవ్యం మరియు సాంకేతిక విజ్ఞానం.. వీటి సమ్మేళనం భారతదేశం యొక్క భావి అభివృద్ధి తాలూకు ఒక ముఖ్యమైన భాగం అవుతుంది అనే దృష్టి కోణం లో నుంచి గిఫ్ట్- సిటీ లో ఐఎఫ్ఎస్ సి రూపుదాల్చింది.
మిత్రులారా,
ఆర్థిక వ్యవస్థ కు ద్రవ్యం జీవనప్రదాయిని వంటి రక్తం. మరయితే సాంకేతిక విజ్ఞానం ఆ రక్తాన్ని మోసుకుపోయే ధమని. ఈ రెండూ అంత్యోదయ సాధన కు, సర్వోదయ సాధన కు కూడా సమానమైనటువంటి ప్రాముఖ్యాన్ని కలిగి ఉన్నాయి. మా యొక్క ప్రముఖమైన ఇన్ ఫినిటీ ఫోరమ్ అనేది గ్లోబల్ ఫిన్- టెక్ ఇండస్ట్రీ లోని కీలకమైన భాగస్వాముల ను అందరినీ ఒక చోటు కు తీసుకు వచ్చి, పరిశ్రమ తాలూకు పరిమితి అంటూ లేనటువంటి భవిష్యత్తు ను శోధించదలచిన ప్రయాస లో ఒక భాగం గా ఉన్నది. ఈ విషయం పై శ్రీ మైక్ బ్లూమ్ బర్గ్ తో నేను కిందటి సారి భేటీ అయినప్పుడు మా మధ్య చోటు చేసుకొన్న సంభాషణ నాకు గుర్తుకు వస్తున్నది. మరి బ్లూమ్ బర్గ్ గ్రూపున కు వారి సమర్ధన కు గాను నేను ధన్యవాదాలు పలుకుతున్నాను. ఇన్ ఫినిటీ ఫోరమ్ అనేది విశ్వాసం తాలూకు ఒక వేదిక గా ఉంది. అది ఎటువంటి విశ్వాసం అంటే ఏదయితే నూతన ఆవిష్కరణ ల ఆత్మ పట్ల మరియు కల్పన శక్తి పట్ల ఉండేటటువంటి విశ్వాసమో అదన్నమాట. ఆ విశ్వాసం యువతీ యువకుల శక్తి పట్ల, ఇంకా మార్పు ను తీసుకురావడం కోసం వారి లోపలి ఉద్వేగం పట్ల ఉండేటటువంటి విశ్వాసం. ప్రపంచాన్ని ఉత్తమమైనటువంటి స్థానం గా మలచాలనేటటువంటి విశ్వాసం. రండి, మనం అందరం కలసి, యావత్తు ప్రపంచం లో ఎదురుపడుతూ ఉన్నటువంటి అత్యంత జరూరైన అంశాల ను పరిష్కరించడానికి ఫిన్-టెక్ పరం గా నూతన ఆవిష్కరణల ను శోధిస్తూ, వాటిని ముందుకు తీసుకుపోదాం.
మీకు ధన్యవాదాలు.
***
(Release ID: 1777988)
Visitor Counter : 150
Read this release in:
Assamese
,
English
,
Urdu
,
Marathi
,
Hindi
,
Bengali
,
Manipuri
,
Punjabi
,
Gujarati
,
Odia
,
Tamil
,
Kannada
,
Malayalam