ఆరోగ్య, కుటుంబ సంక్షేమ‌ మంత్రిత్వ శాఖ
azadi ka amrit mahotsav

ఆక్సిజన్ ప్లాంట్లతో కొత్త ఆసుప‌త్రులు

Posted On: 03 DEC 2021 3:31PM by PIB Hyderabad

కేంద్రం ప్రభుత్వం 1563 ప్రెజర్ స్వింగ్ అబ్సార్ప్ష‌న్ (PSA) ఆక్సిజన్ ఉత్పత్తి ప్లాంట్‌లను మంజూరు చేసింది. సుమారు 2000 ఎంటీ సామర్థ్యంతో దేశ వ్యాప్తంగా ప్రజారోగ్య సౌకర్యాలలో ఏర్పాటు చేయడ‌మైంది. వీటిలో 1225 పీఎస్ఏ ప్లాంట్లు కూడా ఉన్నాయి, ఇవి దేశంలోని ప్రతి జిల్లాలో పీఎం కేర్స్ ఫండ్ కింద స్థాపించి ప్రారంభించబడ్డాయి. దీనికి అదనంగా, పెట్రోలియం & సహజ వాయువు మంత్రిత్వ శాఖ, విద్యుత్ మంత్రిత్వ శాఖ, బొగ్గు మంత్రిత్వ శాఖ, రైల్వే మంత్రిత్వ శాఖకు చెందిన ప్ర‌భుత్వ రంగ సంస్థ‌ల ద్వారా 281 పీఎస్ఏ  ప్లాంట్లు ఏర్పాటు చేయబడినాయి.57 పీఎస్ఏ ప్లాంట్లు విదేశీ గ్రాంట్ల క్రింద ఏర్పాటు చేయ‌డ‌మైంది. పబ్లిక్ హెల్త్ ఫెసిలిటీలలో పీఎస్ఏ  ప్లాంట్‌లను ఏర్పాటు చేయాలని, ప్రైవేట్ ఆరోగ్య సౌకర్యాలలో పీఎస్ఏ  ప్లాంట్‌ల ఏర్పాటును సులభతరం చేయాలని కూడా కేంద్రం రాష్ట్రాలను కోరింది. అన్ని మెడికల్ కాలేజీల‌లో పీఎస్ఏ  ప్లాంట్‌లను ఇన్‌స్టాల్ చేయడం తప్పనిసరి చేయడానికి జాతీయ వైద్య కమిషన్ వార్షిక ఎంబీబీఎస్ అడ్మిషన్ నిబంధ‌న‌లు- 2020లో ఉన్న  కనీస అవసరాలను కూడా సవరించింది.కేంద్ర ఆరోగ్య, కుటుంబ సంక్షేమ శాఖ సహాయ మంత్రి డాక్టర్‌ భారతి ప్రవీణ్‌ పవార్‌ లోక్‌సభకు లిఖితపూర్వకంగా ఇచ్చిన ఒక  సమాధానంలో ఈ విషయాన్ని వెల్లడించారు.
                                                                                    ****


(Release ID: 1777819)