పౌర విమానయాన మంత్రిత్వ శాఖ

సార్స్ సిఒవి -2 కు సంబంధించిన మాలిక్యుల‌ర్ వ్య‌వ‌స్థ ప‌రీక్ష‌కు తొమ్మిది విధానాల‌ను అనుమ‌తించిన ఐసిఎంఆర్‌


రిస్క్ గ‌ల దేశాలుగా ప్ర‌క‌టించిన దేశాలు మిన‌హా ఇత‌ర దేశాల నుంచి వ‌చ్చే ప్ర‌యాణికుల‌లో న‌మూనా సేక‌ర‌ణ‌ను స్వీయ-చెల్లింపు యాదృచ్ఛిక నమూనా కింద, 2 శాతానికి ప‌రిమితం చేయ‌డం జ‌రిగింది.

Posted On: 01 DEC 2021 3:39PM by PIB Hyderabad

ఆల్గోరిథ‌మ్‌: అంత‌ర్జాతీయ ప్ర‌యాణికుల రాక కు సంబంధించి న‌వంబ‌ర్ 28న కేంద్ర ఆరోగ్య కుటుంబ సంక్షేమ మంత్రిత్వ‌శాఖ  జారీ చేసిన మార్గ‌ద‌ర్శ‌కాల‌కు కొన‌సాగింపుగా, ప్ర‌యాణికుల అవ‌గాహ‌న నిమిత్తం త‌ర‌చూ అడిగే ప్ర‌శ్న‌ల‌కు స‌మాధానంగా కింది స‌మాచారం జారీచేయ‌డం జ‌రిగింది. సుర‌క్షిత‌మైన , భ‌ద్ర‌మైన‌, ఇబ్బందులు లేని అంత‌ర్జాతీయ విమాన ప్ర‌యాణాల‌కు వీలుగా వీటిని జారీచేయ‌డం జ‌రిగింది. దేశ ప్ర‌జ‌ల ఆరోగ్య సంర‌క్ష‌ణ, భ‌ద్ర‌త దృష్ట్యా , భవిష్య‌త్ లో  ఎలాంటి స‌మ‌స్య‌లు రాకుండా చూసేందుకు ఈ చ‌ర్య‌లు తీసుకోవ‌డం జ‌రిగింది.
అంత‌ర్జాతీయ రాక‌పోక‌లకు సంబంధించి కేంద్ర ఆరోగ్య కుటుంబ సంక్షేమ మంత్రిత్వ‌శాఖ ఈ మార్గ‌ద‌ర్శ‌కాల‌ను కింది వెబ్ సైట్ ల‌లో చూడ‌వ‌చ్చు.


https://www.mohfw.gov.in/pdf/GuidelinesforInternationalarrivalsdated30thNovember2021.pdf.
దేశాల జాబితా కోసం చూడండి....
 https://www.mohfw.gov.in/pdf/ListofCountriestobereferredtoincontextofGuidelinesforinternationalarrivalsdated28thNovember2021updatedon30112021.pdf
ఆల్గోరిథ‌మ్‌: అంత‌ర్జాతీయ ప్ర‌యాణికుల రాక‌కు సంబంధించిన మార్గ‌ద‌ర్శ‌కాలు కింద చూడ‌వ‌చ్చు.
https://www.mohfw.gov.in/pdf/Algorithmforrevisedguidelinesforinternationalarrivals30thNovember2021.pdf.

 


ప్ర‌శ్న 1.సార్స్ కొవ్ -2కు సంబంధించి విమానాశ్ర‌యాల‌లో మాలిక్యులార్ టెస్టింగ్‌కు ఐసిఎంఆర్‌కు అనుగుణ‌మైన వ్య‌వ‌స్థ‌లు ఎలాంటి ఆర్‌టి -పిసిఆర్ ప‌రీక్ష‌ల నిర్వ‌హ‌ణ‌కు అనుమ‌తి ఉంది?
వివ‌ర‌ణ : ఐసిఎంఆర్ సార్స్ కోవ్ -2 కు సంబంధించి మాలిక్యులార్ ప‌రీక్ష‌కు కింద పేర్కొన్న వ్య‌వ‌స్థ‌ల‌ను ఆమోదించింది. ( ఈ అన్ని వ్య‌వ‌స్థ‌లూ ఆర్ .టి.పి.సి.ఆర్ )కు స‌మాన‌మైన‌వి. ప‌రీక్షలు నిర్వ‌హించే ప‌రిక్షాకేంద్రాలు ఐసిఎంఆర్, కేంద్ర ఆరోగ్య కుటుంబ సంక్షేమ మంత్రిత్వ‌శాఖ మార్గ‌ద‌ర్శ‌కాల‌ను పాటించ‌వ‌ల‌సి ఉంటుంది. అన్ని పాజిటివ్ కేసుల‌కు జినోమ్ సీక్వెన్సింగ్ జ‌రిగేలా చూడాలి.
ఒపెన్ సిస్ట‌మ్ ఆర్‌టిపిసిఆర్
ట్రూనాట్‌
జెనెక్స్‌ప‌ర్ట్‌
ఆర్‌టిలాంప్‌
సిఆర్ ఐ ఎ స్ పిఆర్ , టాటాఎండి చెక్‌, పెలూడా
అబూట్ ఐడి నౌ
థ‌ర్మోఫిష‌ర్ వార అక్యులా
రాపిడ్ ఆర్‌టిపిసిఆర్‌
కొవిడ్ ఎక్స్ డైర‌క్ట్ ప్లెక్స్‌
ఆర్‌టిపిసిఆర్ ప‌రీక్ష‌ల‌ను ప్ర‌యాణికుల‌కు నిర్వ‌హించేందుకు అవ‌స‌ర‌మైన స‌దుపాయాల‌ను క‌ల్పించాల్సిందిగా విమానాశ్ర‌యాల‌కు పౌర‌విమాన‌యాన మంత్రిత్వ శాఖ ఆదేశాలు జారీచేసింది.

 ప్ర‌శ్న 2 :  రిస్క్ ఉన్న దేశాలు  మిన‌హా మిగిలిన దేశాల‌నుంచి వ‌చ్చే ప్ర‌యాణికుల‌కు  తాజా గా కేంద్ర ఆరోగ్య కుటుంబ సంక్షేమ మంత్రిత్వ‌శాఖ మార్గ‌ద‌ర్శ‌కాల ప్ర‌కారం, వారు మ‌న దేశానికి వ‌చ్చిన త‌ర్వాత ఎంపిక చేసిన కొద్దిమందికి ప‌రీక్ష‌లు నిర్వ‌హించ‌డం జ‌రుగుతుంది క‌దా, వారు ప‌రీక్షా ఫ‌లితాలు వ‌చ్చే వ‌ర‌కు ఎయిర్ పోర్టులోనే ఉండాలా, విమానాశ్ర‌యంలో రద్దీని త‌గ్గించ‌డానికి  ,వారు ఎయిర్ పోర్టు వెలుప‌ల‌కు వెళ్ల‌డానికి అనుమ‌తిస్తారా?
వివ‌ర‌ణ :    విదేశాల నుంచి వ‌చ్చిన వారిలో యాదృచ్చికంగా ఎంపిక చేసిన వారినుంచి న‌మూనాలు సేక‌రించిన త‌ర్వాత వారు విమానాశ్ర‌యం వెలుప‌ల‌కు వెళ్ల‌డానికి అనుమ‌తిస్తారు. ప్ర‌స్తుతం ఈ యాదృచ్ఛిక శాంపిలింగ్ ను 2 శాతానికి ప‌రిమితం చేశారు. అది కూడా కేంద్ర ఆరోగ్య కుటుంబ సంక్షేమ మంత్రిత్వ‌శాఖ మార్గ‌ద‌ర్శ‌కాల ప్ర‌కారం నిర్వ‌హిస్తారు. ప్ర‌యాణికులే స్వంతంగా ఇందుకు చెల్లింపు చేస్తారు. ఎయిర్ లైన్ లు, విమానాశ్ర‌యాలు రాష్ట్రాలు, కేంద్ర పాలిత ప్రాంతాలు యాదృచ్ఛిక న‌మూనా ల సేక‌ర‌ణ‌కు సంబంధించి అధికారుల‌తో  స‌మ‌న్వ‌యం చేసుకుంటాయి.


3. విదేశీ ప్ర‌యాణికులు ( రిస్క్ గా నిర్ధారించిన దేశాల‌నుంచి మిన‌హా) రిస్క్ గా నిర్ధారించిన దేశాల మీదుగా వెళుతూ ఎయిర్ పోర్టులో ఆగిన‌పుడు, వారు వ‌చ్చిన త‌ర్వాత స్వీయ ధృవీక‌ర‌ణ ఆధారంగా అలాంటి వారిని ప‌రీక్ష‌ల నుంచి మిన‌హాయించ‌వ‌చ్చా?

వివ‌ర‌ణ :  రిస్క్ జాబితా లో లేని దేశం నుంచి ఎవ‌రైనా వ్య‌క్తి ప్ర‌యాణిస్తుండి, అది కూడా కేవ‌లం మార్గ‌మ‌ధ్య‌లో  ( ఇమిగ్రేష‌న్ వ‌ద‌ల‌కుండా) రిస్క్ గ‌ల దేశం మీదుగా గ‌మ్యస్థానానికి విమానంలో ప్ర‌య‌ణించే వారికి ప‌రీక్ష‌ల‌నుంచి మిన‌హ‌యింపు ఇవ్వ‌వ‌చ్చు. అయితే ఎవ‌రైనా వ్యక్తి గ‌త 14 రోజుల‌లో రిస్క్ క‌లిగిన దేశాల‌కు ప్ర‌యాణించిన‌ట్ట‌యితే  అత‌ను  లేదా ఆమె వ‌చ్చిన త‌ర్వాత  అత‌డు లేదా ఆమె వ‌చ్చిన త‌ర్వాత ప‌రీక్ష‌లు నిర్వ‌హించుకోవ‌ల్సిందిగా లేదా అద‌న‌పు ఆంక్ష‌లు పాటించాల్సిందిగా కోర‌వ‌చ్చు.

4. విదేశీ ప్ర‌యాణికులు వచ్చిన అనంత‌రం కోవిడ్ 19 ప‌రీక్ష‌కు ,వ‌చ్చిన వెంట‌నే  త‌మ ఖ‌ర్చుతో ప‌రీక్ష‌కు న‌మూనా ఇవ్వాల్సి ఉంటుంది. అలాంటి ప్ర‌యాణికులు ప‌రీక్ష ఫ‌లితం వ‌చ్చే వ‌ర‌కు తాము చేరుకున్న విమానాశ్ర‌యంలోనే  త‌మ త‌దుప‌రి ప్ర‌యాణ అనుసంధాన విమాన స‌ర్వీసులో వెళ్లేవ‌ర‌కు వేచి ఉండాల్సి ఉంటుంది.
వివ‌ర‌ణ‌:
అంటే, నెగ‌టివ్ ఫ‌లితాలు వ‌చ్చిన త‌ర్వాత , ప్ర‌యాణికులు త‌మ తుది గ‌మ్య‌స్థానాన్ని చేరేందుకు అనుసంధాన విమాన స‌ర్వీసుల‌లో వెళ్ల‌వ‌చ్చు.

ప్ర‌శ్న 5:

నిర్దిష్ట విమానంలోని ప్రతి ప్రయాణికుడికి ఫలితం వచ్చే వరకు అందరూ వేచి ఉండాల్సిన అవసరం లేకుండా వారి వారి ఫలితాలు అందినందున ప్రయాణికుల నిష్క్రమణ దశల వారీగా ఉండవచ్చా?
వివ‌ర‌ణ :  ప్ర‌యాణికులు నెగ‌టివ్ రిపోర్టు వ‌చ్చిన త‌ర్వాత త‌మ త‌మ గ‌మ్య‌స్థానాల‌కు వెళ్ల‌డానికి అనుసంధాన విమానాల‌లో వెళ్ల‌వ‌చ్చు. అంద‌రు స‌హ ప్ర‌యాణికుల ఫ‌లితాలు వ‌చ్చే వ‌ర‌కు వారు వేచి ఉండాల్సిన అవ‌స‌రం లేదు.



(Release ID: 1777358) Visitor Counter : 123